వాట్సాప్ వినియోగదారులకు గుడ్‌న్యూస్. ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే వలె వాట్సాప్ ద్వారా కూడా పేమెంట్స్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దశలవారీగా ఈ సేవల్ని అందుబాటులోకి తీసుకు రావొచ్చునని తెలిపింది. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తెలిపింది. కేంద్రం అనుమతి ఇవ్వడంపై ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం నుండి ఈ సేవల్ని అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు వీడియో సందేశంలో తెలిపారు.

ఇప్పుడు ఇండియాలో వాట్సాప్ పే...
భారత్‌లో వాట్సాప్ పే సేవలు నేటి నుండి అమలులోకి వచ్చాయి. ఈ రోజు నుండి కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు వాట్సాప్ బ్లాగ్ ద్వారా తెలిపింది. 'ఈ రోజు నుండి భారత్‌లో ప్రజలు వాట్సాప్ ద్వారా డబ్బులు పంపించగలరు. దీని ద్వారా సురక్షిత చెల్లింపులు జరపవచ్చు. వాట్సాప్ నుండి సందేశం పంపించినంత సులభంగా వాట్సాప్ పే ద్వారా డబ్బులు చెల్లించవచ్చు. వ్యక్తిగత నగదు మార్పిడి లేకుండా, స్థానికంగా బ్యాంకుకు వెళ్లకుండా ప్రజలు సురక్షితంగా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు డబ్బులు పంపించవచ్చు. లేదా ఉత్పత్తుల కొనుగోలుకు చెల్లింపులు జరపవచ్చు' అని పేర్కొంది.

160కి పైగా ఖాతాల పేమెంట్స్
NPCIతో కలిసి యూనిఫైట్ పేమెంట్ ఇంటర్‌ఫేస్(UPI)ని ఉపయోగించి వాట్సాప్ పేమెంట్ ఫీచర్‌ను రూపొందించింది. ఇది 160కి పైగా బ్యాంకుల ఖాతాల నుండి పేమెంట్స్ జరుపుకోవచ్చు. వాట్సాప్ ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, ఎస్బీఐ, జియో పేమెంట్ బ్యాంకుతో జత కట్టింది. పది ప్రాంతీయ భాషల్లో ఈ వాట్సాప్ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చింది. చెల్లింపులకు మరింత భద్రత ఉండేలా త్వరలో వాట్సాప్ యూపీఐని తీసుకు రానున్నారు.

అప్ డేట్ చేసుకోవాలి
వాట్సాప్ ద్వారా డబ్బులు పంపించడానికి భారత్‌లో బ్యాంకు ఖాతా, డెబిట్ కార్డు ఉండాలి. ఇందుకు సంబంధించిన ట్రాన్సాక్షన్ సమాచారాన్ని బ్యాంకులకు పంపిస్తుంది. యూపీఐ సపోర్ట్ చేసే ఎవరైనా వాట్సాప్ ద్వారా డబ్బులు పంపించవచ్చును. మనీ ట్రాన్స్‌ఫర్ సెక్యూరిటీ కోసం ప్రతి చెల్లింపు కోసం యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి. అన్ని ఐవోఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్ పేమెంట్ అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రావడానికి యాప్‌ను అప్ డేట్ చేసుకోవాలి.

జుకర్ బర్గ్ ఏమన్నారంటే
యూపీఐతో భారత్ ప్రత్యేకత సాధించిందని, భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక అయిన ఎంఎస్ఎంఈ వ్యాపారాల్లో కొత్త అవకాశాలను సృష్టిస్తోందని, ఇలాంటి ఘనత సాధించిన తొలి దేశం భారత్ అని జుకర్ బర్గ్ అన్నారు. ఇందులో తాము కూడా భాగస్వాములం కావడం, డిజిటల్ ఇండియాకు తమ వంతు సహకారం అందించే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. వాట్సాప్ ద్వారా డబ్బు పంపించడం, సందేశాలు పంపించినంత సులభమన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications