ట్రంప్ సుంకాలకు చెక్ పెట్టిన భారత సంతతి లాయర్.. ఎవరీ నీల్ కత్యాల్.. కేసు ఎలా వాదించాడు..

టారిఫ్‌ల పేరుతో ప్రపంచ దేశాలను వణికించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుకు సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. ట్రంప్ ప్రభుత్వం అమలు చేసిన సుంకాలు చట్టబద్దం కావని తేల్చి చెప్పింది. United States Supreme Court ఇచ్చిన సంచలన తీర్పు అమెరికా వాణిజ్య విధానాల్లోనే కాదు, రాజ్యాంగ అధికారాల పరిమితుల విషయంలో కూడా ఒక కీలక మైలురాయిగా నిలిచిందని చెప్పవచ్చు. అయితే దీని వెనుక ఉన్నది..కేసును నడిపించింది భారత సంతతి లాయర్ అంటే నమ్మగలరా.. అవును ఈ న్యాయపోరాటంలో భారత సంతతి న్యాయవాది Neal Katyal కీలక పాత్ర పోషించారు.

ట్రంప్ టారిఫ్‌లను వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేసిన చిన్న వ్యాపారులు, అలాగే డెమోక్రాట్ పాలిత రాష్ట్రాల కూటమి తరఫున ఆయన సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించారు.ట్రంప్ సుంకాల అమలుకు 1977 నాటి అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA)ను వినియోగించడాన్ని నీల్ కత్యాల్ తీవ్రంగా వ్యతిరేకించారు.సాధారణంగా జాతీయ భద్రతకు తక్షణ ముప్పు ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించాల్సిన ఈ చట్టాన్ని ట్రంప్ పరిపాలన నిరంతర వాణిజ్య లోటును కారణంగా చూపుతూ, దాదాపు అన్ని దేశాలపై సుంకాలు విధించడానికి ఉపయోగించింది.

Neal Katyal who is Neal Katyal Indian American lawyer US Supreme Court tariff case Trump tariffs Supreme Court lawyer against Trump tariffs Neal Katyal profile US tariff ruling lawyer Indian origin US lawyer Supreme Court trade case presidential tariff powers Trump trade policy challenge constitutional law expert former US Solicitor General Neal Katyal Supreme Court arguments landmark tariff verdict US trade law case separation of powers tariff case

దిగువ కోర్టులు ఇప్పటికే ఇది అధికార దుర్వినియోగమని తేల్చగా.. చివరకు విషయం US Supreme Court ముందుకు వెళ్లింది. దీనిపై ప్రతి వాణిజ్య భాగస్వామిపై సమానంగా సుంకాలు విధించడం అన్యాయమని, ఇది రాజ్యాంగానికి విరుద్ధమని ఆయన వాదించారు. అధ్యక్షుడికి ఉన్న అధికారాలు అపరిమితమేమీ కావని.. వాణిజ్యంపై పన్నులు విధించే అధికారం రాజ్యాంగపరంగా కాంగ్రెస్ పరిధిలోనే ఉందని ఆయన న్యాయస్థానం ముందు వివరించారు. ఈ వాదనలే సుప్రీంకోర్టు తీర్పుకు బలమైన పునాది అయ్యాయి.

2025 నవంబర్‌లో వాదనలు విన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, IEEPAని (International Emergency Economic Powers Act) విస్తృత వాణిజ్య విధానానికి వర్తింపజేయవచ్చా అనే అంశంపై తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. ఫలితంగా 6-3 మెజారిటీతో వచ్చిన తీర్పు ట్రంప్ విధించిన ప్రపంచవ్యాప్త సుంకాలను రద్దు చేసింది. ఈ నిర్ణయంతో ఫిబ్రవరి 2025 నుంచి వసూలు చేసిన 133 బిలియన్ డాలర్లకు పైగా సుంకాలపై రీఫండ్ క్లెయిమ్‌లకు మార్గం తెరచుకుంది. కొన్ని అంచనాల ప్రకారం ఈ మొత్తం 175 బిలియన్ డాలర్లకు మించి ఉండవచ్చని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.

తీర్పు అనంతరం నీల్ కత్యాల్ స్పందిస్తూ.. ఈ రోజు అమెరికా సుప్రీంకోర్టు చట్టపరమైన పాలనకే కాదు, అమెరికన్ ప్రజల భద్రతకూ అండగా నిలిచింది. అధ్యక్షులు శక్తిమంతులే కావచ్చు. కానీ రాజ్యాంగం మరింత శక్తిమంతమైనదని న్యాయస్థానం మరోసారి నిరూపించింది. ప్రాథమిక విలువలను కాపాడిన ఈ తీర్పు ఒక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు.

నీల్ కత్యాల్ షికాగోలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు భారత్ నుంచి వలస వెళ్లి అమెరికాలో సెటిల్ అయ్యారు. తల్లి ప్రతిభావంతమైన వైద్యురాలు కాగా.. తండ్రి సురేందర్ ఇంజినీర్‌గా పనిచేశారు. విద్యాభ్యాసంలో అసాధారణ ప్రతిభ చూపిన నీల్, ప్రతిష్ఠాత్మకమైన Yale Law School నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కెరీర్ ప్రారంభ దశలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి Stephen Breyer వద్ద లా క్లర్క్‌గా సేవలందించారు.

2010లో అప్పటి అమెరికా అధ్యక్షుడు Barack Obama హయాంలో నీల్ కత్యాల్ యూఎస్ సొలిసిటర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఈ పదవిలో ఉండగా అనేక కీలక రాజ్యాంగ, జాతీయ భద్రతా కేసుల్లో ప్రభుత్వ తరఫున వాదించారు. ఇప్పటివరకు ఆయన అమెరికా సుప్రీంకోర్టులో 50కిపైగా కేసులు వాదించిన అరుదైన రికార్డు కలిగి ఉన్నారు.

ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నీల్ కత్యాల్ గతంలోనూ న్యాయపోరాటాలు చేశారు. 2017లో ట్రంప్ తొలి పదవీకాలంలో కొన్ని దేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షలకు వ్యతిరేకంగా దాఖలైన కేసుల్లో ఆయన ప్రధాన వాదనకర్తగా వ్యవహరించారు. అంతేకాకుండా ఇంపీచ్: ది కేస్ అగైనెస్ట్ డొనాల్డ్ ట్రంప్ అనే పుస్తకాన్ని రచించి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యారు. సంచలనం సృష్టించిన ఆఫ్రికన్ అమెరికన్ George Floyd హత్య కేసులో మిన్నెసోటా రాష్ట్రం తరఫున ప్రత్యేక ప్రాసిక్యూటర్‌గా వాదించి న్యాయవ్యవస్థలో తన ముద్ర వేశారు.

ఈ విజయాలకు గుర్తింపుగా నీల్ కత్యాల్‌కు అమెరికా న్యాయ విభాగం నుంచి అత్యున్నత పౌర పురస్కారం లభించింది. ట్రంప్ టారిఫ్‌లపై వచ్చిన తాజా తీర్పుతో ఆయన పేరు మరోసారి ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. రాజ్యాంగ పరిరక్షణకు అంకితమైన న్యాయవాదిగా నీల్ కత్యాల్ పాత్రను ఈ తీర్పు మరింత బలంగా చాటిచెప్పింది.

అయితే ఈ తీర్పుకు ప్రతిస్పందనగా ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిని భయంకరమైన నిర్ణయంగా అభివర్ణించిన ఆయన.. 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 122 కింద అన్ని దేశాలపై 10 శాతం తాత్కాలిక సుంకం విధిస్తానని ప్రకటించారు. అయితే ఇది గరిష్టంగా 150 రోజుల వరకే అమలులో ఉండగలదని, పొడిగింపులకు కాంగ్రెస్ అనుమతి అవసరమని నిపుణులు చెబుతున్నారు. భారత్ సహా అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు ఉన్న దేశాలు ఈ తాత్కాలిక సుంకానికి లోబడతాయని వైట్ హౌస్ స్పష్టం చేసింది.

క్లుప్తంగా చెప్పాలంటే ఈ తీర్పు కేవలం ట్రంప్ పరిపాలనకు ఎదురుదెబ్బ మాత్రమే కాదు. ఇది అమెరికా ప్రజాస్వామ్యంలో అధికార విభజన సూత్రాన్ని బలపరిచే చారిత్రక నిర్ణయంగా చెప్పవచ్చు. అధ్యక్షుడి అధికారాలకు రాజ్యాంగ పరిమితులు ఉన్నాయని, వాణిజ్య విధానాల్లో కాంగ్రెస్ పాత్ర ఎంత కీలకమో ఈ తీర్పు మరోసారి స్పష్టంగా చాటింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+