Whatsapp: వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్.. 32 మంది ఒకేసారి వీడియో కాల్ చేసుకోవచ్చు..
వాట్సాప్ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. అధికారికంగా కమ్యూనిటీలను ప్రారంభించింది. ఈ విషయాన్ని ఇదే విషయాన్ని మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. మార్కెట్‌లో కాంపిటీటర్‌లకు గట్టి పోటీ ఇస్తూ యూజర్లను ఆకట్టుకునేందుకు ఈ ఫీచర్ ను తీసుకొచ్చినట్లు తెలిసింది. మార్క్ జుకర్ బర్గ్ కమ్యూనిటీస్ ఫీచర్‌పై వర్క్ చేశారు. కొద్ది నెలల క్రితం బీటా వెర్షన్‌లో విజయ వంతంగా ట్రయల్స్ నిర్వహించి..గురువారం రియల్ టైం యూజర్లు వినియోగించేలా మార్కెట్‌కు పరిచయం చేశారు.
32 మంది
ఇది ఈ సంవత్సరం ప్రారంభంలో మొదటిసారిగా పరీక్షించారు. సంస్థలు, క్లబ్‌లు, పాఠశాలలు, ఇతర ప్రైవేట్ సమూహాలు మెరుగ్గా కమ్యూనికేట్ చేయడానికి దీన్ని రూపొందించినట్లు ఆ సంస్థ పేర్కొంది. కమ్యూనిటీలు మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌కు అడ్మిన్ నియంత్రణలు, ఉప సమూహాలు, ప్రకటన సమూహాలకు సపోర్ట్ చేస్తుందట. ఈ ఫీచర్ లో 32 మంది వాయిస్, వీడియోతో కాల్స్ చేసుకోవచ్చట.

1,024 మంది
వాట్సాప్ గతంలో గ్రూప్ సభ్యుల సంఖ్య 512 మంది వరకు చేరే సౌకర్యం ఉంది. తాజాగా ఆ సభ్యుల సంఖ్య 1,024కి పెంచింది. తద్వారా వ్యాపార వేత్తలు వారి క్లయింట్లకు పెద్ద సంఖ్యలో మెసేజ్ సెండ్ చేయడంతో పాటు వ్యాపార కార్యకలాపాల్ని మరింత వృద్ధి చేసుకోవచ్చట. వాట్సాప్ కాంపిటీటర్ టెలిగ్రాంలో సుమారు 2లక్షల మంది సభ్యులు చేరవచ్చు. ఎమోజి రియాక్షన్‌లు, పెద్ద ఫైల్ షేరింగ్ (2GB వరకు) చేయ్యొచ్చట. ఒక ప్రకటనలో, Meta CEO మార్క్ జుకర్‌బర్గ్ కమ్యూనిటీస్ ఫీచర్ యొక్క ఎన్‌క్రిప్షన్ అంశాలను కూడా నొక్కిచెప్పారు, కంపెనీ "ఎక్కడా కనిపించని గోప్యత, భద్రతతో సంస్థలు ఎలా కమ్యూనికేట్ చేస్తాయి అనే దాని కోసం బార్‌ను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది" అని చెప్పారు.


Click it and Unblock the Notifications