ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన సంగతి మీకు తెలిసే ఉంటుంది. ఈ సెంచరీతో కోహ్లీ భారత జట్టును విజయపథంలో నడిపించాడు. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో విరాట్ కోహ్లీ చేతి పై ఒక బ్యాండ్ కనిపించింది. అతని చెయ్యి మణికట్టుపై ఈ బ్యాండ్ కనిపించడం ఇదేం మొదటిసారి కాదు. కానీ కొన్ని ప్రత్యేక సందర్భంలో కోహ్లీ మణికట్టుపై ఉన్న ఈ బ్యాండ్ గురించి చర్చ జరుగుతుంది.
నిజానికి, ఇది ఒక ఫిట్‌నెస్ బ్యాండ్. దీని అత్యంత ప్రత్యేక ఫీచర్ ఏమిటంటే దీనికి స్క్రీన్ ఉండదు. ఈ బ్యాండ్ కంపెనీ అమెరికాకు చెందినది. ఈ కంపెనీ పేరు వూప్. విరాట్ కోహ్లీ మాత్రమే కాదు, ప్రపంచంలోని చాలా మంది క్రీడాకారులు ఈ బ్యాండ్ ధరిస్తారు. వీరిలో క్రిస్టియానో రొనాల్డో కూడా ఉన్నారు.

కంపెనీకి 13 సంవత్సరాలు..
వూప్ అనేది 13 ఏళ్ల నాటి కంపెనీ. దీనిని 2012 సంవత్సరంలో స్థాపించారు. దీని వ్యవస్థాపకుడు అండ్ CEO విల్ అహ్మద్. ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం బోస్టన్‌లో ఉంది. వూప్ కంపెనీ మొదటి ప్రోడక్ట్ (WHOOP 1.0)ను 2015 సంవత్సరంలో లాంచ్ చేసింది. దాని రెండవ వెర్షన్ తరువాత సంవత్సరం వచ్చింది. ఇప్పటివరకు ఇలా చాల వెర్షన్లు ప్రారంభించారు. అయితే 2023 సంవత్సరంలో కంపెనీ OpenAI 'హూప్ కోచ్' ఫీచర్‌ను విడుదల చేసింది.
ఈ బ్యాండ్ ఏం చేస్తుంది?
ఈ ఫిట్‌నెస్ బ్యాండ్ మీ శరీర ఫిట్‌నెస్‌ను ట్రాక్ చేయడమే కాకుండా స్టెప్స్ కౌంట్, కేలరీల కౌంట్, హార్ట్ బీట్ రేటు, స్లిప్ క్వాలిటీ మొదలైన వాటిని కూడా పర్యవేక్షిస్తుంది. ఇంకా మనిషి శరీరంలో ఇంటర్నల్ సంకేతాలపై కూడా దృష్టి పెడుతుంది. అంతేకాదు ఆహారం నుండి నిద్ర అలాగే మేలుకోవడం వరకు మనిషి ప్రతి వివరాలను అందిస్తుంది. ఇది మనిషిని తనను తాను ఫిట్‌గా ఉంచుకోవడానికి సహాయపడుతుంది. దీని అత్యంత ప్రత్యేక ఫీచర్ ఏమిటంటే దీనికి స్క్రీన్ ఉండదు. దీని కారణంగా దీనిని ఉపయోగించే వ్యక్తి దానిపై ఎలాంటి శ్రద్ధ చూపడు. బ్యాండ్ శరీరంపై నిఘా ఉంచుతూ నిశ్శబ్దంగా తన పనిని కొనసాగిస్తుంది. అలాగే స్మార్ట్‌ఫోన్‌కి కనెక్ట్ అయి ఉంటుంది. ఒక వ్యక్తి తన ఆరోగ్య కార్యకలాపాలను స్మార్ట్ ఫోన్ యాప్‌లో చూడవచ్చు.
భారతదేశంలో ఈ బ్యాండ్ లభిస్తుందా
2023 ప్రపంచ కప్ సందర్భంగా విరాట్ కోహ్లీ తొలిసారి ఈ ఫిట్‌నెస్ బ్యాండ్ ధరించి కనిపించాడు. అప్పటి నుండి భారతదేశంలో ఈ బ్యాండ్ గురించి చర్చ జరుగుతోంది. ఒకప్పుడు ఈ బ్యాండ్‌లు భారతదేశంలో లేవు. కానీ సెప్టెంబర్ 2024లో భారతదేశంలోకి ప్రవేశించింది. ఆ సమయంలో దీని సేల్స్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైంది. కానీ ఇప్పుడు వివిధ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది.
ధర ఎంత?
ఈ ఫిట్‌నెస్ బ్యాండ్ సాధారణ ఫిట్‌నెస్ బ్యాండ్ కాదు. హూప్ ఫిట్‌నెస్ బ్యాండ్‌లు సబ్‌స్క్రిప్షన్ మోడల్‌తో వస్తాయి. ఫ్లిప్‌కార్ట్‌లో WHOOP 4.0 వెర్షన్ ఒక సంవత్సరం సబ్‌స్క్రిప్షన్ ధర ప్రస్తుతం రూ.26,990. ఇది జీవితకాల వారంటీతో వస్తుంది.


Click it and Unblock the Notifications