ఫ్లయిట్లో జర్నీ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. ఈ రోజుల్లో అయితే చాలా మంది హాలిడేస్ సమయంలో ఫారెన్ టిప్స్ ప్లాన్ చేసుకొని మరీ ఫ్లయిట్లో జర్నీ చేస్తుంటారు. విహార యాత్రలు, ఫ్రెండ్స్ & ఫ్యామిలీ టూర్స్ ఇలా ఎక్కడికైనా ప్రయాణించాలనుకుంటే ఫ్లయిట్లో అలసిపోకుండా హాయిగా ప్రయాణించొచ్చు. కొన్ని సందర్భాల్లో ఎయిర్ లైన్స్ సంస్థలు ఆఫర్లు, డిస్కౌంట్స్ కూడా అందిస్తుంటాయి. విమాన ప్రయాణీకులకి సంబంధించి చాల విమానయాన సంస్థలు మార్గదర్శకాలను జారీ చేస్తాయి. ముఖ్యంగా పిల్లలతో విమానంలో ప్రయాణించడానికి కూడా కొన్ని రూల్స్ కూడా రూపొందించాయి. అయితే పిల్లలు విమానంలో ప్రయాణించడానికి ఎంత వయసు ఉండాలి.. పిల్లలకి ఎన్ని సంవత్సరాల తర్వాత ఫ్లయిట్ టిక్కెట్లు కొనడం అవసరం.. అసలు పిల్లలకు విమానంలో ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయో తెలుసా...

2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు: మీ పిల్లలకి 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉంటే, మీరు విమానంలో సీటు కోసం ప్రత్యేకంగా టికెట్ తీసుకోవలసిన అవసరం లేదు. అలాగే మీరు 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలని ఫ్రీగా మీ వెంట తీసుకొని ప్రయాణించవచ్చు. ఒకవేళ మీ పిల్లల వయస్సు 2 నుండి 12 సంవత్సరాల మధ్య ఉంటే విమానంలో వారికీ సీటు తప్పనిసరి. విమానయాన సంస్థలు 12 ఏళ్లు పైబడిన పిల్లలను అడల్ట్ ప్రయాణికులుగా పరిగణిస్తాయి. ఈ కారణంగా 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకి ఫుల్ టికెట్ కొనడం తప్పనిసరి.
పిల్లల టిక్కెట్లకు కూడా ఒక రూల్ : కొన్ని విమానయాన సంస్థల్లో ప్రయాణించడానికి చిన్న పిల్లలకు కిడ్స్ టిక్కెట్లు కొనడం అవసరం. పిల్లల టిక్కెట్లు పెద్దల టిక్కెట్ల కంటే తక్కువ ఖర్చుతో ఉంటాయి. అంతేకాకుండా పిల్లల కోసం విమానయాన సంస్థలు ప్రత్యేక రకమైన సీట్లను అందిస్తాయి.
5 సంవత్సరాల వయస్సు తర్వాత ఒంటరిగా ప్రయాణించవచ్చు: విమానంలో ఒంటరిగా ప్రయాణించడం గురించి మాట్లాడుకుంటే, 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఒంటరిగా ప్రయాణించవచ్చు. విమానంలో పిల్లల ప్రయాణానికి సంబంధించి ప్రతి విమానయాన సంస్థకు వేర్వేరు రూల్స్ ఉన్నాయి. సాధారణంగా అయితే పిల్లలు 5 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత విమానంలో ఒంటరిగా ప్రయాణించవచ్చు.
వికలాంగ పిల్లలకు రూల్స్: వికలాంగులైన పిల్లలకు విమానంలో ఆసౌకర్యం కలగకుండా ఉండటానికి ప్రత్యేక రూల్స్ రూపొందించాయి. శారీరక వైకల్యం ఉన్న పిల్లలు వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో మాత్రమే ప్రయాణించడానికి అనుమతిస్తారు. అలాగే విమాన ప్రయాణంలో వికలాంగులైన పిల్లలకు స్ట్రెచర్, వీల్‌చైర్ అండ్ వైద్య సహాయం వంటి సౌకర్యాలను ఎయిర్‌లైన్ అందిస్తుంది. 2 సంవత్సరాల వికలాంగులైన పిల్లలకు ఫ్రీ సీట్లు లభిస్తాయి. దీనికి విమాన సంస్థలు ఎటువంటి చార్జెస్ వసూలు చేయదు. మీ పిల్లలకు 2 సంవత్సరాలు నిండకపోతే వారికీ ఒక ఊయల లేదా పిల్లల సీటు ఇస్తారు. 2 నుండి 12 సంవత్సరాల మధ్య వయస్సుగల వికలాంగుల పిల్లల టికెట్ ధర 25% నుండి 50% వరకు తక్కువ ఉంటుంది.
విమానంలో పిల్లలు ఈ వస్తువులు పొందవచ్చు: 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు విమానంలో వాటర్ బాటిల్స్, డైపర్లు, నాప్‌కిన్లు ఇంకా ఫుడ్ ప్యాకెట్లు లభిస్తాయి. 2 సంవత్సరాల కంటే పెద్ద పిల్లలకు క్రాఫ్ట్ బుక్స్, పజిల్ గేమ్స్ మొదలైనవి ఇస్తారు. మీ ప్రయాణంలో బ్రేక్ ఉంటే హాల్ట్ సమయంలో తల్లి ఇంకా నవజాత శిశువు విశ్రాంతి తీసుకోవడానికి లాంజ్‌లో ప్లేస్ అందుబాటులో ఉంటుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications