బంగారం ధరలు చుక్కలను తాకుతున్నాయి. సామాన్యుడు బంగారం కొనుగోలు చేయాలంటేనే వణికిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ధరలు అందనంత ఎత్తుకు వెళ్లాయి. ఈ నేపథ్యంలో అందరి మదిలో ఓ ప్రశ్న ఉదయిస్తోంది. అదేంటంటే.. బంగారం ధరలను ఎవరు నిర్ణయిస్తారు. మార్కెట్లు, కేంద్ర బ్యాంకులు, వ్యాపారుల పాత్ర ఏమైనా ఉందా.. ఈ స్థాయిలో పెరుగుదల వెనుక ఉన్న మతలబు ఏంటి అనేది చాలా మంది మదిలో మెదులుతున్న ప్రశ్నగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో బంగారం ధరలు పెరుగుదల వెనుక ఉన్న శక్తులు ఏవో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
వాస్తవానికి బంగారం ధరను నిర్ణయించే ఏకైక అధికారం ప్రపంచంలో ఎవరికీ లేదు. ఔన్స్ బంగారం విలువను ఏ ప్రభుత్వం, కేంద్ర బ్యాంకు లేదా ఒకే ఎక్స్ఛేంజ్ నియంత్రించదు. అయితే దీనికి బదులుగా బంగారం ధర అనేది ప్రపంచవ్యాప్తంగా పనిచేసే మార్కెట్లలో నిరంతరం కనుగొనబడే విలువగా చెప్పవచ్చు. ఫ్యూచర్స్ ఎక్స్ఛేంజీలు, స్పాట్ మార్కెట్లు, భౌతిక ట్రేడింగ్ హబ్‌లలో ప్రతి సెకనూ కొనుగోలుదారులు-విక్రేతలు చేసే లావాదేవీల ద్వారానే బంగారం ధర వెలుగులోకి వస్తుంది.

Gold ప్రత్యేకత ఏమిటంటే.. అది ఒకేసారి వస్తువు (Commodity) లాగా మరోసారి ద్రవ్య ఆస్తి (Monetary Asset) లాగా కనిపిస్తుంది. రాగిలా తవ్వకం జరుగుతుంది.. అలాగే కరెన్సీలా నిల్వ చేయడం ఉంటుంది, చమురులా వ్యాపారం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆర్థిక అనిశ్చితి సమయంలో బీమాలాగా హెడ్జ్‌గా ఉపయోగిండం జరుగుతుంది. ఈ ద్వంద్వ స్వభావం వల్లే బంగారం ధరలు కేవలం సరఫరా-డిమాండ్‌కే కాకుండా వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయాలు, కరెన్సీ బలం, కేంద్ర బ్యాంకుల విధానాలకు కూడా వెంటనే ప్రతిస్పందిస్తాయి.
ప్రపంచ బంగారం మార్కెట్‌కు ప్రధాన బెంచ్‌మార్క్ లండన్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భౌతిక బంగారం కేంద్రంగా ఉంది. LBMA (లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్) ద్వారా రోజుకు రెండుసార్లు జరిగే ఎలక్ట్రానిక్ వేలం ప్రక్రియలో బంగారం ధర స్థిరపడుతుంది. ఈ వేలంలో JP మోర్గాన్, గోల్డ్‌మన్ సాచ్స్, UBS వంటి ప్రధాన బ్యాంకులు పాల్గొంటాయి. కొనుగోలు-అమ్మకాల మధ్య అసమతుల్యత తగ్గే వరకు ధర సర్దుబాటు అవుతూ చివరకు ఒక పరిష్కార ధరకు చేరుతుంది. ఈ ధర ప్రపంచ సరఫరా గొలుసుకు దిశానిర్దేశకంగా పనిచేస్తుంది.
లండన్ భౌతిక బంగారాన్ని నిర్వహిస్తే.. న్యూయార్క్‌లోని COMEX ధరల ఆవిష్కరణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక్కడ బంగారం ఫ్యూచర్స్ కాంట్రాక్టుల ద్వారా వ్యాపారం అవుతుంది. ఈ కాగితపు బంగారం పరిమాణం వాస్తవ భౌతిక సరఫరాను అనేక రెట్లు మించిపోతుంది. హెడ్జ్ ఫండ్‌లు, సంస్థాగత పెట్టుబడిదారులు US ద్రవ్యోల్బణ డేటా, వడ్డీ రేట్లు, ఉద్యోగ గణాంకాలకు క్షణాల్లో స్పందిస్తూ మార్కెట్లో భారీ కదలికలను సృష్టిస్తారు. దీని ఫలితంగా భౌతిక బంగారం చేతులు మారకముందే ధరల్లో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటాయి.
అలాగే కేంద్ర బ్యాంకులు బంగారం మార్కెట్లో అత్యంత శక్తివంతమైన కానీ నెమ్మదైన ప్రభావాన్ని చూపే శక్తిగా నిలుస్తాయి. అమెరికా, చైనా, భారత్ వంటి దేశాల కేంద్ర బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేయడం ద్వారా తమ కరెన్సీ రిస్క్‌ను తగ్గించుకుంటాయి. ఈ కొనుగోళ్లు తాత్కాలిక ట్రేడింగ్ కోసం కాకుండా.. దశాబ్దాల పాటు నిల్వ చేసుకునే ఉద్దేశంతో జరుగుతాయి. అందువల్ల ఇవి బంగారం సరఫరాను మెల్లగా కానీ స్థిరంగా తగ్గించి దీర్ఘకాలిక ధరలకు మద్దతు ఇస్తాయి.
మరో అంశం ఏంటంటే.. బంగారం ధరపై నిజమైన వడ్డీ రేట్లు కీలక పాత్ర పోషిస్తాయి. ద్రవ్యోల్బణం వడ్డీ ఆదాయాన్ని మించిపోయినప్పుడు, బంగారం ఆకర్షణీయంగా మారుతుంది. అలాగే, US డాలర్ బలహీనపడినప్పుడు బంగారం ధరలు పెరగడం సాధారణం. పెట్టుబడిదారులు డాలర్ మీద పెట్టుబడులను వెనక్కి తీసుకుని సేఫ్ హెవెన్ బంగారం మీదకు తమ పెట్టుబడులను మళ్లిస్తారు.దీంతో డాలర్ పడిపోయి బంగారం ధరలకు రెక్కలు వస్తాయి.
క్లుప్తంగా చెప్పాలంటే.. బంగారం విలువను ప్రపంచంలో ఎవరో ఒకరు నిర్ణయించడం జరగదు. ప్రపంచ మార్కెట్లు, కేంద్ర బ్యాంకులు, ట్రేడర్లు, ఆర్థిక డేటా, భౌగోళిక రాజకీయ పరిణామాల సమిష్టి ప్రభావమే బంగారం ధరను ప్రతి రోజు, ప్రతి సెకనూ నిర్ణయిస్తుంది. ఇది బంగారాన్ని కేవలం పెట్టుబడి సాధనంగా కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక కీలక సూచికగా నిలబెడుతుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications