ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వాడుతున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) త్వరలో ఒక భారీ మార్పుకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు పూర్తిగా ఉచితంగా సేవలు అందిస్తున్న ఈ యాప్.. త్వరలో 'సబ్‌స్క్రిప్షన్' మోడల్‌ను తీసుకురాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే, కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లు కావాలనుకునే వారు నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల సాధారణ వినియోగదారుల మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? ఈ కొత్త ప్లాన్‌లో ఏయే ఫీచర్లు ఉండబోతున్నాయి? అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే వచ్చే లాభాలేంటి?
ప్రముఖ టెక్ వెబ్‌సైట్ 'WABetaInfo' నివేదిక ప్రకారం.. వాట్సాప్ ప్రస్తుతం కొన్ని 'కస్టమైజేషన్' ఫీచర్లపై పని చేస్తోంది. ఈ పెయిడ్ ప్లాన్ తీసుకునే యూజర్లకు అదనపు సౌకర్యాలు లభిస్తాయి.
- చాట్ పిన్ లిమిట్: ప్రస్తుతం మనం కేవలం 3 చాట్‌లను మాత్రమే టాప్‌లో పిన్ చేసుకోగలము. కానీ ఈ ప్లాన్ ద్వారా అంతకంటే ఎక్కువ చాట్‌లను పిన్ చేసుకునే అవకాశం ఉంటుంది.
- యాప్ ఐకాన్ మార్పు: మీకు నచ్చిన విధంగా వాట్సాప్ ఐకాన్ రంగును లేదా డిజైన్‌ను మార్చుకునే వెసులుబాటు కలుగుతుంది.
- కొత్త థీమ్స్, రింగ్‌టోన్స్: ఉచిత వెర్షన్‌లో లేని కొన్ని స్పెషల్ థీమ్స్, స్టిక్కర్లు , చాట్ రింగ్‌టోన్స్‌ను పెయిడ్ యూజర్లు వాడుకోవచ్చు.
యాడ్-ఫ్రీ ఎక్స్‌పీరియన్స్
ముఖ్యంగా యూరప్, బ్రిటన్ దేశాల్లోని యూజర్ల కోసం వాట్సాప్ మరో ప్లాన్ ను కూడా ఆలోచిస్తోంది. 'స్టేటస్' కనిపించే అప్‌డేట్స్ ట్యాబ్‌లో ప్రకటనలు (Ads) లేకుండా చూడాలంటే ఈ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. మీరు డబ్బులు కట్టకపోయినా పాత పద్ధతిలో వాట్సాప్ ను ఉచితంగా వాడుకోవచ్చు, కానీ ఈ అదనపు ఫీచర్లు మాత్రం మీకు అందుబాటులో ఉండవు.
భద్రతపై ఆందోళనలు
ఒకవైపు కొత్త ఫీచర్లు వస్తున్నా.. మరోవైపు వాట్సాప్ భద్రతపై అమెరికాలో కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. వాట్సాప్ మెసేజ్‌లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ అని కంపెనీ చెబుతున్నప్పటికీ మెటా సిబ్బంది వాటిని చూడగలరని కొందరు మాజీ కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. దీనిపై అమెరికా దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి. ఇది వాట్సాప్ యూజర్లలో కొంత ఆందోళన కలిగిస్తోంది.
వెయిట్ లిస్ట్ ప్రకారం..
వాట్సాప్ ఈ కొత్త పెయిడ్ ప్లాన్ కోసం 'వెయిట్ లిస్ట్' (Waitlist) సిస్టమ్ ను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అంటే ఈ ఫీచర్లు అందుబాటులోకి రాగానే ముందుగా నోటిఫికేషన్ పొందాలనుకునే వారు తమ పేరును నమోదు చేసుకోవచ్చు. ముఖ్యంగా వ్యాపారస్తులతో పాటు ప్రొఫెషనల్ యూజర్లు కూడా తమ చాటింగ్ అనుభవాన్ని మెరుగుపరుచుకోవడానికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. అయితే సాధారణ వినియోగదారులకు మాత్రం ఉచిత వెర్షన్ ఎప్పటిలాగే అందుబాటులో ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.
ఏది ఏమైనా వాట్సాప్ తీసుకురాబోతున్న ఈ పెయిడ్ ప్లాన్ ఇంకా డెవలప్‌మెంట్ స్టేజ్‌లోనే ఉంది. ఇది ఎప్పుడు లాంచ్ అవుతుంది? ధర ఎంత ఉంటుంది? అనే విషయాలను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈ మార్పు వాట్సాప్ హిస్టరీలోనే అతిపెద్ద మార్పుగా నిలవబోతోంది.


Click it and Unblock the Notifications