ఒక ప్రవాస భారతీయుడి కథ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చర్చలకు దారి తీస్తోంది. కెనడాలో స్థిరపడిన ఈ NRI, ఇప్పుడు తన కుటుంబంతో కలిసి ఇండియాలోనే ఒక ప్రశాంతమైన, మంచి వాతావరణం కలిగిన పట్టణంలో జీవించాలని కోరుకుంటున్నాడు. తనకు రిమోట్‌గా పని చేసే సౌకర్యం ఉండటంతో, ఉద్యోగాన్ని వదలకుండానే భారతదేశానికి తిరిగి రావచ్చన్న నమ్మకం ఏర్పడింది. కానీ అతనికి ఒక పెద్ద ప్రశ్న ఎదురైంది ఇప్పుడు ఇండియాకి వచ్చేస్తే ఎక్కడ స్థిరపడాలి?

ఇతడు కోల్‌కతాలో పెరిగినప్పటికీ అక్కడి కాలుష్యం తన పిల్లల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు. "నాకు సొంత నేలపై తిరిగి జీవించాలనే కోరిక ఉంది కానీ పిల్లల భవిష్యత్తు కోసం నిర్ణయం జాగ్రత్తగా తీసుకోవాలి," అని అంటున్నారు.
ఈ అభిప్రాయంతో అతను ప్రస్తుతం కోచి లేదా మైసూర్‌ను ఎంపిక చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. పిల్లల చదువు, ఆరోగ్యం, ఒత్తిడి లేని జీవితం ఇవన్నీ అతని ప్రధాన ఆలోచనలు. ఆయన అభిప్రాయంలో, జీతం 60-70 శాతం తగ్గినా, భారత్‌లో తన కుటుంబానికి అందించే జీవన ప్రమాణం ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. తక్కువ ఆర్థిక లాభం వచ్చినా, కుటుంబానికి కలిగే మానసిక ప్రశాంతత, జీవన నాణ్యతకు అది సరిపోతుందనే నమ్మకంతో ముందుకు సాగుతున్నాడు.
అతను ఇటీవల కోచి, మైసూరు వంటి టియర్-2 నగరాలపై దృష్టి పెట్టాడు. ఇవి రెండూ భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాలు. కోచిలో ప్రస్తుతం ప్రవాసుల వలస (expat culture) మెల్లగా పెరుగుతోంది. అక్కడ జీవన ఖర్చులు కూడా చాలా పరిమితంగా ఉంటున్నాయి, అంటే అధిక బరువు లేకుండా సౌకర్యవంతంగా జీవించవచ్చు. మైసూరూ ఏమో ప్రశాంతంగా ఉంటుంది, మంచి పాఠశాలలు, పరిశుభ్రమైన వాతావరణం, చరిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన నగరం. అయితే, "సహజంగా ఆ ప్రదేశాలకి ఒకసారి విసిట్ చేయొచ్చు కానీ అదే అక్కడ నివాసించాలి అంటే ఆలోచించాలి అని అంటున్నాడు.
ఈ పోస్ట్‌ను చూసిన తర్వాత సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలను తెలిపారు. "తూర్పు హిమాలయాల్లో లేదా అస్సాం ప్రాంతాల్లో ఒక ప్రశాంతమైన హిల్స్ పట్టణంలో నివసించండి" అంటూ ఒకరు సూచించారు. "మీ స్వస్థలంలోనే మీరు మంచి 'బబుల్'ను ఏర్పరచుకోవచ్చు. మైసూర్లో చాలా తక్కువగా కాలుష్యం ఉంటుంది" అని మరొకరు వ్యాఖ్యానించారు. ఇంకొకరు "ఇందోర్ ని కూడా ఒక్కసారి పరిశీలించండి. మంచి స్కూల్స్, హెల్త్‌కేర్, బెంగాలీ కమ్యూనిటీ కూడా ఉంది" అని చెప్పారు.
ఒక యూజర్ ఇలా స్పందించారు "మీ పిల్లలకు బాగా ఎక్స్‌పోజర్ రావాలంటే బెంగళూరు లేదా హైదరాబాద్ లాంటివి ప్రయత్నించండి. బెంగళూరు ఇప్పటికీ మంచి ఆప్షన్ అని నా అభిప్రాయం, ఎందుకంటే అక్కడ చాలా మంది విదేశాల నుంచి తిరిగొచ్చినవారు ఇంటర్నేషనల్ స్కూల్స్‌లో తమ పిల్లల్ని చేర్పిస్తున్నారు. అందువల్ల USలో చదివిన విధానానికే దగ్గరగా ఉన్న IB కరిక్యులమ్‌లో చదివే అవకాశం ఉంటుంది. అదో వైపు, బెంగళూరులో గ్రీన్ లివింగ్ స్పేస్‌లు చాలా ఉన్నాయి. మీరు సంపాదిస్తున్న స్థాయిలో అక్కడ మంచి పార్కులు, తోటలు ఉన్న ప్రదేశంలో సెటిల్ అవ్వొచ్చు. అంతేకాకుండా మీలాంటి విదేశాల నుంచి వచ్చినవారితో కలిసిమెలిసి ఉండే సోషల్ గ్రూప్ కూడా ఉంటుంది."
మరొకరు ఇలా అన్నారు "మైసూర్ అయితే బాగా సరిపోతుందనిపిస్తోంది. చుట్టుపక్కల ప్రాంతాలకు యాక్సెస్ సులభంగా ఉంటుంది, జీవన ఖర్చు తక్కువగా ఉండటంతో పాటు నాణ్యత కూడా మెరుగ్గా ఉంటుంది. ఇది మెట్రో నగరాలతో పోల్చితే పెద్ద అద్దమవుతుంది."
వాస్తవానికి ఇది కేవలం అతను ఒక్కరికే కాకుండా అనేకమంది ప్రవాస భారతీయులకు ఇప్పుడు భారతదేశానికి తిరిగి రావాలనుకుంటున్నారు. కానీ వారు కోరుకునేది ఒక భద్రమైన, శాంతియుత వాతావరణం, పిల్లల చదువు కోసం మంచి వాతావరణం, ఆరోగ్యకరమైన జీవన శైలి. ఇవన్నీ కలిసినప్పుడు భారతదేశంలోని కొన్ని టియర్-2 నగరాలు, ముఖ్యంగా మైసూరు లాంటి నగరాలు, ఇప్పుడు కొత్త హోమ్‌గా ఎంచుకునే వారికి బెస్ట్ ఆప్షన్‌లుగా నిలుస్తున్నాయి.
ఇందులో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే దేశానికి తిరిగి రావాలన్న తపన, పిల్లల భవిష్యత్తుపై జాగ్రత్త, నూతన మార్గాలను అన్వేషించే ధైర్యం అన్నీ కలిసినప్పుడు, వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయాలు ఒక సామూహిక చర్చగా మారిపోతాయి. ఇదే ఇప్పుడు ఈ కథను సోషల్ మీడియాలో వైరల్ చేసిన అసలు కారణం.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications