అమెరికాలో భారతీయ-అమెరికన్ మృతి.. ఎవరు ఈ సుచిర్ బాలాజీ ?
అమెరికాలో భారత సంతతికి చెందిన తెలుగు వారు కొని రంగాల్లో అదరగొడుతూ కీలక పదవులు చేపడుతుంటే మరోవైపు అంతుచిక్కని కారణాలతో మృతి చెందుతున్నారు. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. భారతీయ అమెరికన్ ఓపెన్‌ఏఐ రీసెర్చర్ సుచిర్ బాలాజీ శాన్ ఫ్రాన్సిస్కో అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించారు. శాన్ ఫ్రాన్సిస్కో ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ అతని మరణాన్ని ఆత్మహత్యగా తేల్చగా, అతని అపార్ట్మెంట్లో ఆత్మహత్యకుగల ఎటువంటి ఆధారాలు దొరికాలేదు అని అధికారులు తెలిపారు.
26 ఏళ్ల ఈ టెక్కీ గతనెల అక్టోబర్‌లో న్యూయార్క్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఓపెన్‌ఏఐ కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించడంతో పాటు దీనితో ఉన్న సవాళ్ల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. సుచిర్ బాలాజీ OpenAIలో రీసెర్చర్ గా కూడా పనిచేశారు. ఈ ఏడాది మొదట్లో కంపెనీని విడిచిపెట్టిన తర్వాత అతను అదే కంపెనీ పై విమర్శలు కురిపించారు. ఆన్‌లైన్ డేటాను ఇమిటేషన్ ద్వారా కంపెనీ కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించాడు.

అయితే అతని చివరి సోషల్ మీడియా పోస్ట్‌లో కూడా GenAI కంపెనీలపై దాఖలైన కేసులు అన్ని చూసిన తర్వాత తనకు ఆసక్తి కలిగిందని బాలాజీ పేర్కొన్నాడు. "నాకు మొదట్లో కాపీరైట్ మొదలైన వాటి గురించి పెద్దగా తెలియదు, కానీ GenAI కంపెనీలపై దాఖలైన అన్ని లాసూట్స్ చూసిన తర్వాత ఆసక్తిగా మారింది" అని పోస్ట్ చేసారు.
సుచిర్ బాలాజీ ఎవరు?
సుచిర్ బాలాజీ బర్కిలీలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ నుండి కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ఓపెన్‌ఏఐలో ఇంటర్న్ చేశారు. తరువాత ఆగస్టు 2016లో Quoraలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేసాక OpenAIలో మెషిన్ లెర్నింగ్ ఇంటర్న్ చేశాడు. తరువాత ScaleAIలో మెషిన్ లెర్నింగ్‌లో ఇంటర్న్‌గా ఇంకా హీలియాలో కూడా ఇంటర్న్ చేసారు. ఈ సంవత్సరం ఆగస్టులో సంస్థ నుండి బయటికి వచ్చే ముందు అతను నవంబర్ 2020 నుండి OpenAIలో టెక్నికల్ స్టాఫ్ లో ఒకరిగా కూడా ఉన్నారు.
OpenAIలో బాలాజీ డేటాపై పని చేసేవాడు, సంస్థ కోసం డేటా బేస్డ్ రీసర్చ్ కూడా చేసేవారు. OpenAI ఎం చేస్తుందో ఆలోచించిన తర్వాత అతను సంస్థను వొదిలేసాడు. ఇందుకు కారణం సంస్థ కాపీరైట్ చట్టాలను ఉల్లంఘిస్తోందని ఇంకా దీని వల్ల చెడు ప్రభావాలను కలిగిస్తుందని తెలుసుకున్నాడు. ఎలోన్ మస్క్ సహా పలువురు ప్రముఖులు సుచిర్ బాలాజీ మృతిపై సంతాపం వ్యక్తం చేసారు.


Click it and Unblock the Notifications