John ternus: ఆపిల్ కొత్త బాస్ ఇతనే! టిమ్ కుక్ వారసుడిగా జాన్ టెర్నస్.. ఎవరీ హార్డ్‌వేర్ జీనియస్?

ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) ఒక చారిత్రాత్మక మార్పుకు సిద్ధమైంది. గత 15 ఏళ్లుగా ఆపిల్‌ను 4 ట్రిలియన్ డాలర్ల విలువైన కంపెనీగా తీర్చిదిద్దిన టిమ్ కుక్, సిఈఓ పదవి నుంచి తప్పుకుంటున్నారు. ఆయన స్థానంలో ఆపిల్ హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ విభాగం అధిపతి జాన్ టెర్నస్ (John Ternus) సెప్టెంబర్ 1, 2026 నుంచి కొత్త సిఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఐఫోన్, ఐప్యాడ్ , మాక్ వంటి విప్లవాత్మక ఉత్పత్తుల వెనుక ఉన్న అసలైన ఇంజనీర్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీని నడిపించబోతున్నారు.

Who is John Ternus net worth and career of Apple hardware chief set to replace Tim Cook as CEO in 2026

ఎవరీ జాన్ టెర్నస్?

50 ఏళ్ల జాన్ టెర్నస్ ఆపిల్ అంతర్గత వర్గాల్లో అత్యంత నమ్మకమైన నాయకుడిగా పేరు పొందారు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టా పొందిన ఆయన, 2001లో ఆపిల్‌లో చేరారు. మొదట్లో మాక్ (Mac) మానిటర్ల డిజైన్ టీమ్‌లో పనిచేసిన టెర్నస్, తన అసాధారణ ప్రతిభతో అంచెలంచెలుగా ఎదిగారు. ఐఫోన్, ఐప్యాడ్, ఆపిల్ వాచ్ , ఇటీవల వచ్చిన విజన్ ప్రో వంటి ప్రతి ఫిజికల్ ప్రొడక్ట్ రూపకల్పనలోనూ ఆయన పాత్ర కీలకం. 2021లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన, ఇప్పుడు ఆపిల్ చరిత్రలో ఎనిమిదవ సిఈఓగా రికార్డు సృష్టించబోతున్నారు.

ఆస్తుల వివరాలు (Net Worth)

ఆపిల్ వంటి భారీ సంస్థలో 25 ఏళ్లుగా కీలక పాత్రల్లో ఉన్న టెర్నస్ ఆర్థిక పరిస్థితి కూడా ఆ స్థాయిలో ఉంది. సెలబ్రిటీ నెట్ వర్త్ అంచనా ప్రకారం, జాన్ టెర్నస్ ఆస్తి విలువ సుమారు $75 మిలియన్లు (సుమారు రూ. 630 కోట్లు). ఇందులో ఆయన పొందిన జీతం, బోనస్‌లు , స్టాక్ కాంపెన్సేషన్ ఉన్నాయి. అయితే, సిఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఆదాయం విపరీతంగా పెరగనుంది. టిమ్ కుక్ గత ఏడాది సుమారు $74.6 మిలియన్ల ప్యాకేజీని అందుకున్నారు, ఇప్పుడు టెర్నస్ కూడా అదే స్థాయి జీతభత్యాలను పొందే అవకాశం ఉంది. పోలిక కోసం చూస్తే, టిమ్ కుక్ నికర ఆస్తి విలువ ప్రస్తుతం $3 బిలియన్ల (సుమారు రూ. 25,000 కోట్లు) సమీపంలో ఉంది.

టిమ్ కుక్ వారసత్వం, సవాళ్లు

టిమ్ కుక్ హయాంలో ఆపిల్ మార్కెట్ విలువ పది రెట్లు పెరిగింది. ఆయన ఒక గొప్ప ఆపరేషనల్ మేధావిగా నిరూపించుకున్నారు. అయితే, టెర్నస్ ముందు ఇప్పుడు భారీ సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలతో పోటీ పడటం, సిరి (Siri) ని గూగుల్ జెమిని మోడల్‌తో రీవాంప్ చేయడం వంటివి ఆయన ప్రాధాన్యతలు కానున్నాయి. ఒక హార్డ్‌వేర్ ఇంజనీర్‌గా టెర్నస్, స్టీవ్ జాబ్స్ తరహాలో కొత్త ఆవిష్కరణలు చేయగలరా లేదా అనేది ఇప్పుడు టెక్ ప్రపంచంలో ఆసక్తికరంగా మారింది.

సవాళ్లు ఇవే..

జాన్ టెర్నస్ (John Ternus) నియామకం ఆపిల్ తన మూలాలకు, అంటే హార్డ్‌వేర్, ప్రాడక్ట్ డిజైన్‌కు మళ్ళీ పెద్ద పీట వేయబోతోందనే సంకేతాన్ని ఇస్తోంది. టిమ్ కుక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగుతూ టెర్నస్‌కు మార్గదర్శకత్వం చేయనున్నారు. ఐటీ రంగంలో నాయకత్వ మార్పులు సహజమే అయినా, ఆపిల్ వంటి సంస్థలో జరిగే ఈ మార్పు ప్రపంచ టెక్నాలజీ దిశను ప్రభావితం చేస్తుంది. టెర్నస్ తన ఇంజనీరింగ్ నాలెడ్జ్‌తో ఆపిల్‌ను ఐదు ట్రిలియన్ డాలర్ల మైలురాయి వైపు నడిపిస్తారా అనేది వేచి చూడాలి. ముఖ్యంగా చైనాతో ఉన్న సరఫరా గొలుసు (Supply Chain) సమస్యలు , అమెరికాలో ఎదురవుతున్న యాంటీ ట్రస్ట్ కేసులను ఆయన ఎలా ఎదుర్కొంటారనేది కీలకం.

జాన్ టెర్నస్ (John Ternus) నాయకత్వ శైలి చాలా ప్రశాంతంగా, సహకార ధోరణితో ఉంటుందని ఆయన సహచరులు చెబుతుంటారు. ఆయన కేవలం ఒక మేనేజర్ మాత్రమే కాదు, ఒక ప్రాడక్ట్ ఎలా ఉండాలో క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి. పర్సనల్ లైఫ్‌లో ఆయనకు సైక్లింగ్ , రేసింగ్ కార్లు అంటే చాలా ఇష్టం. ఒత్తిడిలో కూడా స్థిరంగా నిర్ణయాలు తీసుకోవడం ఆయన ప్రత్యేకత. ఆపిల్ ప్రయాణంలో ఈ సెప్టెంబర్ 1 ఒక కొత్త అధ్యాయం కానుంది. ఒక ఇంజనీర్ చేతికి ప్రపంచపు అతిపెద్ద టెక్ సామ్రాజ్యం చిక్కడం కచ్చితంగా శుభపరిణామమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+