For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెరికా కొత్త అధ్యక్షుడు... ట్రంప్ హయాంలో చైనాతో ఢీ: భారత్‌తో వాణిజ్య సంబంధాలు

|

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోబిడెన్, డొనాల్డ్ ట్రంప్‌లలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉంది. చైనా, పాకిస్తాన్ అంశాల నేపథ్యంలో కొత్త అధ్యక్షుడు భారత్‌తో నెరిపే సంబంధాల గురించి భారతీయులు ఆసక్తిగా ఉన్నారు. చైనాపై ఆగ్రహం, భారత్‌పై అభిమానం ట్రంప్‌లో కనిపించినప్పటికీ, ఎన్నికల సమయంలో ఆయన వ్యాఖ్యలు ఆగ్రహం తెప్పించాయి. బిడెన్‌పై వ్యతిరేక ముద్ర ఉంది. ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారు, సంబంధాలు ఎలా నెరుపుతారనేది ఆసక్తికరం. చైనా, ఇండో-పసిఫిక్, పాకిస్తాన్, ఆప్గనిస్తాన్‌తో సంబంధాలు ఎలా ఉంటాయనేది ఆసక్తి.

ఆర్థిక వ్యవస్థ అద్భుతం.. అమెరికా ఎకానమీని డొనాల్డ్ ట్రంప్ నిలబెట్టారుఆర్థిక వ్యవస్థ అద్భుతం.. అమెరికా ఎకానమీని డొనాల్డ్ ట్రంప్ నిలబెట్టారు

చైనాకు ధీటుగా.. ఢీ

చైనాకు ధీటుగా.. ఢీ

ప్రీ-పోల్ సర్వేలో జోబిడెన్ గెలుస్తారని భావించారు. కానీ పరిస్థితి అంత ఈజీగా ఏమీ కనిపించడం లేదు. హోరాహోరీగా ఉంది. పలు రాష్ట్రాలను ట్రంప్, బిడెన్ గెలుపు సాధించారు. ఎలక్ట్రోరల్ ఓట్లు కీలకం కానున్నాయి. అమెరికా ఫస్ట్ అనే రాజకీయ అంశాన్ని పక్కన పెడితే, అమెరికాను పెద్ద ఉత్పాదక శక్తిగా మార్చాలన్న తన ప్రచారానికి అనుగుణంగా ట్రంప్ తన పదవీ కాలంలో చైనాతో తన వాణిజ్యలోటును చాలాసార్లు పెంచారు. రెండు దేశాలను వాణిజ్య అంచులకు తీసుకు వెళ్లారు. ప్రపంచీకరణ నుండి చైనా లాభపడిందని ముంబైకి చెందిన థింక్ ట్యాంక్ గేట్‌వే హౌస్ డైరెక్టర్ అండ్ కోఫౌండర్ మంజీత్ కృపలానీ అన్నారు. చైనా ఉత్పాదకతతో పాటు సాంకేతిక ఆర్థిక వ్యవస్థ, టెక్నాలజీలోను డబ్బులు పెట్టిందన్నారు.

అమెరికాతో చైనా భారీ వాణిజ్య మిగులు

అమెరికాతో చైనా భారీ వాణిజ్య మిగులు

2019లో అమెరికాతో 308.8 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులును చైనా కలిగి ఉన్నట్లు యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్స్ (USTR) తెలిపింది. అమెరికా 163 బిలియన్ డాలర్ల విలువ కలిగిన అమెరికా ఉత్పత్తులను డ్రాగన్ దేశానికి ఎగుమతి చేయగా, చైనా నుండి 471.8 బిలియన్ డాలర్ల ఉత్పత్తులు అమెరికాకు దిగుమతి అయ్యాయి. 2019లో చైనా నుండి దిగుమతి చేసుకున్న మూడో పెద్ద దేశం అమెరికా. గత ఏడాది మే నెలలో అమెరికా 200 బిలియన్ డాలర్ల చైనా ఉత్పత్తులపై టారిఫ్‌ను 10 శాతం నుండి 25 శాతానికి పెంచింది. ఇందులో ఇంటర్నెట్ మోడెమ్, రూటర్స్, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్, ఫర్నీచర్, బిల్డింగ్ మెటిరీయల్ వంటి 5700 ఉత్పత్తులు ఉన్నాయి. దీనికి ప్రతిగా చైనా కూడా సుంకం విధించింది. 20 శాతం నుండి 25 శాతానికి పెంచింది.

అమెరికాతో భారత్‌కు వాణిజ్య మిగులు

అమెరికాతో భారత్‌కు వాణిజ్య మిగులు

చైనానే కాదు... భారత్ సహా పలు దేశాల నుండి ట్రంప్ వాణిజ్ మిగులును కోరుకుంటున్నారు. ఇందుకోసం ఏ అవకాశాన్ని వదులుకునేలా కనిపించలేదు ట్రంప్. 2019లో అమెరికాతో భారత్ 28.8 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులును కలిగి ఉంది. 2019లో భారత్ 87.4 బిలియన్ (6.5 లక్షల కోట్లు) డాలర్లను అమెరికాకు ఎగుమతి చేయగా, అగ్రరాజ్యం నుండి 58.6 బిలియన్ డాలర్లు (4.4 లక్షల కోట్లు) దిగుమతి అయ్యాయి. సాంప్రదాయంగా డెమోక్రాట్లు రక్షణాత్మకంగా ఉంటే, రిపబ్లికన్లు ట్రేడ్ ఫ్రెండ్లీగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. డెమోక్రాట్లు ఎన్నికైతే కాంట్రోవర్సీస్ తక్కువగా ఉంటాయని చెబుతున్నారు.

ట్రంప్ నిర్ణయాలపై ఆగ్రహం

ట్రంప్ నిర్ణయాలపై ఆగ్రహం

ఇక, అమెరికాలో ట్రంప్ ఇమ్మిగ్రేషన్ కఠిన నిర్ణయాల వల్ల అగ్రరాజ్యంలో పని చేస్తున్న భారతీయుల ఆగ్రహానికి గురయ్యారు. కరోనా వల్ల ఏర్పడిన నిరుద్యోగ సమస్యను తీర్చేందుకు హెచ్1బీ వీసాలపై తాత్కాలిక ఆంక్షలు విధించారు. ట్రంప్ నిర్ణయం భారత టెక్ సంస్థలకు ఇబ్బందులు సృష్టించాయి. అంతేకాదు, ట్రంప్ నిర్ణయాలు అమెరికా ఆర్థిక వ్యవస్థ రికవరీని మందగమనంలోకి నెడుతుందని అమెరికా కంపెనీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి.

అలాగే, భారత వ్యవసాయ మార్కెట్లో ఆధిపత్యం ఉండేలా అమెరికా కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. జనరలైజ్డ్ సిస్టం ఆఫ్ ప్రిఫరెన్స్ (GSP)ని పునరుద్ధరించాలని ఇండియా కోరుతోంది. ఏదేమైనా వాణిజ్యపరంగా ట్రంప్ ఆధ్వర్యంలో భారత్‌కు కాస్త లాభం చేకూరుతుందని, ప్రపంచం కూడా ట్రంప్, కరోనా వల్ల చైనా నుండి దూరం పోవడంఇది భారత్‌కు కలిసి వచ్చే అంశమని కొంతమంది అభిప్రాయం.

English summary

అమెరికా కొత్త అధ్యక్షుడు... ట్రంప్ హయాంలో చైనాతో ఢీ: భారత్‌తో వాణిజ్య సంబంధాలు | What will the US election results mean for India businesses?

While many in India, like people around the world, are interested in the US elections just to see who will win between Donald Trump and Joseph Biden, let us take a look at what the results could mean for US ties with India.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X