మనందరం ప్రతిరోజూ వాడే మెసేజింగ్ యాప్ వాట్సాప్(WhatsApp).. ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్‌గా మారింది. మీరు వింటే ఆశ్చర్యపోతారు. కానీ మన దేశంలో ప్రతి నెలా సగటున దాదాపు కోటి (10 మిలియన్లు) వాట్సాప్ అకౌంట్లు నిషేధానికి గురవుతున్నాయి. ఆన్‌లైన్ మోసాలు, సైబర్ ఫ్రాడ్స్ పెరుగుతున్న నేపథ్యంలో వాట్సాప్ ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం మరింత లోతుగా విచారణ జరుపుతోంది.

ఏ నెలకు ఎన్ని అకౌంట్లు బ్యాన్ అయ్యాయి?
వాట్సాప్ విడుదల చేసిన రిపోర్ట్స్ ప్రకారం ఈ ఏడాది(2025) అక్టోబర్ వరకు నిషేధించబడిన అకౌంట్ల వివరాలు చూస్తే.. జనవరిలో 99 లక్షల అకౌంట్లు, మార్చిలో 1.11 కోట్లు, మే నెలలో 1.12 కోట్లు, సెప్టెంబర్ లో 1 కోటి, అక్టోబర్ లో 91 లక్షల అకౌంట్లు బ్యాన్ అవుతున్నాయి. అంటే సగటున నెలకు 98 లక్షల అకౌంట్లు ఈ ప్లాట్‌ఫారమ్ నుండి తొలగించబడుతున్నాయి. అంటే దేశంలో సైబర్ నేరాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు.
ప్రభుత్వం ఎందుకు ఆందోళన చెందుతోంది?
వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేస్తున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
- డేటా షేరింగ్: ఏ నంబర్లను బ్యాన్ చేశారో ఆ వివరాలను వాట్సాప్ ప్రభుత్వం సరిగ్గా ఇవ్వడం లేదు. దీనివల్ల ఆ నేరగాళ్లను పట్టుకోవడం పోలీసులకు కష్టమవుతోంది.
- టెలిగ్రామ్ వైపు మలుపు: వాట్సాప్ లో బ్యాన్ అయిన నంబర్లు వెంటనే టెలిగ్రామ్ వంటి ఇతర యాప్స్‌లోకి వెళ్లి అక్కడ మోసాలకు పాల్పడుతున్నాయి.
- డిజిటల్ అరెస్ట్ స్కామ్స్: ప్రస్తుతం దేశంలో సంచలనం సృష్టిస్తున్న 'డిజిటల్ అరెస్ట్' మోసాలు, ఐడెంటిటీ థెఫ్ట్ కేసులు 95 శాతం వాట్సాప్ ద్వారానే జరుగుతున్నాయి.
నేరగాళ్లు ఎలా తప్పించుకుంటున్నారు?
సైబర్ నేరగాళ్లు ఒకసారి మొబైల్ నంబర్ తో అకౌంట్ క్రియేట్ చేశాక, సిమ్ కార్డ్ తీసేసినా వాట్సాప్ వాడుకోవచ్చు. ఇది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు పెద్ద తలనొప్పిగా మారింది. కేవలం 'బిహేవియరల్ సిగ్నల్స్' (అంటే అనుమానాస్పదంగా మెసేజ్‌లు పంపడం) ఆధారంగానే వాట్సాప్ ఈ చర్యలు తీసుకుంటోంది.
యూజర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మీ వాట్సాప్ అకౌంట్ సురక్షితంగా ఉండాలంటే, మీరు మోసపోకుండా ఉండాలంటే ఇలా చేయండి..
- అపరిచిత మెసేజ్‌లు: గుర్తు తెలియని నంబర్ల నుండి వచ్చే లింక్‌లను క్లిక్ చేయకండి.
- టూ-స్టెప్ వెరిఫికేషన్: మీ వాట్సాప్ సెట్టింగ్స్‌లో టూ-స్టెప్ వెరిఫికేషన్ తప్పనిసరిగా ఎనేబుల్ చేసుకోండి.
- రిపోర్ట్ & బ్లాక్: మీకు ఏదైనా అనుమానాస్పద మెసేజ్ వస్తే వెంటనే ఆ నంబర్‌ను రిపోర్ట్ చేసి బ్లాక్ చేయండి.
ఏదేమైనా ఈ రోజుల్లో సాంకేతికత ఎంత పెరుగుతుందో మోసాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఇప్పుడు వాట్సాప్ తో పాటు ఇతర సంస్థలతో కూడా చర్చలు జరుపుతోంది. భవిష్యత్తులో కేవలం అకౌంట్ బ్యాన్ చేయడమే కాకుండా సదరు నేరగాడిని గుర్తించేలా కఠిన నిబంధనలు వచ్చే అవకాశం ఉంది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications