స్టాక్ మార్కెట్ ఈ ఒక్క నెలలోనే పాతాళానికి పడిపోయే మళ్ళీ ఇప్పుడు కాస్త కోలుకుంటుంది. అయితే స్టాక్ మార్కెట్ పడిపోవడానికి చాల కారణాలు తోడయ్యాయి. అందులో ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడి ప్రతికార సుంకాల భయాలు షేర్ మార్కెటుని పట్టి పీడించాయి. కానీ రాబోయే మూడేళ్లలో స్టాక్ మార్కెట్ బంగారం కంటే మెరుగ్గా ఉండనుంది. ఈ వాదన ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ కొత్త రిపోర్ట్ సూచించింది. ఆర్థిక అనిశ్చితి కాలంలో బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా పరిగణిస్తున్నారని కూడా ఈ నివేదికలో పేర్కొంది. కానీ, ఆర్థిక వృద్ధిలో స్టాక్ మార్కెట్ వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం మరింత ప్రయోజనకరంగా ఉండొచ్చు. ఈ రిపోర్ట్ సెన్సెక్స్-టు-గోల్డ్ రేషియోని కూడా ప్రస్తావించింది. దీని అర్థం రాబోయే సంవత్సరాల్లో స్టాక్‌లు బంగారాన్ని అధిగమిస్తాయని. నివేదిక ప్రకారం, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు షేర్లకు అనుకూలంగా ఉన్నాయి.

ఆర్థిక వృద్ధి అవకాశాల కారణంగా స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడం మరింత లాభదాయకంగా ఉండవచ్చని ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ నివేదిక సూచిస్తుంది. పెట్టుబడిదారులకు ఇదోక ముఖ్యమైన అంశం. కారణం ఏమిటంటే మార్కెట్ ట్రెండ్‌లకు అనుగుణంగా పోర్ట్‌ఫోలియోను క్రియేట్ చేసుకోవాలనుకుంటారు. గత 25 ఏళ్లలో బంగారం వార్షిక రాబడిని 12.55% ఇచ్చిందని నివేదిక చెబుతోంది. అదే సమయంలో బిఎస్ఇ సెన్సెక్స్ 10.73% లాభపడింది. అయినప్పటికీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు షేర్లకు అనుకూలంగా ఉన్నాయి. గత 10 సంవత్సరాలలో, బంగారం కేవలం 36% కేసులలో మాత్రమే స్టాక్‌లను అధిగమించిందని నివేదిక చూపిస్తుంది. స్వల్పకాలిక హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ స్టాక్ మార్కెట్ దీర్ఘకాలికంగా మెరుగైన రాబడిని ఇచ్చిందని కూడా చూపిస్తుంది.
బంగారం ధరలు రికార్డు స్థాయిలో : MCXలో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్స్ 10 గ్రాములకు రూ.86,875 వద్ద కొత్త రికార్డు గరిష్ట స్థాయిని తాకాయి, అంటే 0.21% లేదా రూ.189 పెరుగుదలను చూపుతుంది. ఒక్క మార్చిలోనే బంగారం ధరలు 10 గ్రాములకు రూ.2,600 పెరిగాయి. సురక్షిత స్వర్గధామ డిమాండ్ కారణంగా ప్రపంచ మార్కెట్లలో బంగారం ధరలు ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అమెరికా వాణిజ్య సుంకాలు, ఇతర దేశాల ప్రతీకార చర్యల కారణంగా ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగిస్తుందనే భయాలు విలువైన లోహాలకు, ముఖ్యంగా బంగారానికి డిమాండ్‌ను పెంచాయి. బంగారం, స్టాక్ మార్కెట్ ఎల్లప్పుడూ రెండు ప్రముఖ పెట్టుబడి అప్షన్స్. ఆర్థిక సంక్షోభాల సమయంలో బంగారం స్థిరత్వానికి ప్రసిద్ధి చెందింది. అదే సమయంలో ఆర్థిక సంస్కరణల కాలంలో స్టాక్ మార్కెట్ చారిత్రాత్మకంగా మెరుగైన రాబడిని ఇచ్చింది. ఆర్థిక వృద్ధి నుండి ప్రయోజనం పొందేందుకు స్టాక్ మార్కెట్ మంచి స్థితిలో ఉందని ఎడెల్వీస్ నివేదిక నొక్కి చెబుతోంది. దీనివల్ల కంపెనీల ఆదాయాలు పెరిగే అవకాశం ఉంది. ఇంకా రాబోయే సంవత్సరాల్లో ఇన్వెస్ట్మెంట్ రాబడిని పెంచుకోవాలనుకునే వారికి షేర్లు మరింత లాభదాయకమైన పెట్టుబడిగా మారుస్తుంది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications