టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ క్లయింట్లకు ఇటీవల లేఖ రాసింది. సీఈవో, సీవోవోలపై ఇటీవల గుర్తు తెలియని ఉద్యోగులు తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదం నేపథ్యంలో క్లయింట్లకు భరోసా ఇచ్చేందుకు లేఖ రాసింది. ఐటీ ఔట్ సోర్సింగ్ సంస్థ ఎవరెస్ట్ గ్రూప్ సీఈవో పీడర్ బెండర్ శ్యామ్యూల్ మాట్లాడుతూ... ఇది కేవలం కస్టమర్లకు లేఖ మాత్రమేనని, వారు ఇన్ఫోసిస్‌లోని ఖాతాలను పట్టించుకోరని, వారికి కావాల్సింది ఇన్ఫోసిస్ నుంచి నాణ్యమైన సేవలు మాత్రమేనని, అది మాత్రమే పట్టించుకుంటారన్నారు.
ఇన్ఫోసిస్ విజిల్ బ్లోయర్స్.. మరిన్ని వార్తల కోసం...
కంపెనీలోని అసంప్తులు కంపెనీలో కొత్త మార్పులను నెమ్మదింప చేస్తాయని చెప్పారు. కానీ మార్కెట్ లీడర్‌గా ఎదగాల్సిన సమయంలో ఇవి ముఖ్యమన్నారు. కానీ ఈ అసమ్మతి మాత్రం కంపెనీకి ప్రయోజనకరం కాదన్నారు. సుదీర్ఘమైన వివాదాలు ఐటీ సంస్థను భారీ పరివర్తన నుంచి దూరం చేస్తాయన్నారు. మార్కెట్లో లీడర్‌గా ఎదగాలంటే అవి మారాలన్నారు.

కాగా, ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్, సీవోవోపై గుర్తు తెలియని ఉద్యోగులు తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆదాయాలను, లాభాలను పెంచి చూపిస్తున్నారని, అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. బోర్డుతో పాటు అమెరికా మార్కెట్ల నియంత్రణ సంస్థకు కూడా ఆ ఉద్యోగులు లేఖ రాశారు. ఇటీవలి కొన్ని త్రైమాసికాలతో పాటు ప్రస్తుత త్రైమాసికంలో అదే తరహా చర్యలు చేపట్టినట్లు సెప్టెంబర్ 20వ తేదీన వారు లేఖలో ఆరోపించారు. దీంతో ఇన్పోసిస్ షేర్లు కూడా నష్టపోయిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications