M3M హురున్ ఇండియా ధనవంతుల జాబితా 2025 తాజాగా రిలీజ్ అయ్యింది. ఈ లిస్ట్ చూసితే, భారతదేశంలో సంపద సృష్టిస్తున్న ప్రధాన రంగాలు ఏవో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫార్మాస్యూటికల్స్, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్, కెమికల్స్, సాప్ట్ వేర్ వంటి రంగాల్లో సంపద ఎక్కువగా సృష్టిస్తుంది. అలాగే, జ్యువెలరీ, కన్‌స్ట్రక్షన్ లాంటి ఎమర్జింగ్ రంగాలు కొత్త బిలియనియర్స్ ను సృష్టిస్తున్నాయి.
జాబితా ప్రకారం ఫార్మా రంగం మొదట్లో ఉంది. ఈ రంగంలో 137 మంది ధనికులు లిస్ట్‌లో ఉన్నారు. సైరస్ ఎస్. పూనావాల్లా & ఫ్యామిలీ (సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా) రూ. 2.46 లక్షల కోట్ల సంపత్తితో ముందు ఉన్నారు. తర్వాత డిలీప్ శాంఘవి (సన్ ఫార్మా) రూ. 2.31 లక్షల కోట్లతో ఉన్నాయి. మిగతా ప్రముఖ ఫార్మా వ్యాపారవేత్తల్లో మురళి డివి & ఫ్యామిలీ (దివిస్ లాబొరేటరీస్) రూ. 91,100 కోట్లు, పంకజ్ పటేల్ & ఫ్యామిలీ (జైడస్ లైఫ్ సైన్సెస్) రూ. 84,510 కోట్లు సంపద కలిగి ఉన్నారు. ఈ అంకెలు భారత ఫార్మా రంగం గ్లోబల్ హెల్త్‌కేర్, వ్యాక్సిన్ తయారీలో ఎంత కీలకమై ఉందో చూపిస్తున్నాయి.

అయితే, 2025లో నిఫ్టీ ఫార్మా సూచిక 8.5% తగ్గింది. అంటే ఫార్మా రంగంలోని రిచ్‌లకు సంపద ఉన్నప్పటికీ, స్టాక్ మార్కెట్ కొద్దిగా వెనక్కి తగ్గింది కాబట్టి పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలి.
"ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్" రెండో స్థానంలో ఉంది, ఇందులో 132 మంది బిలియనియర్స్ ఉన్నారు. వివేక్ కుమార్ జైన్ (గుజరాత్ ఫ్లోరోకెమికల్స్) రూ. 67,800 కోట్లు సంపదతో ముందున్నారు. ఈ రంగం పాత వ్యాపారాలు మరియు టెక్నాలజీ ఆధారిత మాన్యుఫ్యాక్చరింగ్ మిశ్రమం కలిగి ఉంది.
"కెమికల్స్ & పెట్రోకెమికల్స్" రంగంలో 125 మంది బిలియనియర్స్ ఉన్నారు. శ్రీ ప్రకాష్ లోహియా (ఇండోరమ) రూ. 87,700 కోట్లు సంపదతో ముందున్నారు. భారత్ స్పెషాలిటీ కెమికల్స్ మరియు ఇండస్ట్రియల్ సప్లైల్స్ లో గ్లోబల్ స్థానం కలిగి ఉంది.
భారతదేశంలో టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్ 2025
"సాప్ట్ వేర్ & సర్వీసెస్" రంగంలో కూడా బలమైన అభివృద్ధి ఉంది. రోష్ని నాదర్ మల్హోత్రా & ఫ్యామిలీ (HCL) రూ. 2.84 లక్షల కోట్ల సంపదతో ముందున్నారు. ఇది ఇండియా IT రంగం ఇంకా వృద్ధి చెందుతుందని చూపిస్తుంది.
"రియల్ ఎస్టేట్" రంగంలో 99 మంది బిలియనియర్స్ ఉన్నారు. రాజీవ్ సింగ్ & ఫ్యామిలీ (DLF) రూ. 1.21 లక్షల కోట్ల సంపత్తితో ముందున్నారు. కానీ 2025లో Nifty Realty సూచిక 16.4% తగ్గింది. ఈ తగ్గుదల పెరుగుతున్న ఖర్చులు మరియు గృహ కొనుగోలుదారుల నమ్మకంలో బలహీనత వల్ల జరిగింది.
ఇతర ముఖ్యమైన రంగాల్లో కూడా చాలా మంది బిలియనియర్స్ ఉన్నారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో 93 మంది, కన్‌స్ట్రక్షన్ & ఇంజినీరింగ్ లో 91 మంది, ఆటోమొబైల్ & ఆటో కంపోనెంట్స్ లో 90 మంది, ఫుడ్ & బేవరేజ్ లో 89 మంది మరియు జ్యువెలరీ రంగంలో 82 మంది బిలియనియర్స్ ఉన్నారు. ఈ రంగాలు కూడా భారత్‌లో సంపద సృష్టించడంలో కీలకంగా ఉన్నాయి.
కొత్తగా సృష్టిస్తున్న రంగాల్లో కొత్త బిలియనియర్స్ ఎక్కువగా వస్తున్నారు, ముఖ్యంగా లగ్జరీ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో ఎక్కువుగా వస్తున్నారు. ఉదాహరణకు, జ్యువెలరీలో 25 కొత్త బిలియనియర్స్, కన్‌స్ట్రక్షన్ & ఇంజినీరింగ్ లో 24, రియల్ ఎస్టేట్ లో 23, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ లో 21, ఫుడ్ & బేవరేజ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ లో 20 మంది కొత్త బిలియనియర్స్ వచ్చారు. ఇది కొత్త రంగాల్లో సంపద సృష్టి వేగంగా జరుగుతోందని చూపిస్తుంది.
ఈ లిస్ట్‌ను పరిశీలిస్తే, భారతదేశంలో సంపత్తి ఎక్కువగా కొన్ని ప్రధాన రంగాల్లో ఉందని స్పష్టంగా తెలుస్తోంది. ఫార్మాస్యూటికల్స్, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్, కెమికల్స్, సాఫ్ట్వేర్ వంటి పెద్ద రంగాల్లో పెద్ద బిలియనియర్స్ ఎక్కువగా ఉన్నారు. వీరు ఇప్పటికే స్థిరమైన వ్యాపారాల ద్వారా భారీ సంపత్తిని సృష్టించారు. అలాగే, రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటోమొబైల్, ఫుడ్ & బేవరేజ్ వంటి రంగాల్లో కూడా పెద్ద బిలియనియర్స్ ఉన్నారు, వీటిలోని పెట్టుబడులు మరియు వ్యాపారాలు భారతీయ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉన్నాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications