బీహార్ ప్రభుత్వ మాజీ మంత్రి, సీనియర్ నేత నితిన్ నబిన్ భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. మంగళవారం ఆయన అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. బీహార్ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన నేతగా పేరొందిన నితిన్ నబిన్.. పార్టీ సంస్థాగత బలోపేతం, రాబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కీలక పాత్ర పోషించనున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
పాట్నాలోని బంకిపూర్ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన Nitin Nabin.. 2006 ఉప ఎన్నికలతో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 2010, 2015, 2020, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించి బీహార్ రాజకీయాల్లో స్థిరమైన నేతగా ఎదిగారు. ప్రజా జీవితం పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో, ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో ఆయన తన ఆస్తులు, అప్పులు, పెట్టుబడుల వివరాలను వెల్లడించారు.

అఫిడవిట్ ప్రకారం 12వ తరగతి వరకు మాత్రమే చదివిన నితిన్ నబిన్ నికర విలువ రూ. 3.06 కోట్లు. ఆయనపై ఉన్న మొత్తం అప్పులు సుమారు రూ. 56 లక్షలు. నితిన్ నబిన్, ఆయన కుటుంబ సభ్యుల వద్ద ఉన్న నగదు నిల్వలు కలిపి సుమారు రూ. 60 వేలు మాత్రమే ఉన్నాయి. ఆయన, ఆయన భార్యకు చెందిన వేర్వేరు బ్యాంకు ఖాతాల్లో రూ. 98 లక్షలకుపైగా డిపాజిట్లుఉన్నట్లు వెల్లడైంది.
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. నితిన్ నబిన్ స్వయంగా స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు దూరంగా ఉన్నారు. అయితే, ఆయన భార్య మిడ్-క్యాప్, మల్టీ-క్యాప్ మ్యూచువల్ ఫండ్లలో రూ. 6 లక్షలకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. బీమా విషయంలో నితిన్ నబిన్ వద్ద మూడు LIC పాలసీలు, ఒక HDFC లైఫ్ పాలసీ ఉండగా, ఆయన భార్యకు LIC, SBI లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి. అంతేకాదు MyNeta.comలో పొందుపరిచిన వివరాల ప్రకారం ఆయన భార్య నవీరా ఎంటర్‌ప్రైజెస్ అనే సంస్థకు డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.
ఇక ఆయన వాహనాల విషయానికి వస్తే.. నితిన్ నబిన్ పేరు మీద స్కార్పియో, ఇన్నోవా క్రిస్టా అనే రెండు కార్లు నమోదు అయి ఉన్నాయి. అలాగే, దంపతులు, వారి పిల్లల వద్ద కలిపి సుమారు రూ.11 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు ఉన్నట్లు అఫిడవిట్‌లో వెల్లడైంది. నితిన్ నబిన్‌కు చెందిన చరాస్తులు మొత్తం రూ. 92.71 లక్షలు కాగా, ఆయన భార్య, పిల్లలకు చెందిన చరాస్తుల విలువ రూ.68 లక్షలకు పైగా ఉన్నట్లు పొందుపరిచారు.
స్థిరాస్తుల విషయంలో మాత్రం నితిన్ నబిన్‌కు వ్యవసాయ భూములు, వాణిజ్య భవనాలు లేదా స్వంత ఇల్లు లేవు. అయితే, ఆయన భార్య పేరిట గణనీయమైన స్థిరాస్తులు ఉన్నాయి. వీటిలో రూ. 28 లక్షల విలువైన వ్యవసాయ భూమితో పాటు, పాట్నాలో ఉన్నరూ. 1.18 కోట్ల విలువైన నివాస గృహం కూడా ఉంది. బీహార్ రాజకీయాల్లో అనుభవం, ఆస్తుల విషయంలో పారదర్శకత, పార్టీపై గట్టి పట్టు.. ఇవన్నీ కలగలిపిన నితిన్ నబిన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడంతో.. పార్టీ వ్యూహాల్లో కొత్త దిశ కనిపించనుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications