Wheat: గోధుమ అనేది దేశంలో చాలా మందికి ఆహారం. బియ్యం తర్వాత దేశంలో ఎక్కువ మంది జనాభా తినే ఆహారంగా గోధుమలు నిలిచాయి. ఇప్పుడు దేశంలో వీటి నిల్వలు తరిగిపోవటం ఆందోళనకు గురిచేస్తోంది. అసలెందుకీ పరిస్థితి ఎదురైంది.

గోధుమ పంట..
వరి తర్వాత గోధుమ ప్రధాన పంటగా ఉంది. అయితే దేశంలోని అనేక రాష్ట్రాల్లో కురిసిన అకాల వర్షాలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇదే సమయంలో గోధుమ, బియ్యం నిల్వలు క్రమంగా తరిగిపోతున్నాయి. ఈ పరిస్థితి ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం సంస్థల వద్ద నిల్వలు అడుగంటి 5 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయాయి. గోధుమల స్టాక్ బఫర్ స్టాక్ కనీస స్థాయి కంటే కొంచెం అధికంగా ఉంది. ఇది పరోక్షంగా ధరల పెరుగుదలకు, రిటైల్ ద్రవ్యోల్బణం పెరగటానికి కారణంగా నిలుస్తోంది.

ఫుడ్ కార్పొరేషన్ వివరాలు..
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం.. ప్రభుత్వ ఏజెన్సీల వద్ద గోధుమలు, బియ్యం నిల్వలు వేగంగా తగ్గుతున్నాయి. అక్టోబర్ 1న ప్రభుత్వ ఆధీనంలోని గోడౌన్లలో గోధుమలు, బియ్యం నిల్వలు 511.36 లక్షల టన్నులుగా ఉన్నాయి. ఏడాది క్రితం వీటి నిల్వలు 816 లక్షల టన్నులుగా ఉండేది. గత ఏడాది గోధుమ నిల్వలు ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోయాయి. గత ఏడాది 468.52 లక్షల టన్నులుగా ఉన్న గోధుమల నిల్వలు ప్రస్తుతం 227.46 లక్షల టన్నులకు పడిపోయింది. ఇవి మరింతగా క్షీణిస్తున్నాయి.

వరి విషయంలో..
దేశంలో ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో కురిసిన అకాల వర్షాల వల్ల వరి సాగు చాలా దెబ్బతింది. అక్టోబరు 1న ప్రభుత్వ ఏజెన్సీల వద్ద 283.9 లక్షల టన్నుల బియ్యం నిల్వలు ఉన్నాయి. తృణధాన్యాల అత్యధిక ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో ఆహార ధాన్యాల రిటైల్ ద్రవ్యోల్బణం 11.53 శాతం పెరిగింది. ఇప్పటివరకు ఇదే అత్యధికం. దేశీయ మార్కెట్‌లో పెరుగుతున్న ఈ వస్తువుల ధరలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ ఏడాది అనేక ఆహార ధాన్యాల ఎగుమతిపై నిషేధం విధించింది. మే నెలలో గోధుమల ఎగుమతిని నిషేధించింది. గత మూడు నెలల్లో బియ్యం ధరలు కేజీకి రూ.5 నుంచి రూ.15 వరకు పెరిగాయి.

జీఎస్టీ ఎఫెక్ట్..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా గోధుమలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో భారత గోధుమలకు డిమాండ్ పెరిగింది. ఇదే క్రమంలో బంగ్లాదేశ్ నుంచి బియ్యానికి డిమాండ్ పెరిగింది. పైగా కేంద్ర ప్రభుత్వం 25 కేజీల ప్యాకింగ్ పై జీఎస్టీ వసూలు చేయటంతో వీటి ధరలకు కొంత రెక్కలొచ్చాయి.

గోధుమ ఉత్పత్తులు..
గోధుమల నుంచి మైదా, సేమ్యా, గోధుమ పిండి ఉత్పత్తి చేస్తుంటారు. మైదా పిండిని బేకరీలు, బిస్కెట్ తయారీ, హోటల్ రంగంలో ఎక్కువగా వినియోగిస్తారు. పంట ప్రభావితం కావటం వల్ల ధరలు పెరుగుతాయి. అయితే.. దేశీయ మార్కెట్‌లో పెరుగుతున్న ఈ వస్తువుల ధరలకు చెక్ పెట్టేందుకు ఎగుమతులపై కేంద్రం నిషేధం విధిస్తోంది. ఈ క్రమంలో బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకం విధిస్తోంది.


Click it and Unblock the Notifications