ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ తాజాగా చేసిన పెద్ద రీఫార్మ్స్‌పై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఆయిల్, కార్న్‌ఫ్లేక్స్, హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ లాంటి డైలీ యూజ్ వస్తువులపై ట్యాక్స్ తగ్గడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు కొంత ఊపిరి పీల్చే పరిస్థితి. సెంటర్ చెబుతోంది "ఇది పేదలకి, రైతులకి, సాధారణ ప్రజలకి పెద్ద లాభం."

కానీ మరో వైపు, స్టేట్స్ మాత్రం కంగారు పడుతున్నాయి. ఈ రీఫార్మ్స్ వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోనుంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ లాంటి రాష్ట్రాలు వెంటనే సెంటర్‌కి పరిహారం అడిగాయి. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం అడగకపోవడంతో కొత్త వివాదం మొదలైంది. సీపీఐ(ఎం) నేతలు స్పష్టంగా అంటున్నారు - "పరిహారం లేకపోతే రాష్ట్రానికి పెద్ద లోటు వస్తుంది, డెవలప్‌మెంట్ ప్రాజెక్టులు ఆగిపోతాయి."
ఆంధ్రప్రదేశ్ సీపీఐ(ఎం) కార్యదర్శి వి. శ్రీనివాస్ రావు మాటల్లో "ధరలు తగ్గడం బాగానే ఉంది. కానీ, దీని వలన రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద ఆదాయ లోటు వస్తుంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు సెంటర్‌కి పరిహారం డిమాండ్ చేశాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అడగలేదు. ఆ లోటు చివరికి ప్రజలపైనే పన్నుల రూపంలో పడక తప్పదు" అని ఆయన హెచ్చరించారు.
జీఎస్టీ రేట్లు తగ్గించడంతో ప్రజలకు కొంత ఉపశమనం లభిస్తుందనేది నిజం. కానీ ప్రభుత్వం పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే, ఇది అంత సింపుల్ కాదు. ఎందుకంటే రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో పెద్ద గ్యాప్ పడుతుంది.
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌లో జీఎస్టీ షేర్ ఒక పెద్ద ఇన్‌కమ్ సోర్స్. ఇప్పుడు రేట్లు తగ్గిపోవడంతో, ఫుడ్ ఐటమ్స్, డైలీ యూజ్ ప్రాడక్ట్స్, ఇన్సూరెన్స్ వంటివి తక్కువ ట్యాక్స్ కేటగిరీలోకి వెళ్తాయి. ఇక్కడి నుండి వచ్చే రెవెన్యూ ఆటోమేటిక్‌గా పడిపోతుంది.
ఆ గ్యాప్‌ని నింపడానికి రెండు మార్గాలే ఉన్నాయి. సెంటర్ నుంచి పరిహారం (Compensation) రావాలి. ఇది వస్తే సమస్య తేలిక అవుతుంది. కానీ... ఇప్పటికే సెంటర్ కాస్త కఠినంగా ఉంటోంది. దక్షిణ రాష్ట్రాలన్నీ డిమాండ్ చేస్తున్నా, సెంటర్ నుంచి స్పష్టమైన హామీ రాలేదు.
లేదంటే కొత్త పన్నులు వేయాలి. రాష్ట్రం రెవెన్యూ కోసం మరో మార్గం లేదు. ఇది జరిగితే ప్రజల మీద మళ్లీ బరువు పడుతుంది. ఉదాహరణకు కొత్త సెస్, సర్వీస్ చార్జీలు, లేదా ఎగ్జిస్టింగ్ పన్నుల పెంపు.
ఒకవేళ సెంటర్ పరిహారం ఇవ్వకపోతే? అదే సీరియస్ టెన్షన్. ప్రభుత్వానికి డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ ఫండ్ చేయడానికి డబ్బు తగ్గిపోతుంది. కొత్త రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ స్లో అవుతాయి. వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేయడంలో కూడా డిలే రావచ్చు.
సీపీఐ(ఎం) లీడర్స్ ఇప్పటికే క్లియర్‌గా అంటున్నారు "ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలా మౌనం వహించడం సరికాదు. సెంటర్ నుంచి పరిహారం కోసం గట్టిగా డిమాండ్ చేయకపోతే, ఏపీకి డైరెక్ట్‌గా నష్టం అవుతుంది. అభివృద్ధి ప్రాజెక్టులు అటకెక్కుతాయి. మళ్లీ పన్నులు పెంచితే భారమంతా ప్రజల మీదే పడుతుంది."
ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్‌లో పెద్దగా ఆదాయం వచ్చే కొన్ని రంగాలే నేరుగా ప్రభావితమయ్యాయి. ఉదాహరణకు హెయిర్ ఆయిల్, కార్న్‌ఫ్లేక్స్, హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి వస్తువుల మీద ట్యాక్స్ తగ్గడంతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఖచ్చితంగా రిలీఫ్. కానీ అదే సమయంలో ఇవి ప్రభుత్వానికి మంచి రెవెన్యూ ఇచ్చే వస్తువులు కావడంతో ఏపీకి వచ్చే జీఎస్టీ షేర్ పడిపోతోంది. అలాగే లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్‌ల మీద ట్యాక్స్ తగ్గడంతో ప్రజలకు లాభం అయినా, ప్రభుత్వానికి ఫైనాన్షియల్ సర్వీసెస్ నుండి వచ్చే ఆదాయం తగ్గిపోతుంది.
అదే సమయంలో MSMEలకు పెద్దగా లాభం రాలేదు, రైతులకు కూడా ట్యాక్స్‌లో పెద్ద మార్పులు లేవు. రైతులకు తక్కువ బెనిఫిట్, కానీ రాష్ట్రానికి ఎక్కువ రివెన్యూ లోటు. కన్‌స్ట్రక్షన్ మెటీరియల్స్‌కి వస్తే, సిమెంట్, స్టీల్ మీద ట్యాక్స్ తగ్గించలేదు. దాంతో బిల్డింగ్ ప్రాజెక్టుల ఖర్చు అలాగే ఉంది. కానీ రేట్లు తగ్గిస్తే మాత్రం రాష్ట్ర బడ్జెట్‌లో మరో పెద్ద గ్యాప్ వచ్చేది. మొత్తానికి ప్రజలకు మంచి అనిపించే ఈ నిర్ణయాలు ఏపీ ప్రభుత్వానికి మాత్రం ఫైనాన్షియల్‌గా మిక్స్‌డ్ ఇంపాక్ట్ ఇస్తున్నాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications