ఇన్‌స్టంట్ మెసేజింగ్ సంస్థ వాట్సాప్ సెప్టెంబరులో 26.85 లక్షల ఖాతాలను నిషేధించింది. ఇందులో 8.72 లక్షల వాట్సాప్ అకౌంట్లనుఎలాంటి ఫిర్యాదులు రాకముందే తొలగించినట్లు మంగళవారం వాట్సాప్ పేర్కొంది. ఆగస్టులో కూడా ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ 23.28 లక్షల ఖాతాలను నిషేధించింది. ఫేక్ వార్తలు, తప్పుడు సమాచారాన్ని నిరోధించే క్రమంలో తప్పుడు, నకిలీ ఖాతాలను బ్యాన్ చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది. అలాగే భారత ఐటీ రూల్స్ 2021కి (IT Rules 2021) అనుగుణంగా లక్షలాదిగా వాట్సాప్ అకౌంట్లను నిలిపేస్తున్నట్లు తెలిపింది.
యూజర్ సేఫ్టీ రిపోర్ట్
"1 సెప్టెంబర్, 2022 నుంచి 30 సెప్టెంబర్, 2022 మధ్య, 26,85,000 WhatsApp ఖాతాలు నిషేధించాం. ఈ ఖాతాలలో 872,000 వినియోగదారుల ఫిర్యాదు రాకముందే తొలగించం" అని వాట్సాప్ సెప్టెంబర్ నెలలో తన 'యూజర్ సేఫ్టీ రిపోర్ట్'లో పేర్కొంది. గత సంవత్సరం అమల్లోకి వచ్చిన కఠినమైన IT నిబంధనల ప్రకారం పెద్ద డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు (50 లక్షలకు పైగా వినియోగదారులతో) ప్రతి నెలా సమ్మతి నివేదికలను ప్రచురించాల్సి ఉంటుంది. అందిన ఫిర్యాదుల వివరాలను, తీసుకున్న చర్యలను అనందులో పేర్కొనాల్సి ఉంటుంది.

గ్రీవెన్స్ ఛానెల్
ఈ మేరకు 2022 సెప్టెంబర్ యూజర్ సేఫ్టీ రిపోర్ట్‌ను భారత ఐటీ మంత్రిత్వ శాఖకు అందించింది. అలాగే సెప్టెంబర్‌లో 666 ఫిర్యాదులు అందగా 23 మందిపై మాత్రమే చర్యలు తీసుకున్నట్టు వివరించింది. పెద్ద టెక్ కంపెనీల ఏకపక్ష కంటెంట్ నియంత్రణ, నిష్క్రియాత్మకత లేదా ఉపసంహరణ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఫిర్యాదుల అప్పీల్ మెకానిజమ్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం గత వారం నిబంధనలను ప్రకటించింది. గ్రీవెన్స్ ఛానెల్ ద్వారా యూజర్ ఫిర్యాదులకు ప్రతిస్పందించడం. వాటిపై చర్య తీసుకోవడంతో పాటు, ప్లాట్‌ఫారమ్‌లో హానికరమైన ప్రవర్తనను నిరోధిస్తున్నామని వాట్సాప్ పేర్కొంది.


Click it and Unblock the Notifications