ఆఫీసుల్లో మహిళలపై ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. తాజాగా దీనికి సంబంధించిన ఓ ఘటన సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం లింక్డ్ ఇన్ లో వైరల్ అవుతోంది.. ఓ మహిళ చేసిన పోస్టులో ఆమె తల్లి అయిన కారణంగా పదోన్నతిని కోల్పోయింది. కార్యాలయాల్లో ఇంకా వివక్ష కొనసాగుతోందని పోస్ట్ ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది. ఢిల్లీకి చెందిన ప్రగ్యా అనే మహిళ తనకు జరిగిన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఆమె పోస్ట్ ప్రకారం.. ఢిల్లీకి చెందిన ప్రగ్యా ఒక అనుభవజ్ఞులైన మార్కెటింగ్ లీడర్. ఎన్నో సంవత్సరాల పాటు శ్రమించి తన కెరీర్‌ను నిర్మించుకుంది.ఇటీవల ప్రముఖ బ్రాండ్‌లో చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ (CMO) పదవికి ఆమె దరఖాస్తు చేసుకుంది. ఆ ఇంటర్వ్యూలో ఆమె ప్రతిభకంటే.. తల్లిగా ఉన్న స్థితిని కంపెనీ యాజమాన్యం ఎక్కువగా పరిగణలోకి తీసుకుంది. మొదటి 11 నిమిషాల టెలిఫోన్ ఇంటర్వ్యూలో ఆమె తన ప్రొఫెషనల్ ప్రయాణాన్ని వారికి వివరించింది. అదే సమయంలో చివరి మూడు నిమిషాల్లో ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఆమె వ్యక్తిగత జీవితంపై ప్రశ్నలు సంధించాడు.

మీకు పిల్లలెందమంది? వారి వయస్సెంత? మీరు ఇక్కడ పని చేస్తున్నప్పుడు వాళ్లని ఎవరు చూస్తారు? మీ భర్త ఏం చేస్తారు?" లాంటి ప్రశ్నలు ఇంటర్వ్యూ చివరలో ఆమెకు ఎదురయ్యాయి. ప్రగ్యా తన అనుభవాల గురించి మాట్లాడే అవకాశం కోసం ఎదురు చూసినా ఎక్కువగా వాటి మీదే ప్రశ్నలు సంధించారు. చివరకు ఆమె ఎలాగోలో వాటికి సమాధానాలు ఇచ్చింది. అయితే మరుసటి రోజు HR నుండి మీ ఆఫర్ తిరస్కరించామంటూ ఆమెకు మెసేజ్ వచ్చింది.మీ పిల్లలు చాలా చిన్నవారు అనే కారణంతో కంపెనీ మిమ్మల్ని తిరస్కరించిదని చెప్పుకొచ్చారు. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ కు గురయింది.
అదే రోజు ప్రగ్యా తన అనుభవాన్ని LinkedIn లో ఆవేదనతో తనకు జరిగిన అనుభవాన్ని పంచుకుంది. నన్ను అర్హతలతో కాదు, తల్లిగా గుర్తించి ఉద్యోగం ఇవ్వలేదని బాధపడ్డారు. నా పనిని బట్టి కాకుండా, నా కుటుంబ స్థితిని బట్టి నన్ను నిర్ణయించడం బాధాకరమని చెప్పుకొచ్చారు. ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అనేకమంది మహిళలు తమకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని కామెంట్లలో తెలిపారు.
ప్రసూతి సెలవుల తర్వాత అవకాశాలు కోల్పోవడం, ప్రమోషన్లు దక్కకపోవడం, ప్రాజెక్ట్‌లకు దూరంగా ఉండాల్సివచ్చిన సందర్భాల గురించి చాలా మంది తమ అభిప్రాయాలను తెలిపారు. ఈ పోస్టులో తల్లులుగా ఉన్న మహిళలకు ఎదురయ్యే వివక్ష గురించి చర్చించారు. లక్షలాది మంది ఉద్యోగస్తులు, ముఖ్యంగా మహిళలు, తమ అనుభవాలను పంచుకుంటూ.. మాతృత్వంపై ఉన్న అపారదృష్టిని దీర్ఘంగా ఎత్తిచూపారు.తండ్రులను ఎప్పుడైనా ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా?" అని కొందరు ప్రశ్నించారు. ఇది స్పష్టమైన జెండర్ పక్షపాతం అని మరి కొందరు ప్రశ్నించారు.

మాకు కుటుంబం ఉందని కాకుండా, మేము ఎంత పనితీరు చూపగలమో బట్టి మమ్మల్ని తీర్పు వేయాలని పోస్ట్ పెట్టిన మహిళ ప్రశ్నిస్తున్నారు. ఆమె గతంలో డైవర్సిటీ, ఇన్‌క్లూజన్ కార్యక్రమాలకు కూడా నాయకత్వం వహించారు.POSH కమిటీల్లో పని చేసిన అనుభవం కూడా ఆమెకు ఉంది. కార్యాలయాల్లో పురుష ఆధిపత్యం ఇంకా కొనసాగుతోందని ఇది మారాలని చెప్పుకొచ్చారు. ఏదైమైనా ఈ పోస్ట్ కార్యాలయాల్లో జరిగే వివక్షను మరోమారు తెరమీదకు తెచ్చింది.


Click it and Unblock the Notifications