ఇప్పుడు బెంగళూరులో 1BHK అంటే కేవలం చిన్న ఫ్లాట్ మాత్రమే కాదు. ఇది లగ్జరీ, ప్రాక్టికల్, వర్క్-ఫ్రెండ్లీ లివింగ్ సింబల్ గా మారుతోంది. ఒకప్పుడు స్టార్టర్ హోమ్‌గా పరిగణించిన 1BHKలు ఇప్పుడు నెలకు రూ. 1 లక్షకు పైగా రెంట్ తెస్తున్నాయి, ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్స్, నిపుణులు, తరచూ ట్రావెల్ చేసే ప్రొఫెషనల్స్ కోసం టెక్ హబ్‌లు, ఎయిర్‌పోర్ట్ దగ్గర ఉండటం వారి కోసం పెద్ద ప్లస్ పాయింట్.

ఇటీవల రష్యాకు చెందిన విక్టోరియా కోవన్ తన గురుగ్రామ్ ఖర్చుల వీడియోను షేర్ చేసింది. ఒక్క రెంట్‌కే ఆమె రూ.1.2 లక్షలు చెల్లిస్తున్నట్టు చెప్పడంతో, ఇండియాలో నిజంగా జీవన ఖర్చులపై చర్చ మళ్లీ వేడెక్కింది. కొంతమంది లగ్జరీ 1BHKలు రూ. 3 లక్షలు కూడా అడుగుతున్నాయి. ఇది ఇండియాలోని మెట్రో లివింగ్ ఖర్చు ఎంత వేగంగా పెరుగుతుందో చూపిస్తుంది.
బెంగళూరులో ట్రెండ్: గురుగ్రామ్ మాత్రమే కాదు, బెంగళూరులో కూడా డిమాండ్ సరిగ్గా అదే విధంగా పెరుగుతోంది. చిన్న ఫ్లాట్లు, పూర్తి ఫర్నిచర్, హై-ఎండ్ సౌకర్యాలు ఇవన్నీ రెంటర్స్ కోసం ప్రధాన ఆకర్షణ.
రియల్ ఎస్టేట్ అంచనాల ప్రకారం, ఇక్కడి 1BHKలలో సుమారు 30% అద్దెకు తీసుకున్నవే, మిగతావి సెకండ్ హోమ్‌లుగా ఉంచబడ్డాయి. ఎక్కువగా సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, విదేశీయులు, ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్ ఇలాంటి ఫ్లాట్లు తీసుకుంటున్నారు. వీరికి లగ్జరీ ఇంటీరియర్స్, డిష్ వాషర్లు, వాలెట్ పార్కింగ్, ఇన్‌హౌస్ రెస్టారెంట్స్ వంటి సౌకర్యాలు ముఖ్యం.
బెంగళూరులో ట్రాఫిక్ ప్రతి రోజూ సమస్యగా మారడంతో, చాలా ప్రొఫెషనల్స్ ఆఫీసు దగ్గర చిన్నగా ఉన్నా కానీ లగ్జరీ ఫ్లాట్లను అద్దెకు తీసుకుంటున్నారు. వీకెండ్స్‌లో ఇంటికి వెళ్ళి, వారంలో ఆఫీసు దగ్గర ఉంటారు. ఫలితం ప్రతి రోజు గంటల సమయం వెళ్ళి రావాల్సిన ఇబ్బంది తగ్గుతుంది.
భారతీయ సిటీ - లీలా రెసిడెన్సెస్ (థానిసాంద్ర): 900 sq.ft 1BHK - రూ. 1 లక్ష రెంట్.
ఫోర్ సీజన్స్ ప్రైవేట్ రెసిడెన్సెస్ (ఎయిర్‌పోర్ట్ రోడ్): 2,100 sq.ft 1BHK - రూ. 3 లక్ష, కాంసీయర్జ్, హౌస్‌కీపింగ్, చెఫ్ సౌకర్యాలు. మింటెనెన్స్ రూ. 30-40 వేలు
ఎన్.ఆర్. నార్త్‌వుడ్ (మణ్యాటా టెక్ పార్క్ దగ్గర): 300-400 sq.ft స్టూడియోలు రూ. 50,000, 1BHK రూ. 80,000.
అశోక్ నగర్ - UKN Miraya Brunton (1,300 sq.ft) రూ. 90,000
సదాశివనగర్ - Orchid View (1,500 sq.ft)రూ.1 లక్ష
ఉల్సూర్ - SBB Sapphire, జేపీ నగర్ - ఇండిపెండెంట్ ఫ్లోర్ (1,500 sq.ft) రూ.1 లక్ష
బెంగళూరులో లగ్జరీ 1BHKల కోసం ఇన్వెస్ట్‌మెంట్ ఇప్పుడు క్లియర్ అవుతోంది. ఉదాహరణకు, లీలా రెసిడెన్సెస్ వంటి ప్రీమియం ప్రాజెక్టులలో 1BHK కొనుగోలు చేయాలంటే రూ. 90 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఖర్చు అవుతుంది. ఇది ప్రాజెక్ట్ లొకేషన్, ఫ్లాట్ సైజ్, మరియు అందిస్తున్న సౌకర్యాల ఆధారంగా మారవచ్చు. అద్దె విషయానికి వస్తే, సాధారణ ఇంటీరియర్స్ ఉన్న 1BHKలు నెలకు రూ. 35,000-రూ. 40,000కి రెంట్‌కి లభిస్తాయి. కానీ ఫుల్ ఫర్నిచర్డ్, లగ్జరీ ఇంటీరియర్స్ ఉన్న ఫ్లాట్లు రూ. 55,000-రూ. 60,000 వరకు రెంట్లు తెస్తాయి. అంటే, చిన్న ఇన్వెస్ట్‌మెంట్, కానీ మంచి డిమాండ్ ఉన్న ప్రాంతంలో పెట్టినప్పుడు మంచి రెంటల్ రిటర్న్స్ పొందవచ్చు.
కొంతమంది ల్యాండ్‌లార్డులు 2BHK ఫ్లాట్లను పెద్ద 1BHKగా మార్చి అమ్మకానికి/అద్దెకి పెట్టారు. నిపుణులు చెప్పేది ఎంటాంటే, చిన్న ఫ్లాట్లు ఎక్కువ రెంటు తెస్తున్నాయి, పెద్ద ఇళ్లు ఇప్పుడు అంత డిమాండ్‌లో లేవు. పూర్తిగా ఫర్నిచ్‌డ్, తక్కువ సంరక్షణ అవసరం ఉండే, ఆఫీసు దగ్గర ఉన్నవి ఫ్లాట్లు ఇప్పుడూ కొత్త ట్రెండ్.
ఒక క్లయింట్ ఉదాహరణ: ఫ్యామిలీ దూరంలో ఉంది, కూతురు చదువు వేరే ప్రాంతంలో ఉంది, ఆఫీసుకు డైలీ వెళ్ళటం కష్టంగా ఉండడంతో, 1BHK రెంట్ తీసుకున్నారు. వారాంతం ఫ్యామిలీ దగ్గర, వారంలో ఆఫీసు దగ్గర టైమ్ నీ బ్యాలెన్స్ చేస్తున్నాను.
బెంగళూరులో 1BHKలు ఇప్పుడు లగ్జరీ ఇన్వెస్ట్‌మెంట్ & స్టేటస్ సింబల్గా మారాయి. ట్రాఫిక్, వర్క్ లొకేషన్, హై-ఎండ్ సౌకర్యాలు ఇవన్నీ రెంట్ డిమాండ్ పెంచుతున్నాయి. చిన్న, ఫర్నిచర్డ్, లో-మెయింటెనెన్స్ ఫ్లాట్లు ఇప్పటి బెంగళూరు టెక్ ప్రొఫెషనల్స్ కోసం అత్యంత ఆకర్షణీయమైనవి.
More From GoodReturns

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్‌పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Bengaluru: ఒక్క జీతం నమ్మకుంటే మునిగిపోవడమే! ఐటీ నిపుణులకు CA వార్నింగ్!

Hyderabad: రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లకు గోల్డెన్ ఛాన్స్? బడ్జెట్ తర్వాత మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి?

Bengaluru: ఆపదలో పుట్టిన ఆలోచన! గ్యాస్ సమస్యకి సామాన్యుడి అద్భుత పరిష్కారం..!

బెంగళూరు నుండి 2 వేల స్సెషల్ బస్సులు.. ఉగాది నాడు ప్రయాణికులకు KSRTC గుడ్ న్యూస్..

Bengaluru: గ్యాస్ కొరత సాకుతో అదనపు బాదుడు.. వైరల్ అవుతున్న బెంగళూరు కేఫ్ బిల్లు!

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్‌కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!



Click it and Unblock the Notifications