ప్రైవేట్ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భరోసానిచ్చే EPFO పెన్షన్ పథకం (EPS) గురించి చాలా మందికి అనేక సందేహాలు ఉంటాయి. పీఎఫ్ డబ్బులు పాస్‌బుక్‌లో కనిపిస్తాయి. కానీ, పెన్షన్ ఎంత వస్తుంది? ఎప్పుడు వస్తుంది? అనే విషయంలో స్పష్టత ఉండదు. దీని గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రైవేట్ ఉద్యోగుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిర్వహించే పెన్షన్ స్కీమ్ (EPS) చాలా కీలకమైనది. ప్రతి నెల మీ జీతం నుండి పీఎఫ్ కట్ అవుతున్నప్పుడు.. అందులో కొంత భాగం పెన్షన్ నిధికి చేరుతుంది. అయితే ఈ పెన్షన్ పొందేందుకు కొన్ని కఠినమైన నిబంధనలు ఉన్నాయి.

పెన్షన్ రావాలంటే ఉండాల్సిన ప్రధాన అర్హతలు
నెలనెలా లైఫ్ టైమ్ పెన్షన్ పొందాలంటే ప్రధానంగా రెండు షరతులు పూర్తి చేయాలి:
- 10 ఏళ్ల సర్వీస్: ఒక ఉద్యోగి కనీసం 10 ఏళ్ల పాటు 'పెన్షనబుల్ సర్వీస్' పూర్తి చేసి ఉండాలి. అంటే 10 ఏళ్ల పాటు మీ యాజమాన్యం మీ పెన్షన్ ఖాతాకు డబ్బులు జమ చేసి ఉండాలి. ఒకవేళ మీరు మధ్యలో ఉద్యోగం మారినా పాత పీఎఫ్ ఖాతాను కొత్త కంపెనీకి బదిలీ చేసుకుంటే ఆ సర్వీస్ కాలం కూడా లెక్కించబడుతుంది.
- 58 ఏళ్ల వయసు: పెన్షన్ పొందడానికి నిర్ణీత వయసు 58 ఏళ్లు. 10 ఏళ్ల సర్వీస్ ఉన్నప్పటికీ 58 ఏళ్లు నిండిన తర్వాతే పూర్తి పెన్షన్ అందుతుంది.
డబ్బులు ఎలా జమ అవుతాయి? శాలరీ లిమిట్ ఎంత?
చాలా మంది ఉద్యోగులు తమ జీతం ఎక్కువగా ఉంటే పెన్షన్ కూడా ఎక్కువగా వస్తుందని భావిస్తారు. కానీ, ఇక్కడే ఒక మెలిక ఉంది. మీ జీతం నుంచి కట్ అయ్యే 12% మీ పీఎఫ్ (EPF) ఖాతాకు వెళ్తుంది. కానీ, కంపెనీ చెల్లించే 12% వాటాలో 8.33% మాత్రమే పెన్షన్ (EPS) కు వెళ్తుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, పెన్షన్ కోసం గరిష్ట వేతన పరిమితి రూ. 15,000 గా ఉంది. అంటే మీ జీతం రూ. 50,000 ఉన్నా, పెన్షన్ లెక్కలు మాత్రం రూ. 15,000 ఆధారంగానే జరుగుతాయి. అందుకే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకైనా, చిన్న ఉద్యోగులకైనా పెన్షన్ మొత్తంలో పెద్దగా వ్యత్యాసం ఉండదు.
50 ఏళ్లకే పెన్షన్ తీసుకోవచ్చా?
ఒకవేళ మీరు 50 ఏళ్లు నిండి 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉంటే 'ఎర్లీ పెన్షన్' (Early Pension) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ, దీనివల్ల మీకు నష్టం జరుగుతుంది. 58 ఏళ్ల కంటే ముందుగా పెన్షన్ తీసుకుంటే.. ప్రతి ఏడాదికి 4% చొప్పున పెన్షన్ మొత్తంలో కోత విధిస్తారు. ఉదాహరణకు, మీరు 50 ఏళ్లకే పెన్షన్ మొదలుపెడితే, మీకు అందాల్సిన అసలు పెన్షన్ కంటే 32% తక్కువ డబ్బు వస్తుంది. అదే 58 ఏళ్లు దాటి 60 ఏళ్ల వరకు వేచి చూస్తే, పెన్షన్ కొంత పెరిగే అవకాశం ఉంటుంది.
సర్వీస్ 10 ఏళ్ల కంటే తక్కువ ఉంటే?
ఒకవేళ మీ సర్వీస్ 10 ఏళ్ల కంటే తక్కువ ఉంటే మీకు లైఫ్ టైమ్ పెన్షన్ రాదు. అటువంటి సందర్భంలో మీరు ఉద్యోగం మానేసినప్పుడు పెన్షన్ ఖాతాలో ఉన్న సొమ్మును విత్ డ్రా చేసుకోవచ్చు లేదా 'స్కీమ్ సర్టిఫికేట్' తీసుకుని భవిష్యత్తులో మరేదైనా ఉద్యోగంలో చేరినప్పుడు ఆ సర్వీస్‌ను కలుపుకోవచ్చు. పదవీ విరమణ తర్వాత గౌరవంగా బతకాలంటే EPFO పెన్షన్ నిబంధనలపై అవగాహన పెంచుకోవడం ప్రతి ఉద్యోగికి ఎంతో అవసరం.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications