సాధారణంగా మనం బంగారం అనగానే మెడలో వేసుకునే గొలుసులు, చేతి గాజులు లేదా పెళ్లిళ్లలో కనిపించే భారీ ఆభరణాలను ఊహించుకుంటాం. కానీ 2025 నాటి గ్లోబల్ డేటాను గమనిస్తే ఒక విస్మయకరమైన నిజం బయటపడింది. ప్రస్తుతం బంగారం (Gold) అనేది కేవలం అలంకార వస్తువుగా కాకుండా, ఆర్థిక వ్యవస్థకు ఒక 'రక్షణ కవచం'లా మారుతోంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అందించిన తాజా గణాంకాల ప్రకారం.. ప్రపంచంలో లభ్యమవుతున్న బంగారంలో ఎక్కువ భాగం అలంకరణకు కాకుండా గదుల్లోని లాకర్లలో భద్రంగా దాగి ఉంటోంది.

సరఫరా ఎక్కడి నుండి వస్తోంది?
2025లో అందుబాటులో ఉన్న మొత్తం బంగారం (Gold) లో రెండు ప్రధాన వనరులు ఉన్నాయి..
- గనుల ఉత్పత్తి (Mine Production): దాదాపు 71.93 శాతం (3,598 టన్నులు) నేరుగా గనుల నుండి వెలికితీసినది.
- రీసైకిల్ బంగారం (Recycled Gold): సుమారు 28.07 శాతం (1,404 టన్నులు). పాత నగలు, నాణేలు కరిగించి తిరిగి మార్కెట్లోకి తెచ్చిన బంగారం ఇది. ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పుడు దీని వాటా ఎక్కువగా ఉంటుంది.
బంగారాన్ని ఎవరు కొంటున్నారు?
ప్రపంచ పసిడి మార్కెట్‌ను నాలుగు ప్రధాన కేటగిరీలుగా విభజించవచ్చు..
- ఇన్వెస్ట్‌మెంట్ (43.5%): బంగారం వినియోగంలో పెట్టుబడిదే సింహభాగం. ఇందులో కేవలం బంగారు కడ్డీలు (Bars), నాణేలు మాత్రమే కాకుండా, 'పేపర్ గోల్డ్' అంటే ఈటీఎఫ్ (ETF) రూపంలో కూడా పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరుగుతున్నాయి. అంటే బంగారాన్ని తాకకుండానే.. కేవలం ఆర్థిక ఆస్తిగా నిల్వ చేస్తున్నారు.
- ఆభరణాలు (32.7%): ఒకప్పుడు ఆభరణాలదే అగ్రస్థానం ఉండేది, కానీ ఇప్పుడు అది రెండో స్థానానికి పడిపోయింది. భారతదేశం, చైనా వంటి దేశాల్లో నగలపై మక్కువ ఉన్నప్పటికీ.. పెట్టుబడితో పోలిస్తే దీని డిమాండ్ గణనీయంగా తగ్గింది.
- సెంట్రల్ బ్యాంకులు (17.2%): విదేశీ మార్పిడి నిల్వలను పటిష్టం చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు (RBI వంటివి) విపరీతంగా బంగారాన్ని కొంటున్నాయి. డాలర్ పై ఆధారపడటం తగ్గించి ఆర్థిక స్థిరత్వం కోసం బ్యాంకులు పసిడిని ఒక వ్యూహాత్మక ఆయుధంగా వాడుతున్నాయి.
- టెక్నాలజీ (6.6%): బంగారానికి విద్యుత్ వాహకత ఎక్కువ ఉన్నప్పటికీ.. పారిశ్రామికంగా దీని వినియోగం చాలా తక్కువ. కేవలం ఎలక్ట్రానిక్స్, వైద్య పరికరాలలో మాత్రమే చిన్న మొత్తంలో వాడుతున్నారు.
బంగారమే అసలైన ఆర్థిక కోట
ఈ గణాంకాలను బట్టి చూస్తే ఒక విషయం స్పష్టమవుతోంది.. బంగారం ప్రదర్శన కోసం కాదు, దాచుకోవడం కోసమే ఎక్కువ వాడుతున్నారు. పెట్టుబడులు , సెంట్రల్ బ్యాంకుల నిల్వలను కలిపి చూస్తే, ప్రపంచంలోని 60 శాతానికి పైగా బంగారం ఉక్కు తలుపుల వెనుక వాల్టుల్లో (Vaults) భద్రంగా ఉంది.
ఇకపోతే డిజిటల్ కరెన్సీలు, క్రిప్టోలు ఎన్ని వచ్చినా బంగారానికి ఉన్న క్రేజ్ తగ్గలేదు. దానికి కారణం.. బంగారం వంటి లోహానికి ఎటువంటి 'కౌంటర్ పార్టీ రిస్క్' లేదు. కోడ్ అవసరం లేదు, విద్యుత్ అక్కర్లేదు.. వేల ఏళ్లుగా మారిన నమ్మకం మాత్రమే చాలు. అందుకే 2025 లో కూడా బంగారం తన కిరీటాన్ని పదిలం చేసుకుంది. ఇకపై కూడా బంగారానికి ఇదే స్థాయిలో విలువ ఉండే అవకాశం ఉంది.
More From GoodReturns

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..



Click it and Unblock the Notifications