నేటితో ఈ ఏడాది ముగుస్తుంది. అయితే 2024 సంవత్సరానికి దేశంలోని అత్యంత సంపన్నుల నుంచి అతి తక్కువ సంపద ఉన్న ముఖ్యమంత్రుల లిస్ట్ వచ్చేసింది. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) అనాలిసిస్ తర్వాత రిపోర్టును విడుదల చేసింది. నివేదికల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 931 కోట్ల నెట్ వాల్యూతో భారతదేశపు అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా నిలిచారు. తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ (రూ. 332.57 కోట్లు), ఆ తరువాత కర్ణాటకకు చెందిన సిద్ధరామయ్య (రూ. 51.94 కోట్లు) ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ధనిక సీఎం కావడం కొత్తేమీ కాదు
2019 నుండి 2024 మధ్య కాలంలో 510 కోట్ల రూపాయల ఆస్తులతో మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యంత ధనిక సిఎంగా అవతరించగా, ఆంధ్రప్రదేశ్‌లో ధనిక సిఎం ఉండటం కొత్తేమీ కాదు. జగన్ కంటే ముందే 2014 నుంచి 2019 మధ్య కాలంలో అత్యంత ధనిక సీఎంగా చంద్రబాబు నాయుడు రూ.177 కోట్ల ఆస్తులను ప్రకటించారు.

ఏ సీఎంకు ఎంత ఆస్తి ఉందంటే ?
చంద్రబాబు నాయుడు (ఆంధ్రప్రదేశ్) - 931 కోట్లు
పెమా ఖండూ (అరుణాచల్ ప్రదేశ్) - రూ. 332.57 కోట్లు
సిద్ధరామయ్య (కర్ణాటక) - రూ. 51.94 కోట్లు
పి. విజయన్ (కేరళ) - రూ 1.19 కోట్లు
మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్) - రూ 15.38 లక్షలు
ఒమర్ అబ్దుల్లా (జమ్మూ కాశ్మీర్) - రూ 55.24 లక్షలు
అత్యధిక ఎక్కువ వయసున్న సీఎం
కేరళ- పి. విజయన్ (77 సంవత్సరాలు)
కర్ణాటక - సిద్ధరామయ్య (75 సంవత్సరాలు)
ఆంధ్రప్రదేశ్ - చంద్రబాబు నాయుడు (74 సంవత్సరాలు)
అతితక్కువ ఆస్తులు ఉన్న సియం
అత్యంత తక్కువ ఆస్తులు ఉన్న ముఖ్యమంత్రులలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన మమతా బెనర్జీ కూడా ఉన్నారు. మమత ఆస్తుల విలువ రూ.15.38 లక్షలు. ఆమె తర్వాత జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఒమర్ అబ్దుల్లా. 55.24 లక్షల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. ఆయన కంటే ఎక్కువ ఆస్తులు ఉన్న కేరళ సీఎం పినరయి విజయన్ ఉన్నారు, అతని మొత్తం సంపద విలువ రూ.1.19 కోట్లు. అయితే ఏడీఆర్ నివేదిక ప్రకారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆస్తుల విలువ రూ. 30 కోట్లని తెలిపింది. ఈయన ఏడో స్థానంలో నిలిచారు. అయితే రేవంత్ రెడ్డికి 1.3 కోట్లు అప్పులు కూడా ఉన్నాయని ఆయన ఆదాయం 13 లక్షలు అని తెలిపింది.
అరుణాచల్ సీఎంకు అత్యధిక సంపద
సంపద పరంగా అరుణాచల్ సీఎం ఖండూ రూ.180.28 కోట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన తర్వాత స్థానాల్లో సిద్ధరామయ్య (రూ. 23.77 కోట్లు), చంద్రబాబు నాయుడు (రూ. 10.32 కోట్లు) ఉన్నారు. నామినేషన్ డాక్యూమెంట్లతో పాటు భారత ఎన్నికల కమిషన్‌కు అందించిన అఫిడవిట్‌ల ఆధారంగా అనాలిసిస్ జరుగుతుంది. 74 ఏళ్ల చంద్రబాబు నాయుడు దేశంలోనే అతధిక వయసున్న మూడో సీఎం. కర్ణాటకకు చెందిన సిద్ధరామయ్యకు 75, కేరళకు చెందిన విజయన్‌కు 77 ఏళ్లు.
ఈ ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసు
రాష్ట్ర అసెంబ్లీలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అనాలసిస్ చేసిన 31 మంది ముఖ్యమంత్రులలో 13 (42%) మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై 19 కేసులు నమోదవగా వీటిలో ఐపీసీ కింద 32 తీవ్రమైన అభియోగాలు, 80 ఇతర అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులు అవినీతి, నేరపూరిత కుట్ర, ప్రజా భద్రత ఉల్లంఘనలు ఇంకా ఎస్సీ/ఎస్టీ (అట్రాసిటీల నిరోధక) చట్టం కింద ఉల్లంఘనలు వంటి నేరాలకు సంబంధించిన అభియోగాలు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications