Bengaluru: బెంగళూరు నెక్స్ట్ ఎటు విస్తరిస్తోంది? ఈ 7 రూట్లలో ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్‌లో తిరుగుండదు!

సిటీ లోపల విపరీతమైన ట్రాఫిక్ జామ్‌లు, ఆకాశాన్ని తాకుతున్న ప్రాపర్టీ ధరలు, ఇల్లు కట్టుకుందామన్నా ఖాళీ స్థలాలు దొరకని పరిస్థితి. ప్రస్తుతం బెంగళూరు (Bengaluru) లో ఐటీ ఉద్యోగులు, సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఇవి. అందుకే ఇప్పుడు డెవలపర్లు, ఇన్వెస్టర్లు అందరూ తమ చూపును సిటీ వెలుపల ఉన్న ఔటర్ ఏరియాల వైపు మళ్లించారు. రోడ్ల విస్తరణ, మెట్రో కనెక్టివిటీ పెరగడంతో ఈ ప్రాంతాలు ఇప్పుడు హాట్ కేకుల్లా మారుతున్నాయి.

భవిష్యత్తులో ఐటీ హబ్‌గా మారి, ఇన్వెస్టర్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టే 7 కీలకమైన గ్రోత్ కారిడార్ల (Growth Corridors) వివరాలు ఇప్పుడు చూద్దాం.

Where Bengaluru Will Expand Next 7 Real Estate Growth Corridors For Investors

ఇన్వెస్టర్లు వాచ్ చేయాల్సిన 7 కారిడార్లు..

  • సర్జాపూర్ కారిడార్ (Sarjapur Corridor): వైట్‌ఫీల్డ్, ఎలక్ట్రానిక్ సిటీ వంటి ఐటీ హబ్‌లను కలిపే ఈ ఏరియా చాలా వేగంగా డెవలప్ అవుతోంది. గతంలో ఇక్కడ చదరపు అడుగు ధర రూ.4,500 ఉంటే, ఇప్పుడది రూ.8,000 నుండి రూ.16,000 కు చేరింది. ఐటీ ఉద్యోగుల నుండి రెంట్ల కోసం ఇక్కడ విపరీతమైన డిమాండ్ ఉంది.
  • కనకపుర రోడ్ కారిడార్ (Kanakapura Road Corridor): మెట్రో గ్రీన్ లైన్ ఎక్స్‌టెన్షన్ వల్ల ఫ్యామిలీస్ ఉండటానికి ఇది బెస్ట్ ఛాయిస్‌గా మారింది. ఇక్కడ ప్లాట్లు, విల్లాల ధరలు చదరపు అడుగుకు రూ.7,000 నుండి రూ.14,000 వరకు పలుకుతున్నాయి.
  • హోస్కోట్ కారిడార్ (Hoskote Corridor): వైట్‌ఫీల్డ్, కేఆర్ పురం , చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేలకు దగ్గరగా ఉండటం వల్ల ఇది లాజిస్టిక్స్, ఇండస్ట్రియల్ హబ్‌గా మారుతోంది. ఇక్కడ స్థలాల ధరలు రూ.2,500 నుండి రూ.6,500 వరకు ఉన్నాయి.
  • దొడ్డబళ్లాపూర్ కారిడార్ (Doddaballapur Corridor): ఎయిర్‌పోర్ట్ ఏరియాకు దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ గత ఐదేళ్లలో ప్లాట్ల ధరలు 80-85% పెరిగాయి. టెక్స్‌టైల్ పార్కులు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలు ఇక్కడ భారీగా వస్తున్నాయి.
  • నెలమంగళ కారిడార్ (Nelamangala Corridor): ఇ-కామర్స్, గోడౌన్లకు (Warehouses) ఇది కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఇండస్ట్రియల్ ల్యాండ్స్ కొనాలనుకునే వారికి ఇది తక్కువ ధరలో దొరికే బెస్ట్ ఆప్షన్.
  • బిడది కారిడార్ (Bidadi Corridor): బెంగళూరు-మైసూర్ ఎక్స్‌ప్రెస్‌వే పుణ్యమా అని ఈ ఏరియా రూపురేఖలు మారిపోయాయి. టయోటా లాంటి పెద్ద కంపెనీల ఫ్యాక్టరీలు ఇక్కడే ఉన్నాయి. ఇండస్ట్రియల్ ల్యాండ్ రేట్లు ఇక్కడ రూ.12,000 మార్కును తాకుతున్నాయి.
  • దేవనహళ్లి ఎయిర్పోర్ట్ కారిడార్: లాంగ్ టర్మ్‌లో భూమి విలువ విపరీతంగా పెరగాలి అనుకునేవారికి ఎయిర్‌పోర్ట్ ఏరియా, ఏరోస్పేస్ పార్క్ ఉన్న ఈ రూట్ చాలా సేఫ్ అండ్ బెస్ట్ ఆప్షన్.

రియల్ ఎస్టేట్‌కు రెక్కలు తెస్తున్న మెగా ప్రాజెక్టులు..

బెంగళూరు (Bengaluru) చుట్టుపక్కల ప్రాంతాలు ఇంతలా డెవలప్ అవ్వడానికి ప్రభుత్వం చేపట్టిన కొన్ని భారీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులే కారణం. ఫేజ్ 2 , ఫేజ్ 3 కింద దాదాపు 175 కిలోమీటర్ల మేర జరుగుతున్న మెట్రో విస్తరణ శివార్లను సిటీతో కలుపుతోంది. దీనికి తోడు 73 కిలోమీటర్ల పెరిఫెరల్ రింగ్ రోడ్ (PRR), అలాగే ఉపగ్రహ నగరాలను కలిపే 400 కిలోమీటర్ల శాటిలైట్ టౌన్ రింగ్ రోడ్ (STRR) ప్రాజెక్టులు ఇక్కడి రవాణాను పూర్తిగా మార్చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+