కరోనా తర్వాత, ఇటీవల రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వివిధ దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. బ్యారెల్ క్రూడ్ ధర కొద్ది వారాల క్రితం 140 డాలర్లు కూడా క్రాస్ చేసింది. అయితే ఇప్పుడు 110 డాలర్లకు సమీపంలో ఉంది. నాలుగు నెలల క్రితం ఇదే క్రూడ్ 70 డాలర్ల వద్ద ఉంది. అంటే 50 శాతానికి పైగా పెరిగింది. దీంతో పెట్రోలా్, డీజిల్ ధరలు వివిధ దేశాల్లో పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ నేటి సెషన్‌లో స్వల్పంగా లాభపడి 111 డాలర్ల వద్ద, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 107 డాలర్ల వద్ద ఉంది. నాలుగు నెలలుగా మన వద్ద పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం లేదు. కానీ విదేశాల్లో పెరుగుతున్నాయి.

తక్కువ ధర
పెట్రో ఉత్పత్తి దేశాల్లో చమురు ధరలు చాలా తక్కువగా ఉంటాయి. వెనిజులాలో ఒక లీటర్ పెట్రోల్ 0.025 డాలర్లు మాత్రమే. మన కరెన్సీలో ఇది రూ.2గా చెప్పవచ్చు. మూడు నెలల క్రితం జాబితా ప్రకారం ఇరాన్ రూ.5, కువైట్ రూ.26, మలేషియా రూ.37, రష్యా 51, ఆప్ఘనిస్తాన్ 60, పాకిస్తాన్ రూ.62, శ్రీలంక రూ.68, అమెరికా రూ.74, బంగ్లాదేశ్ రూ.78, నేపాల్ రూ.85, కెన్యా రూ.88, థాయ్‌లాండ్ రూ.89, ఆస్ట్రేలియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా రూ.90, చైనా రూ.94గా ఉంది. భారత్‌లో రూ.105, జపాన్‌లో రూ.107గా ఉంది. అతి తక్కువ ధర వెనిజులాలో రూ.2, అత్యధిక ధర హాంగ్‌కాంగ్‌లో రూ.185గా ఉంది.

అమ్మో... అక్కడ ధరలు
పెట్రో ఉత్పత్తులు శ్రీలంక, పాకిస్తాన్ సహా వివిధ దేశాల్లో భారీగా పెరిగాయి. శ్రీలంక కరెన్సీలో పెట్రోల్ ఆక్టేన్ 92 ఇప్పుడు రూ.254, పెట్రోల్ ఆక్టేన్ 95 రూ.283, లంక ఆటో డీజిల్ రూ.176, లంక సూపర్ డీజిల్ రూ.254గా ఉంది. కేవలం పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు ఇతర ఉత్పత్తుల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఉల్లిగడ్డ కిలో రూ.200, పాలపొడి రూ.1945గా ఉంది. ఆర్థిక సంక్షోభం కారణంగా ఇక్కడ ఎక్కువ హోటళ్లు, రెస్టారెంట్లు మూతబడ్డాయి.

మన వద్ద 5 శాతమే
తక్కువ ధర పరంగా ర్యాంకుల విషయానికి వస్తే వెనిజులా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా లిబియా, ఇరాన్, సిరియా, అల్జీరియా, అంగోలియా, కువైట్, రష్యా, కజకిస్తాన్, నైజీరియా మొదటి పది స్థానాల్లో ఉన్నాయి. ఇటీవల కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా కరోనా సమయంలో చాలా దేశాల్లో ఇంధన ధరలు పెరిగాయని, 50 శాతం కూడా పెరుగుదల నమోదయిందని, మన వద్ద మాత్రం 5 శాతమే పెరిగాయన్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications