సోమవారం అదానీ గ్రూప్ చెందిన పలు షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. అదానీ గ్రూప్‌కు చెందిన 10 లిస్టెడ్ స్టాక్‌లలో 8 గ్రీన్ లో కొనసాగుతోన్నాయి. 2 స్టాక్స్ మాత్రమే నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ 0.31 శాతం పెరిగింది. అదానీ గ్రీన్ ఎనర్జీ స్టాక్ 0.29 శాతం లాభపడగా.. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ 0.57 శాతం వృద్ధి చెందాయి. అదానీ టోటల్ గ్యాస్ 0.49 శాతం లాభపడింది.
అదానీ ట్రాన్స్‌మిషన్‌లో 0.40 శాతం, అంబుజా సిమెంట్‌లో 0.24 శాతం లాభాలతో ట్రేడవుతున్నాయి. ఎన్డీటీవీ షేరు 0.93 శాతం, ఏసీసీ స్టాక్ 0.15 శాతం పెరిగి ట్రేడవుతున్నాయి. అదానీ పవర్ 0.13 శాతం పడిపోగా.. అదానీ విల్మార్ 0.11 శాతం క్షీణితతో కొనసాగుతోన్నాయి.

అదానీ ఎంటర్‌ప్రైజెస్ రూ.2,458 వద్ద ట్రేడవుతుండగా.. అదానీ పోర్ట్స్ రూ.739, అదానీ ట్రాన్స్‌మిషన్ రూ. 834, అదానీ టోటల్ గ్యాస్ రూ. 672, ఏసీసీ రూ.1,840, అంబుజా సిమెంట్ రూ.456, ఎన్డీటీవీ రూ.232, అదానీ గ్రీన్ రూ.966 వద్ద కొనసాగుతోన్నాయి. అదానీ పవర్ రూ.275, అదానీ విల్మార్ రూ.425 వద్ద నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
స్విస్ E-మొబిలిటీ (హోల్డింగ్) AGలో అనుబంధ సంస్థ 25 శాతం వాటాను కొనుగోలు చేయడంతో TVS మోటార్స్ కంపెనీ లిమిటెడ్ షేర్లు జూన్ 12న ప్రారంభ ట్రేడ్‌లో 2 శాతం పెరిగాయి. ఇప్పటికే ఉన్న మైనారిటీ వాటాదారుల నుండి 25 శాతం వాటాలను కొనుగోలు చేసిన తర్వాత, SEMG TVS మోటార్ (సింగపూర్) Pte Ltd పూర్తి-యాజమాన్య అనుబంధ సంస్థగా మారుతుందని TVS మోటార్ జూన్ 10 న ఫైలింగ్‌లో తెలిపింది.


Click it and Unblock the Notifications