Gold Loan: తాకట్టు పెట్టిన బంగారం పోతే ఎవరిది బాధ్యత..!

బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకునేవారి సంఖ్య పెరుగుతోంది. చాలా మంది భారీగా పసిడి పై రుణాలు తీసుకుంటారు. ఒక వేళ మీ తాకట్టు పెట్టిన బంగారం దొంగతనానికి గురైతే ఏం చేస్తారు. కస్టమర్‌కు పరిహారం ఎలా లభిస్తుంది. అనేది చాలా మందికి సందేహంగా ఉంటుంది. తాకట్టు పెట్టిన బంగారాన్ని సురక్షితంగా భద్రపరిచే బాధ్యత పూర్తిగా బ్యాంకుదేనని ఆర్బీఐ నిబంధనలు చెబుతున్నాయి.
బ్యాంకులు తమ సేఫ్ వాల్ట్‌లలో కస్టమర్ల బంగారాన్ని తగిన భద్రతా ఏర్పాట్లతో కాపాడాలని ఆర్బీఐ నిబంధనలు విధించింది. తాకట్టు పెట్టిన ఆభరణాలకు తగిన ఇన్సూరెన్స్ రక్షణ కల్పించడం కూడా లెండర్ల బాధ్యత అని నిపుణులు చెబుతున్నారు.

ఒకవేళ లెండర్ కస్టడీలో ఉన్న బంగారం దొంగతనానికి గురైతే.. ఆ నష్టానికి బ్యాంకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. అయితే దొంగతనం జరిగిన వెంటనే కస్టమర్లు కొన్ని కీలకమైన విషయాలపై స్పష్టత కలిగి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. నష్ట పరిహారానికి సంబంధించి, బ్యాంకు వద్ద భద్రపరిచారనే కారణంతో అపరిమితమైన పరిహారం ఆటోమేటిక్‌గా లభించదని గుర్తించుకోవాలన్నారు. దొంగతనం జరిగిన పరిస్థితులు, లెండర్ అగ్రిమెంట్ బాధ్యతలు, ఇన్సూరెన్స్ కవరేజ్, వర్తించే చట్టాల ఆధారంగా పరిహార మొత్తం ఆధారపడి ఉంటుందని పేర్కొంటున్నారు.

Gold

తీసుకున్న మొత్తం గోల్డ్ లోన్ ఎంత ఉందో.. అదే బంగారపు అసలు విలువ అని భావించకూడదని వివరిస్తున్నారు. బంగారపు నాణ్యత, బరువు, మార్కెట్ విలువ ఆధారంగానే లెండర్ లేదా ఇన్సూరెన్స్ కంపెనీ పరిహారాన్ని లెక్కిస్తుందన్నారు. అందువల్ల ఈ విషయంలో బ్యాంక్ నుంచి అధికారిక స్పష్టతను రాతపూర్వకంగా తీసుకోవడం చాలా ముఖ్యమని గుర్తు చేస్తున్నారు. తాకట్టు పెట్టిన పసిడి పోయినంత మాత్రాన మీరు తీసుకున్న లోన్ ఆటోమేటిక్‌గా రద్దు కాదని చెబుతున్నారు. రుణం అనేది ఒక ప్రత్యేకమైన ఒప్పందం కాబట్టి.. తాకట్టు పెట్టిన సెక్యూరిటీ మాయమైనప్పటికీ కట్టాల్సిన లోన్ బాధ్యత అలాగే ఉంటుందన్నారు.

రుణం డిఫాల్ట్ కారణంగా బ్యాంకు చేసే నిబంధనల ప్రకారమైన వేలానికి, దొంగతనానికి చాలా తేడా ఉందని గుర్తు చేస్తున్నారు. ఒకవేళ బ్యాంకు సహాయం చేయడానికి నిరాకరిస్తే.. ముందుగా వారి అధికారిక గ్రీవెన్స్ సెల్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. సమస్య పరిష్కారం కాకపోతే RBI ఓంబ్‌డ్యుమన్ ఫ్రేమ్‌వర్క్‌ను సంప్రదించొచ్చని గుర్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో ప్లెడ్జ్ రిసిప్ట్, లోన్ అగ్రిమెంట్, వాల్యుయేషన్ రిపోర్ట్, పోలీస్ కంప్లైంట్ కాపీ వంటి పత్రాలు కీలక పాత్ర పోషిస్తాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+