ప్రపంచం మార్పు దిశలో ఉంది. ఈ క్రమంలో డ్రాగన్ (చైనా), ఏనుగు (భారత్) కలిసి రావడం చాలా అవసరం అని చెబుతూ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన ప్రతినిధుల స్థాయి చర్చల ప్రారంభంలో జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, భారత్-చైనా దేశాలు స్నేహపూర్వకంగా, మంచి పొరుగు దేశాలుగా ఉండటం అత్యంత అవసరమని పేర్కొన్నారు.

ఇది సాధారణ మీటింగ్ మాత్రమే కాదు. దాదాపు ఏడేళ్ల తర్వాత మోదీ చైనా పర్యటన చేస్తున్నారు. అంతేకాదు, 2020లో లడఖ్ గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల తర్వాత ఇరుదేశాల మధ్య ఉన్న ఉద్రిక్తత దృష్ట్యా ఈ భేటీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.
జిన్‌పింగ్ మాట్లాడుతూ భారత్-చైనా మధ్య ఉన్న సంబంధాలను ఒక కొత్త కోణంలో వివరించారు. ఆయన మాటల్లో ఈ రెండు దేశాలు వేల ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాచీన నాగరికతలు, అలాగే ప్రపంచంలోనే ఎక్కువ జనాభా కలిగిన దేశాలు. గ్లోబల్ సౌత్‌లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. కాబట్టి ఇరు దేశాలు మంచి పొరుగు వారిలా, స్నేహితుల్లా కలిసి ముందుకు నడవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ సంవత్సరం భారత్-చైనా దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, దీన్ని వ్యూహాత్మకంగా ఉపయోగించుకుని, దీర్ఘకాల దృష్టితో బంధాన్ని మరింత బలపరచుకోవాలని జిన్‌పింగ్ పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ స్థాయిలో కూడా జిన్‌పింగ్ ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చారు. దేశాలు బహుళ పాక్షిక విధానం (మల్టిలేటరలిజం)కు కట్టుబడి ఉండాలని ఆయన చెప్పారు. ప్రపంచం మల్టిపోలర్‌గా అనేక శక్తి కేంద్రాలతో మారేందుకు కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ సంస్థల్లో మరింత ప్రజాస్వామ్యం ఉండాలని కూడా ఆయన స్పష్టం చేశారు. ఆసియాలోనే కాదు, మొత్తం ప్రపంచంలో శాంతి, అభివృద్ధి కోసం అందరం కలసి ముందుకు సాగాలని జిన్‌పింగ్ అభిప్రాయపడ్డారు.
తన ప్రసంగంలో ప్రధాని మోదీ కూడా స్పష్టమైన హామీ ఇచ్చారు."భారత్-చైనా సంబంధాలు పరస్పర నమ్మకం, గౌరవం, సున్నితత్వం మీదే ఆధారపడాలి. మేము అదే దిశలో ముందుకు వెళ్లాలని కట్టుబడి ఉన్నాం" అని ఆయన అన్నారు. అదే సమయంలో, 2.8 బిలియన్ ప్రజల సంక్షేమం భారత్-చైనా సహకారంపైనే ఆధారపడి ఉందని కూడా మోదీ చెప్పారు.
మోదీ ప్రస్తావించిన ముఖ్యాంశాల్లో, గత సంవత్సరం జరిగిన సైనిక విరమణ వల్ల సరిహద్దుల్లో కొంత శాంతి నెలకొన్నట్టు చెప్పారు. భారత్-చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు మళ్లీ ప్రారంభం కానున్నాయన్న విషయాన్ని వెల్లడించారు. అంతేకాకుండా, యాత్రికులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కైలాస్-మానససరోవర్ యాత్ర మళ్లీ మొదలవుతున్నట్టు మంచి వార్తను పంచుకున్నారు.
కొత్త దిశలో సంబంధాల పునఃప్రారంభం?
గత కొన్ని ఏళ్లుగా సరిహద్దు సమస్యలు, గల్వాన్ ఘర్షణ వల్ల భారత్-చైనా సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. కానీ ఇప్పుడు SCO మీటింగ్ వేదికగా, ఇరుదేశాల నేతల మధ్య మళ్లీ సానుకూల వాతావరణం కనిపిస్తోంది. జిన్‌పింగ్ ఇచ్చిన "డ్రాగన్ - ఏనుగు కలిసి రావాలి" అనే మెసేజ్ ఈ మార్పుకు సంకేతమని చెప్పవచ్చు.
మొత్తానికి, "భారత్-చైనా సంబంధాలు" మళ్లీ కొత్త పేజీ తిప్పబోతున్నాయా? లేక ఇది కేవలం డిప్లొమాటిక్ మాటల ఆటేనా? అనే కుతూహలం మాత్రం అందరికి పెరిగింది.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..



Click it and Unblock the Notifications