White collar Jobs:ఆర్థిక అనిశ్చితి భయాలు, AI వంటి నూతన టెక్నాలజీలలో పెట్టుబడులకుగాను పలు కంపెనీలు ఉద్యోగులకు లేఆఫ్స్ ఇస్తున్నాయి. ఈ సమయంలో కొత్త ఉద్యోగులను రిక్రూట్ చేసుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఇదికాస్తా దేశంలోని వైట్ కాలర్ ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ ట్రెండ్ పై ప్రముఖ మీడియా సంస్థ చేసిన పరిశోధనలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
సెన్సెక్స్‌లోని 30 కంపెనీలపై ప్రముఖ మీడియా సంస్థ అధ్యయనం నిర్వహించింది. ఆయా సంస్థల్లో ఉద్యోగుల సంఖ్యపై ఫోకస్ చేసింది. 2018-19తో పోలిస్తే 2023-24లో వైట్ కాలర్ ఉద్యోగుల వృద్ధి దాదాపు సగానికి పడిపోయినట్లు చెప్పి బాంబు పేల్చింది. సింహ భాగం కంపెనీలలో ఇదే ట్రెండ్ కొనసాగుతున్నట్లు నివేదించింది. ఐదేళ్ల క్రితం 8.4 శాతంగా ఉన్న ఉద్యోగ కల్పన గతేడాది నాటికి 4.4 శాతానికి క్షీణించినట్లు వెల్లడించింది.

IT మరియు కన్జ్యూమర్ సెక్టార్లలో ఏర్పడిన ఒత్తిడి ఈ మందగమనానికి కారణమని HR విశ్లేషకులు చెప్పినట్లు సదరు సంస్థ నివేదించింది. 2022-23తో పోలిస్తే 2023-24లో ఇన్ఫోసిస్, SBI, HCL, టాటా మోటార్స్, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్ సహా 6 కంపెనీలలో నికర ఉపాధి తగ్గినట్లు పేర్కొంది. ఇక ఇదే సమయంలో దిగ్గజ IT కంపెనీలు TCS, విప్రో ఉద్యోగుల సంఖ్య వరుసగా 13 మరియు 23 వేల చొప్పున మందగించినట్లు తెలిపింది. ఇన్ఫీలో అయితే ఏకంగా 26 వేల మేర క్షీణత నమోదైనట్లు గమనించింది.
ఇదిలా ఉండగా HCL, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ కంపెనీలు తమ శాశ్వత ఉద్యోగుల సంఖ్యను పెంచాయి. కానీ టెంపరరీ సిబ్బంది తగ్గుముఖం పట్టడంతో ఓవరాల్ గా ఉద్యోగుల సంఖ్య క్షీణించినట్లు తెలుస్తోంది. కానీ ఆశ్చర్యకరంగా ప్రభుత్వ గణాంకాలు మాత్రం నిరుద్యోగిత తగ్గుముఖం పట్టినట్లు చెబుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. గతేడాదితో పోలిస్తే ఈసారి EPFOలో కొత్తగా చందాదారులు చేరడంతో అధికారికంగా ఉద్యోగాలు పొందినవారి సంఖ్య వేగవంతం కావడం శుభపరిణామని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications