ట్రాఫిక్ వల్ల ఫ్లయిట్ మిస్ అయ్యారా.. డోంట్ వర్రీ.. ఉబర్ మీకు నష్ట పరిహారం ఇస్తుంది..

ముంబై రోడ్లపై ప్రయాణించడం అంటే ఒక సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే గుంతలు పడిన రోడ్లు, రోడ్డు పక్కన తవ్వకాలు, పొడవైన ట్రాఫిక్ జామ్‌లతో విమానాశ్రయానికి టైంకి చేరుకోవడం ఒక ఛాలెంజ్ అని చెప్పవచ్చు. మీరు ఎప్పుడైనా క్యాబ్‌లో బయటకు వెళ్ళినపుడు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి మీ ఫ్లయిట్ మిస్ అవుతానేమో అనే ఎప్పుడైనా భయపడ్డారా.. దీని దృష్టిలో ఉంచుకొని క్యాబ్ అగ్రిగేటర్ ఉబర్ మీ కోసం ఒక ప్రత్యేకమైన అఫర్ తీసుకువచ్చింది. ఏంటంటే ఇప్పుడు మీరు ఉబర్ క్యాబ్‌లో ప్రయాణిస్తున్నప్పుడు మీ ఫ్లయిట్ మిస్ అయితే, కంపెనీ మీకు రూ.7,500 వరకు పరిహారం ఇస్తుంది. ఈ కొత్త పథకం గురించి పూర్తి సమాచారం మీకోసం..

while in Uber Riding If you miss your flight due to heavy traffic dont worry you will get 7500 compensation from company

ఉబర్ కొత్త ఇన్సూరెన్స్ పథకం: ముంబైలో ట్రాఫిక్, అతుకుల రోడ్లు సాధారణం. దీన్ని దృష్టిలో ఉంచుకుని క్యాబ్ సర్వీస్ అందించే సంస్థ ఉబర్ 'మిస్డ్ ఫ్లైట్ కనెక్షన్ కవర్' అనే కొత్త ఇన్సూరెన్స్ స్కిం ప్రారంభించింది. ఉబర్ క్యాబ్‌లో విమానాశ్రయానికి వెళుతున్నప్పుడు ట్రాఫిక్ లేదా గతుకుల రోడ్ల కారణంగా ప్రయాణీకులు ఫ్లయిట్ మిస్ అయితే, అతనికి రూ.7,500 వరకు పరిహారం లభిస్తుంది. ఈ పథకం ఫిబ్రవరి చివరి నుండి అమలు చేసింది. అలాగే దీన్ని రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ సహకారంతో ప్రారంభించారు. అంతేకాకుండా, ప్రయాణంలో ఏదైనా ప్రమాదం జరిగితే వైద్య ఖర్చులను కూడా ఉబర్ భరిస్తుంది.

ముంబై రోడ్ల పరిస్థితి దారుణం: ముంబై రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా మారింది, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) 701 కి.మీ పొడవైన రోడ్ల మరమ్మతు పనులను నిలిపివేయాల్సి వచ్చింది, దింతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదురుకొంటున్నారు. విమానాశ్రయానికి చేరుకోవడంలో ఆలస్యం జరిగితే ప్రయాణికులు క్యాబ్ డ్రైవర్లతో గొడవలు పడుతున్నారని చెబుతున్నారు. ఈ కారణంగా చాలా మంది క్యాబ్ డ్రైవర్లు విమానాశ్రయానికి వెళ్లడానికి దూరంగా ఉంటున్నారు. అందుకే ఈ సమస్యను పరిష్కరించడానికి ఉబర్ ఒక ప్రత్యేక ఇన్సూరెన్స్ పథకం ప్రారంభించింది. ఇప్పుడు ప్రయాణీకులు కేవలం రూ.3 అదనంగా చెల్లించడం ద్వారా ఈ ఫెసిలిటీ పొందవచ్చు. ఈ ఫెసిలిటీ కొందరికి మాత్రమే లభిస్తుంది, అంటే ఎవరైన ప్రయాణీకుడు వెళ్లాల్సిన గమ్యస్థానం "airport" అని సెలెక్ట్ చేసుకొని ట్రాఫిక్ వల్ల మార్గ మధ్యంలో ఫ్లయిట్ మిస్ అయితే అప్పుడు ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం బ్యాంకు అకౌంట్లో డబ్బు క్రెడిట్ కావడానికి ఫ్లయిట్ టికెట్ కాపీ, విమానయాన సంస్థ నుండి 'నో ట్రావెల్ అండ్ రీఫండ్' సర్టిఫికేట్, కొత్త టికెట్ కాపీ, చెక్కు వంటి కొన్ని డాకుమెంట్స్ సబ్మిట్ చెయ్యాలి.

క్యాబ్ డ్రైవర్ల ఇబ్బందులు : ట్రాఫిక్, అధ్వాన్నమైన రోడ్ల కారణంగా సంపాదన తగ్గిందని ముంబైలోని క్యాబ్ డ్రైవర్లు చెబుతున్నారు. ఈ వారంలో మంగళవారం రోజున ఉబర్ ఇతర క్యాబ్ సర్వీసుల డ్రైవర్లు ముంబై విమానాశ్రయంలో ఆకస్మిక సమ్మెకు దిగారు. క్యాబ్ కంపెనీలు ఇప్పటికే 25-30% కమీషన్ వసూలు చేస్తున్నాయని, దానికి తోడు రోడ్లు సరిగా లేకపోవడం వల్ల వాహనాలు త్వరగా చెడిపోతున్నయని, దీనివల్ల రిపేర్ ఖర్చు పెరుగుతుందని అంటున్నారు. ముంబై రోడ్ల దుస్థితిపై ప్రజలు సోషల్ మీడియాలో కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ముంబై వీధుల్లో ప్రజల ఆగ్రహం: ఈ కొత్త ఇన్సూరెన్స్ పథకం ముంబైలో ప్రయాణించే వారికీ ఖచ్చితంగా కొంత రిలీఫ్ కలిగిస్తుంది, కానీ రోడ్లు సరిగ్గా మరమ్మతులు చేయనంత వరకు, ట్రాఫిక్ సమస్య మరియు చెడు రోడ్లు అలాగే ఉంటాయి. ఇది ప్రయాణీకులను మాత్రమే కాకుండా క్యాబ్ డ్రైవర్ల ఆదాయాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఉబర్ చేపట్టిన ఈ చొరవ ప్రస్తుతానికి ఉపయోగకరంగా ఉండవచ్చు, కానీ ముంబై రోడ్లు, ట్రాఫిక్ అనే పెద్ద సమస్యకు శాశ్వత పరిష్కారం మాత్రం కాదు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+