ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) సరికొత్త కోవిడ్ 19 గైడ్‌లైన్స్, అప్‌డేట్స్ మొబైల్ యాప్‌ను లాంచ్ చేసింది. WHO COVID-19 అప్ డేట్స్ పేరుతో ఈ అనువర్తనం ఆరోగ్య నిపుణుల నుండి వైరస్ గురించిన విశ్వసనీయ సమాచారాన్ని కూడా అందిస్తుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రభుత్వాలు విడుదల చేసిన యాప్స్‌లో సాధారణంగా ఉండే కాంట్రాక్ట్ ట్రేసింగ్ సహా పలు ఫ్యూచర్స్ అందుబాటులో లేవు.

అప్ డేట్స్
అంతకుముందు ఏప్రిల్ నెలలో WHO కరోనా వైరస్ ఫోకస్డ్ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీనిని విడుదల చేసిన కాసేపటికే యాప్ స్టోర్ నుండి తీసుకు వచ్చింది. ఎందుకంటే ఇది ప్రజల లభ్యత కోసం కాదని తొలగించాయి. WHO COVID-19 అప్ డేట్స్ యాప్ ఈ ఏడాది పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ విడుదల చేసిన యాప్‌కు మాదిరి వర్క్ చేస్తుంది. సేఫ్టీ అడ్వైజ్‌తో పాటు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించడం ద్వారా COVID-19 వ్యాప్తిని పరిమితం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.

విరాళం ఇవ్వొచ్చు
WHO COVID-19 అప్ డేట్స్ యాప్ తాజా స్థానిక వార్తలను అందిస్తుంది. సమాచారాన్ని ఇస్తుంది. రియల్ టైమ్ నోటిఫికేషన్స్ ఉంటాయి. కరోనా గురించి ప్రజలు తెలుసుకోవడానికి వీలుగా జాతీయ, అంతర్జాతీయ కేసులు హోమ్ స్క్రీన్‌లో ఉంటాయి. హైజీన్ పద్ధతుల కోసం స్క్రోల్ చేసుకోవచ్చు. అంటే ఆరోగ్యం విషయంలో పాటించాల్సిన విధానాలు కూడా ఇందులో ఉంటాయి. అంతేకాదు, WHO's COVID-19 రెస్పాన్స్ ఫండ్‌కు కూడా ఈ యాప్ ద్వారా విరాళం ఇవ్వవచ్చు.

కరోనా ప్రశ్నలకు సమాధానం
WHO COVID-19 Updates యాప్‌లో వైరస్ గురించి పూర్తి నమ్మదగిన సమాచారం ఉంటుంది. ఈ యాప్‌లో కరోనా వైరస్ అవుట్ బ్రేక్ గురించి తెలుసుకునేందుకు హోమ్ స్క్రీన్‌పై దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య ఎప్పటికప్పుడు కనిపిస్తుంది. కరోనా నుండి ఎలా రక్షించుకోవాలో కూడా ఇందులో తెలుసుకోవచ్చు. కరోనా గురించి పలు ప్రశ్నలకు ఇక్కడ సమాధానం దొరుకుతుంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications