ప్రధాని మోదీతో కనిపిస్తున్న ఈ నీలి కళ్ల మహిళ ఎవరు ? భారతదేశంతో సంబంధం ఏంటి..
PM Modi US Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ముగిసింది. దీని తరువాత అమెరికా నుంచి ప్రధాని నేరుగా భారతదేశానికి తిరిగి బయలుదేరారు. అయితే తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాగే అమెరికన్ వ్యాపారవేత్త ఎలోన్ మస్క్‌ను కూడా కలిశారు. ప్రత్యేకమైన విషయం ఏంటంటే ప్రధాని మోడీ ఎలోన్ మస్క్‌ను కలిసినప్పుడు ఒక మహిళ అలాగే ముగ్గురు పిల్లలు కూడా ఆయనతో పాటు కనిపించారు.
ప్రధాని మోదీతో కనిపించిన ఈ మహిళ పేరు శివోన్ జిలిస్. ఈ మహిళ ఎలోన్ మస్క్ భాగస్వామి అని చెబుతుంటారు. ఈ ముగ్గురు పిల్లలు కూడా ఎలోన్ మస్క్ పిల్లలు. అయితే శివోన్ జిలిస్'కు భారతదేశంతో సంబంధం ఉంది. మరోవైపు శివోన్ జిలిస్ ఎలోన్ మస్క్ కంపెనీలోని ఒకదానిలో కీలక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

అసలు శివోన్ జిలిస్ ఎవరు?
శివోన్ జిలిస్ ఎలోన్ మస్క్ కంపెనీ న్యూరాలింక్‌లో డైరెక్టర్. నివేదికల ప్రకారం, ఎలోన్ మస్క్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలలో ఇద్దరు కవలలు అజూర్ (అమ్మాయి) అండ్ స్ట్రైడర్ (అబ్బాయి) కూడా ఉన్నారు. మూడవ సంతానం ఎలోన్ మస్క్ & కెనడియన్ సింగర్ గ్రిమ్స్ కుమారుడు.
భారతదేశంతో సంబంధం ఏంటి ?
శివోన్ జిలిస్ ప్రతుతం ఎలోన్ మస్క్ జీవిత భాగస్వామి అని, ఎలోన్ మస్క్ డోనాల్డ్ ట్రంప్‌కు దగ్గరగా మారినప్పటి నుండి జిలిస్ ఎక్కువగా అతనితో కనిపించింది. జిలిస్ నీలి కళ్ళు కూడా బాగా చర్చనీయాంశంగా మారింది. జిలిస్ కు భారతదేశంతో కూడా సంబంధం ఉంది. ఆమె తల్లి పంజాబీ ఇంకా తండ్రి కెనడియన్. జిలిస్ కెనడాలో జన్మించింది. ఆమె 2008లో యేల్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రం అలాగే తత్వశాస్త్రంలో పట్టా పొందారు. జిలిస్ తన కెరీర్‌ను ఫైనాన్స్ ఇంకా వెంచర్ క్యాపిటల్‌లో ప్రారంభించారు. ఆమె IBMలో పనిచేసి, ఆ తర్వాత బ్లూమ్‌బెర్గ్ బీటాకు మారింది.
టెస్లాలో కూడా పనిచేశారు
శివోన్ జిలిస్ 2017 నుండి 2019 వరకు ఎలోన్ మస్క్ కంపెనీ టెస్లాలో ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. శివోన్ జిలిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో నిపుణురాలు. ఆమె ఆటోపైలట్ ఇంకా చిప్-డిజైనింగ్‌లో AI స్కిల్స్ ఉపయోగించారు. ఆటోపైలట్‌లో లాగా టెస్లా కారు స్వయంగా నడుస్తుంది. ఇంకా డ్రైవింగ్ అసిస్టెన్స్ కూడా AI సహాయంతో జరుగుతుంది.


Click it and Unblock the Notifications