Suchir Balaji Death: ప్రపంచ వ్యాప్తంగా టెక్ రంగంలో ప్రస్తుతం ఎక్కడ చూసిన సుచిర్ బాలాజీ పైనే చర్చ కొనసాగుతోంది. అమెరికాలో భారత సంతతికి చెందిన యువ టెక్కీ మరణం ప్రస్తుతం ఏకంగా ఎలాన్ మస్క్ స్థాయి వ్యక్తి స్పందించే స్థాయికి చేరుకోవటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీంతో ఎవరు ఈ సుచిర్ బాలాజీ, ఆమె తల్లి ఇటీవల చేసిన కీలక ఆరోపణలు ప్రస్తుతం అందరి అటెంన్షన్ గ్రాబ్ చేస్తున్నాయి.
వాస్తవానికి 26 ఏళ్ల సుచిర్ బాలాజీ భారతీయ సంతతికి చెందిన వ్యక్తి. ఆయన అమెరికాలోని ఓపెన్ఏఐ కంపెనీలో మాజీ పరిశోధకుడు. అయితే నవంబర్ 26న అకస్మాత్తుగా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఇంట్లో శవమై కనిపించటం అందరినీ కలవరానికి గురిచేసింది. అతడిది ఆత్మహత్య కాదని, మరణం అసహజంగా ఉందని ఉందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఆగస్టులో సుచిర్ బాలాజీ ఉద్యోగానికి రాజీనామా చేశాడు.

ఆ సందర్భంగా సమాజానికి ప్రయోజనం కంటే హాని కలిగించే సాంకేతికతల అభివృద్ధిపై తాను పనిచేయాలనుకోవటం లేదని అప్పట్లో వెల్లడించాడు. ఓపెన్ఏఐ సంస్థ ChatGPT అభివృద్ధి సమయంలో సంస్థ కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించిందని పెద్ద బాంబు పేల్చిన సంగతి తెలిసిందే. వ్యక్తులు వ్యాపార సంస్థల ఆదాయాలకు ఏఐ సాంకేతికత గండి కొడుతోందని తెలిపారు. వీటిపై వేసిన కేసుల్లో సుచిర్ కీలక సాక్షిగా మారనున్న వేళ మరణించటం పెద్ద చర్చకు దారితీసింది.
సుచిర్ మరణంపై అతని తల్లి కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. పోలీసులు ఆత్మహత్యగా నిర్థారించినప్పటికీ ఆయన నివాసంలో వేరే వ్యక్తులు వచ్చినట్లు ఆనవాళ్లు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎఫ్‌బీఐని ప్రైవేట్‌గా విచారణ జరిపించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. OpenAI దాని ఏఐ మోడల్‌లకు శిక్షణ ఇవ్వడానికి కాపీరైట్ చేసిన డేటాను ఉపయోగించడం చట్టవిరుద్ధం మాత్రమే కాదు, ఇంటర్నెట్ భవిష్యత్తుకు భారీ ముప్పును కలిగిస్తుందని సుచిర్ బాలాజీ గతంలోనే ఆందోళన వ్యక్తం చేసిన తర్వాత అకస్మాత్తుగా మరణించటం అందరిలోనూ అనేక అనుమానాలను రేకెత్తించింది. విజిల్‌బ్లోయర్‌గా మారిన సుచిర్ బాలాజీ వ్యవహారం ఓపెన్ఏఐ భవిష్యత్తుకు పెద్ద అడ్డంకిగా మారింది.

ఎలాన్ మస్క్ స్పందన..
కుమారుడి మరణంపై సుచిర్ బాలాజీ తల్లి అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. తాము ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ ను నియమించుకున్నామని, రెండవసారి శవపరీక్ష నిర్వహించి మరణానికి గల కారణాలను కనుక్కునే పనిలో ఉన్నట్లు ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు మరణానికి తెలిపిన కారణాలను ప్రైవేటు సంస్థ ధృవీకరించలేదని ఆమె పేర్కొన్నారు. అతడి నివాసంలో వస్తువులు చెల్లాచెదురుగా ఉండటంతో పాటు బాత్ రూమ్ లో పెనుగులాట జరిగినట్లు అక్కడ ఉన్న రక్తపు మరకలు చూస్తే వేరే వ్యక్తి దాడిచేసినట్లు కనిపిస్తోందని ఆమె చెప్పుకొచ్చారు. దీనిపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్పందిస్తూ దీనిని చూస్తుంటే సుచిర్ బాలాజీది ఆత్మహత్య లాగా కనిపించటం లేదని స్పందించారు.
దీనికి ముందు ఓపెన్ ఏఐలో ఉద్యోగం మానేసిన తర్వాత సుచిర్ ఏఐ రంగంలో తన సొంత వెంచర్లు ప్రారంభించాలని యోచిస్తున్నట్లు చెప్పాడు.2020లో OpenAIలో పూర్తి సమయం చేరడానికి ముందు సుచిర్ బాలాజీ డేటా లేబులింగ్ స్టార్టప్ ScaleAIలో ఇంటర్న్‌గా పనిచేశారు. కంపెనీకి సుచిర్ ఏకుకు మేకులా మారటంతో అతడిని అడ్డు తోలగించుకునే ప్రయత్నంలో భాగంగా ఇది జరిగిందా అనే అనుమానాలు మస్క్ కామెంట్స్ తర్వాత మరింతగా బలపడుతున్నాయి.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications