మన భారతదేశ సంతతికి చెందిన వాళ్ళు ప్రపంచం మొత్తం నలుమూలల్లో ఎక్కడో చోట ఉండే ఉంటారు. అయితే కొందరు మీడియా ద్వారా వార్తల్లో నిలుస్తుండగా, మరికొందరు ఉన్నత పదవులు నిర్వహిస్తూ ప్రపంచానికి కనిపిస్తున్నారు. వీరిలో చాల మంది పేరులు తరచుగా వినిపిస్తుంటాయి. అందులో ఒకరైన ఉషా చిలుకూరి గురించి మీకు తెలుసా...

అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్(jd vance) భార్య ఉషా చిలుకూరి వాన్స్‌తో కలిసి వచ్చే వారం భారతదేశాన్ని సందర్శించనున్నారు. అలాగే వీరు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కూడా చర్చలు జరుపనుండగా, జెడి వాన్స్ దంపతులు ఏప్రిల్ 21 నుండి 24 మధ్య భారతదేశాన్ని సందర్శించవచ్చని భావిస్తున్నారు. ఈ దంపతుల ముగ్గురు పిల్లలు ఇవాన్, వివేక్ అండ్ మిరాబెల్ కూడా వారితో పాటు రావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఉషా వాన్స్ భారత సంతతికి చెందిన అమెరికన్ పౌరురాలు. అంటే ఆమెకి భారతదేశంతో సంబంధం ఉంది.
ఉష అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ భార్య కాబట్టి ఆమెకి రెండవ యునైటెడ్ స్టేట్స్ పౌరురాలిగా హోదా ఉంటుంది. అంటే ఆమె భారత సంతతికి చెందిన మొదటి మహిళగా రెండవ అమెరికన్ పౌరురాలు. ఇది ఒక రికార్డు కూడా. ఆమె భారతీయ అమెరికన్ మాత్రమే కాదు, యునైటెడ్ స్టేట్స్ రెండవ పౌరురాలు అయిన మొదటి ఆసియా అమెరికన్, మొదటి తెలుగు ఇంకా మొదటి హిందూ మహిళ కూడా.
తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు: ఉషా వాన్స్ 6 జనవరి 1986న కాలిఫోర్నియాలో జన్మించారు. ఆమె అమెరికాలో పుట్టి పెరిగింది. ఆమె తల్లి పేరు లక్ష్మి, తండ్రి పేరు రాధాకృష్ణ. వీరు ఆంధ్రప్రదేశ్ నివాసి కానీ 1980 సంవత్సరంలో అమెరికాలో స్థిరపడ్డాడు. ఉష తల్లి బయోలాజిస్ట్, తండ్రి ఇంజనీర్.
ఉషా వాన్స్ అమెరికాలో జన్మించినప్పటికీ ఆమె తల్లిదండ్రులు ఆమెకు భారతీయ సంస్కృతి, విద్య, హిందూ మతం ప్రకారం విలువలను అందించారు. తన తల్లిదండ్రుల ఆదర్శాలను దృష్టిలో ఉంచుకుని తాను చదువుకున్నానని ఉష స్వయంగా చెప్పింది. 2014 సంవత్సరంలో ఉష జెడి వాన్స్‌ను వివాహం చేసుకుంది.
చదువు, ఉద్యోగం : ఉష 2007లో యేల్ విశ్వవిద్యాలయం నుండి హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఆమె గ్రాడ్యుయేషన్ సమయంలో ఎడ్యుకేషన్ పాలసీ పబ్లికేషన్స్ చీఫ్ ఎడిటర్గ కూడా పనిచేశారు. గ్రాడ్యుయేషన్ తర్వాత గేట్స్ కేంబ్రిడ్జ్ స్కాలర్‌షిప్ సహాయంతో కేంబ్రిడ్జ్ నుండి మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీని పొందారు.
ఉష యేల్ లా స్కూల్ నుండి లా చదివు పూర్తి చేసాక చాల బాధ్యతలను కూడా నిర్వర్తించారు. ఆమె యేల్ జర్నల్ ఆఫ్ లా & టెక్నాలజీకి మేనేజింగ్ ఎడిటర్‌గా ఇంకా యేల్ లా & పాలసీ రివ్యూకు ఎడిటర్‌గా కూడా ఉన్నారు. ఆమె సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ వద్ద గుమస్తాగా కూడా పనిచేశారు. అంతకుముందు ఆమె 2013 నుండి 2014 వరకు కెంటుకీ జిల్లా కోర్టు న్యాయమూర్తి అముల్ థాపర్ వద్ద లా క్లర్క్‌గా కూడా పనిచేశారు.
ఆమె సంపద ఎంత: ఉషా వాన్స్ నికర విలువ గురించి సరైన సమాచారం లేదు. కానీ మీడియా నివేదికల ప్రకారం, ఉషా ఇంకా ఆమె భర్త జెడి వాన్స్ ఆస్తికి ఎటువంటి కొరత లేదు. జెడి వాన్స్ రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు మొదలైన వాటిలో పెట్టుబడులు పెడుతుంటాడు. ఫోర్బ్స్ ప్రకారం JD వాన్స్ నికర విలువ దాదాపు $10 మిలియన్లు అంటే సుమారు రూ. 85 కోట్లుగా అంచనా. ఆగస్టు 2014లో ఉషా వాన్స్ అండ్ జెడి వాన్స్ వాషింగ్టన్ డిసిలో $5,90,000కి ఒక ఇంటిని కొనుగోలు చేశారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, ఆ ఇంటి విలువ ఇప్పుడు దాదాపు $850,000. ఇది కాకుండా ఉష అండ్ జెడి వాన్స్ సిన్సినాటిలోని ఈస్ట్ వాల్‌నట్ హిల్స్‌లో $1.4 మిలియన్లకు ఒక ఇంటిని కొన్నారు. ఇది కాకుండా ఈ జంటకు ఇతర ఆస్తులు కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications