Budget 2023: ఇటీవలి కాలంలో చైనా చొరబాట్లు భారీగా పెరిగాయి. దీనికి తోడు దాయాది పాక్ ఉగ్రవాదాన్ని దేశంపైకి ఉసిగొల్పుతూ భారత వృద్ధిని అడ్డుకోవాలని ప్రయత్నాలు మానుకోవటం లేదు. ఈ క్రమంలో సైన్యంపై భారత వ్యయాలు చాలా కీలకంగా మారాయి. సైన్యం ఆధునీకీకరణ, కీలక ప్రదేశాల్లో మౌలిక వసతులు, ఆధునిక రక్షణ వ్యవస్థలు అత్యవసరంగా మారాయి. ఈ క్రమంలో మనం చైనా, పాకిస్తాన్‌లతో పోల్చితే ఎక్కడ ఉన్నామనేది చాలా కీలకంగా మారింది.

చైనాపై కన్నేయాల్సిందే..
ఆధునిక భారత్ మోదీ సర్కార్ హయాంలో మిలిటరీని శక్తివంతంగా మార్చే ప్రయత్నం వేగం పుంజుకుంది. భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలు ఎంత విద్వేషంగా ఉన్నా మన భద్రతకు అతిపెద్ద సవాలు పాకిస్థాన్ కాదు.. చైనా అన్నది భారత్ గ్రహించింది. పాక్ ఉద్ధేశాలు దారుణంగా ఉన్నప్పటికీ ఆయుధాల వ్యూహాత్మక తయారీ, రక్షణ బడ్జెట్ వంటి విషయాల్లో మన ముందు ఎక్కడా నిలబడలేదు. అందుకే చైనాపై భారత గురి చాలా కీలకమైనది.

రక్షణ బడ్జెట్..
2021లో పాకిస్థాన్ రక్షణ బడ్జెట్ 11.3 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇదే కాలంలో భారత రక్షణ బడ్జెట్ 76.6 బిలియన్ డాలర్లుగా ఉండటం గమనార్హం. అంటే ఇది పాక్ వెచ్చిస్తున్నదానికంటే దాదాపు 7 రెట్లు అధికం. అయితే చైనాతో మన గణాంకాలను పోల్చినప్పుడు ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది. రక్షణ బడ్జెట్ కేటాయింపుల విషయంలో అమెరికా మెుదటి స్థానంలో ఉండగా.. రెండవ స్థానంలో చైనా, మూడవ స్థానంలో భారత్ నిలిచాయి. భారత్ తన రక్షణ బడ్జెట్ ను క్రమంగా పెంచుకుంటూ ముందుకు సాగటం ప్రాముఖ్యతను చూపుతోంది.

2022-23 ఆర్థికలో..
ప్రస్తుతం భారత్ వెచ్చిస్తున్న మెుత్తం రక్షణకు సరిపోతుందా అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. భారత ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరంలో రక్షణ కోసం రూ. 5.25 లక్షల కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్‌ను ఉంచింది. ఇది ప్రభుత్వం చేస్తున్న మెుత్తం వ్యయంలో దాదాపు 13.3 శాతంగా ఉంది. 2020లో భారత్ రక్షణ కోసం 72.94 బిలియన్ డాలర్లు అంటే GDPలో 2.9%కి సమానమైన మొత్తాన్ని ఖర్చు చేసింది.

చైనా రక్షణ బడ్జెట్..
ప్రపంచ బ్యాంక్ వివరాల ప్రకారం 2021లో చైనా సైనిక వ్యయం 239.35 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే ఇది భారత్ వెచ్చిస్తున్న మెుత్తం కంటే దాదాపుగా నాలుగు రెట్లు అధికమైనది. గడచిన దశాబ్దకాలంగా చైనా-భారత్ చేస్తున్న రక్షణ వ్యయాల మధ్య వ్యత్యాసం భారీగా పెరుగుతూ వచ్చింది. 2010లో భారత సైనిక వ్యయం 46.09 బిలియన్ డాలర్లుగా ఉండగా.. చైనా ఇదే సమయంలో రక్షణ రంగం కోసం 105.52 బిలియన్ డాలర్లను ఖర్చుచేసింది. ఈ క్రమంలో భారత్ కంటే వేగంగా చైనా తన రక్షణ వ్యయాన్ని వేగంగా పెంచుకుంటూ పోతోంది. ప్రపంచ పెద్దన్న అమెరికాను తలదన్నే స్థాయిలో తన సైన్యాన్ని నిలపాలనేది చైనా అసలు వ్యూహంగా కనిపిస్తోంది.

భారత్ ముందు సవాలు..
పక్కలో బల్లెంగా మారిన చైనాను విస్మరించటం రక్షణ విషయంలో భారత్ కు చాలా ప్రమాదకరం. ఘల్వాన్ గొడవలు, అరుణాచల్ ప్రదేశ్ ఆక్రమణలు ఇలా చైనా దురాక్రమణల పర్వం పెరుగుతున్న తరుణంలో రక్షణ బడ్జెట్ భారత్ కు చాలా కీలకమైన అంశం. జీడీపీలో రక్షణ వ్యయాన్ని పెంచాలని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రి దేశంలో కొత్త వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న వేళ ప్రపంచం దృష్టి భారత రక్షణ బడ్జెట్ పై ఉంది. రక్షణ బడ్జెట్‌ను మోడీ ప్రభుత్వం ఎంత పెంచుతుందో వేచిచూడాల్సిందే.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications