SBI Vs Post Ofiice RD: ఎస్బీఐ, పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ లో ఏది బెటర్..!
చాలా మంది తమ భవిష్యత్, పిల్లల భవిష్యత్ కోసం పలు పథకాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. అయితే సురక్షితమైన పెట్టుబడి పథకాల్లో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు. సామాన్య ప్రజలు బ్యాంకులు, పోస్టాఫీస్ పథకాల్లో పెట్టుబడి పెడుతుంటారు. చాలా మంది రికరింగ్ డిపాజిట్ పథకంలో పెట్టుబడి పెడుతున్నారు. రికరింగ్ డిపాజిట్ పథకం బ్యాంకులతో పాటు పోస్టాఫీస్ లో అందుబాటులో ఉంటుంది. ఈ పథకాన్ని బ్యాంకులు, పోస్టాఫీస్ లో ఓపెన్ చేయ్యొచ్చు. రికరింగ్ డిపాజిట్ పథకంలో ఖాతాదారులు ప్రతి నెలా కొత్త మొత్తం జమ చేయనున్నారు.
బ్యాంక్ లేదా పోస్టాఫీసు ఈ మొత్తానికి స్థిర వడ్డీని చెల్లిస్తోంది. మెచ్యూరిటీలో భారీ మొత్తంలో హామీ సొమ్మును పొందుతారు. మీరు కూడా దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా పోస్ట్ ఆఫీస్ RD పథకంలో పెట్టుబడి పెట్టాలని భావించినట్లయితే.. రెండింటిలో వడ్డీ రేటు ఎంత చెల్లిస్తున్నాయో చూద్దాం.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికరింగ్ డిపాజిట్ పథకం కింద, కస్టమర్లు 1 సంవత్సరం నుంచి 10 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం బ్యాంక్ ఆర్‌డి పథకం కింద సీనియర్ సిటిజన్లకు 0.50 శాతం ఎక్కువ వడ్డీ రేటును అందిస్తోంది.

సాధారణ కస్టమర్లు 1 నుంచి 2 సంవత్సరాల కాలానికి RD పథకంపై 6.80 శాతం వడ్డీ రేటును చెల్లిస్తుంది. అదే సమయంలో సీనియర్ సిటిజన్లు 7.30 శాతం వడ్డీ రేటు ప్రయోజనం పొందుతున్నారు. మరోవైపు, రెండు నుంచి మూడు సంవత్సరాల ఆర్‌డిపై, సాధారణ ప్రజలు 7.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ రేటును పొందుతున్నారు. 3 నుంచి 4 సంవత్సరాల ఆర్‌డి పథకంపై 6.50 శాతం, సీనియర్ సిటిజన్లు 7.00 శాతం, 5 నుండి 10 సంవత్సరాల ఆర్‌డి పథకంపై సాధారణ ప్రజలు 6.50 శాతం, సీనియర్ సిటిజన్లు 7.00 శాతం వడ్డీ రేటు పొందుతున్నారు.
పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కింద, కస్టమర్‌లు 5 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. బ్యాంకుల మాదిరిగా కాకుండా, సీనియర్ సిటిజన్‌లకు పోస్ట్ ఆఫీస్ RD పథకంలో అదనపు ప్రయోజనం ఉండదు. పోస్ట్ ఆఫీస్ 5 సంవత్సరాల RD పథకంపై తన వినియోగదారులందరికీ 6.5 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఈ పథకం కింద సింగిల్ లేదా జాయింట్ ఖాతా తెరవవచ్చు. పోస్ట్ ఆఫీస్, SBI RD పథకాన్ని పోల్చినట్లయితే, రెండూ అద్భుతమైన పొదుపు పథకాలు, అయితే SBI RD పథకం వడ్డీ రేటు పరంగా మెరుగైన పథకం. మీరు సీనియర్ సిటిజన్ అయితే, మీరు SBI RD పథకంపై అదనపు 0.50 శాతం వడ్డీ రేటు ప్రయోజనాన్ని పొందుతున్నారు.


Click it and Unblock the Notifications