పీఎం కిసాన్ 20వ విడత ఎప్పుడు ? ఎంత మంది మహిళలకు డబ్బు వస్తుందంటే ?
పీఎం-కిసాన్ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (direct benefit transfer) కార్యక్రమాలలో ఒకటిగా నిలిచింది. దీనిని అర్హులైన రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక సంక్షేమ పథకం. ఈ పథకం ద్వారా రైతులు వ్యవసాయ ఖర్చులను తీర్చుకోవడానికి, ఉత్పత్తిని పెంచుకోవడానికి ఇంకా మంచి జీవనోపాధిని పొందడానికి సహాయపడుతుంది.

పీఎం-కిసాన్ పథకం అంటే ఏమిటి: 2019 మధ్యంతర బడ్జెట్‌లో అప్పటి ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ ప్రకటించిన ఈ పీఎం-కిసాన్ పథకం చిన్న, సన్నకారు రైతులకు ఆర్థికంగా సహజరం ఇవ్వడానికి రూపొందించారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి రూ.6,000 మొత్తాన్ని మూడు సమాన వాయిదాలలో అందిస్తారు:
మొదటి విడత: ఏప్రిల్-జూలై
రెండవ విడత: ఆగస్టు-నవంబర్
మూడవ విడత: డిసెంబర్-మార్చి
ఈ మొత్తాన్ని కూడా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు.
పీఎం కిసాన్ 20వ విడత ఎప్పుడు వస్తుంది: పీఎం-కిసాన్ పథకం ఇప్పటికే 19 వాయిదాలను పూర్తి చేసింది. ఇటీవల 19వ విడతను ఫిబ్రవరి 2025లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేశారు. దీని ద్వారా 2.4 కోట్ల మంది మహిళా లబ్ధిదారులతో సహా 9.8 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. గతంలో 18వ విడత అక్టోబర్ 2024లో, 17వ విడత జూన్ 2024లో విడుదలయ్యాయి. ఈ క్రమంలో 20వ విడత జూన్ 2025లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఖచ్చితమైన విడుదల తేదీ, స్థలం అధికారికంగా ప్రకటించనప్పటికీ ప్రధానమంత్రి మోడీ ఈ కార్యక్రమానికి మరోసారి అధ్యక్షత వహిస్తారని ఊహాగానాలు జరుగుతున్నాయి.
పీఎం-కిసాన్ యోజనకి ఎవరు అర్హులు:
*భారతదేశ పౌరుడై ఉండాలి.
*సాగు భూమికి యజమాని అయి ఉండాలి.
*చిన్న లేదా సన్నకారు రైతు అయి ఉండాలి.
*నెలకు రూ.10,000 లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందే వారై ఉండకూడదు.
*గత అసెస్‌మెంట్ సంవత్సరంలో ఆదాయపు పన్ను దాఖలు చేసి ఉండకూడదు. అధికారిక పీఎం-కిసాన్ పోర్టల్ ప్రకారం, పీఎం-కిసాన్ రిజిస్టర్ చేసుకున్న రైతులందరికీ e-KYC తప్పనిసరి.
రైతులు e-KYC ప్రక్రియను రెండు విధాలుగా చేయవచ్చు: అధికారిక PM-Kisan పోర్టల్ ద్వారా ఓటీపీ (OTP)తో e-KYC చేసుకోవచ్చు.
లేదా మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)లో బయోమెట్రిక్ ద్వారా e-KYC చేసుకోవచ్చు.
పీఎం-కిసాన్ లబ్ధిదారుడి స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
* https://pmkisan.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
* ఇప్పుడు 'నో యువర్ స్టేటస్' (Know Your Status) పై క్లిక్ చేయండి.
* మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేసి క్యాప్చాను నింపి 'గెట్ డేటా' (Get Data) పై క్లిక్ చేయండి.
* మీ ప్రస్తుత లబ్ధిదారుడి స్టేటస్ మీకు కనిపిస్తుంది.
పీఎం-కిసాన్ కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
* https://pmkisan.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
*'కొత్త రైతు నమోదు' (New Farmer Registration) పై క్లిక్ చేయండి.
*మీ ఆధార్ నంబర్ ఇంకా క్యాప్చాను ఎంటర్ చేయండి.
*అవసరమైన వివరాలను ఎంటర్ చేసి, 'అవును' (Yes) పై క్లిక్ చేయండి.
*రిజిస్ట్రేషన్ ఫామ్‌ను నింపి సబ్మిట్ చేయండి.
*భవిష్యత్ ఉపయోగం కోసం ప్రింటవుట్ తీసుకోండి.


Click it and Unblock the Notifications