Amrita Ahuja: ఎవరీ అమృతా అహుజా.. హిండెన్‍బర్గ్ నివేదికలో ఆమె పేరు ఎందుకుంది..!
జాక్ డోర్సే మొబైల్ చెల్లింపుల సంస్థ బ్లాక్ పై హిండెన్ బర్గ్ రూపొందించిన తాజా నివేదికలో భారత సంతతి మహిళపై కీలక ఆరోపణలు చేసింది. అమృతా అహుజాపై హిండెన్ బర్గ్ రిపోర్ట్ పలు విషయాలు ప్రస్తావించింది. అమృతా అహుజా బ్లాక్ కంపెనీలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO)తో పాటు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(CFO)గా ఉన్నారు. మె 2018లో బ్లాక్ లో సీఎఫ్ఓగా జాయిన్ అయ్యారు. బ్లాక్ కు అంతకు ముందు స్క్వేర్స్ అని పేరు ఉండేది. 2021లో స్క్వేర్స్ ను బ్లాక్ గా పేరు మార్చారు.
అమృత తల్లిదండ్రులు భారత్ నుంచి వెళ్లి అమెరికాలోని ఓహియో రాష్ట్రంలోని క్లీవ్‌ల్యాండ్‌లో సెటిల్ అయ్యారు. అక్కడ వారు డే-కేర్ సెంటర్ నిర్వహిస్తూ ఉపాధి పొందేవారు. అమృత అహుజా కొన్నాళ్లపాటు సమ్మర్ క్యాంప్ కౌన్సిలర్‌గా పనిచేశారు. ఆమెకు భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఆమె 2021లో Airbnbలో డైరెక్టర్ల బోర్డుక, 2022లో డిస్కార్డ్‌లో డైరెక్టర్ల బోర్డుకు నియమితులయ్యారు. ఆమె బ్లాక్ లో చేరక ముందు మోర్గాన్ స్టాన్లీ, వాల్ట్ డిస్ని కంపెనీలో విశ్లేషకురాలిగా పని చేశారు.

2007లో అమృత అహుజా ఫాక్స్‌లో బిజినెస్ డెవలప్‌మెంట్ డైరెక్టర్‌గా చేరారు. దానికి ముందు స్ట్రీమింగ్ సర్వీస్ హులును ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించారు. క్యాండీ క్రష్, కాల్ ఆఫ్ డ్యూటీ వంటి వీడియో గేమ్‌ల తయారీదారు యాక్టివిజన్ బ్లిజార్డ్ కోసం ఆమె 2010లో ఫాక్స్‌ను విడిచిపెట్టారు. అమృత అహుజా లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, అహుజా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్‌లో ఆర్థిక శాస్త్రాన్ని అభ్యసించారు. 2007లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి MBA పట్టా పొందారు. హిండెన్ బర్గ్ నివేదికతో బ్లాక్ షేర్లు 22 శాతం పడిపోయాయి.


Click it and Unblock the Notifications