డొనాల్డ్ ట్రంప్ కు అమెరికా సుప్రీంకోర్టు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ప్రపంచ దేశాలపై సుంకాలు విధించే అధికారం ట్రంప్ కు లేదని తేల్చి చెప్పింది. అంతర్జాతీయంగా సహచర దేశాలపై డొనాల్డ్ ట్రంప్ విధించిన పరస్పర సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేయడంతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నిర్ణయం వెలువడిన కొన్ని గంటలకే.. ట్రంప్ అన్ని దేశాలపై 10 శాతం ప్రపంచ సుంకాన్ని విధిస్తూ మరో కీలక నిర్ణయంపై సంతకం చేయడం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది.
ఈ పరిణామాల నేపథ్యంలో.. దలాల్ స్ట్రీట్‌తో పాటు ప్రపంచ మార్కెట్లు సోమవారం ఎలా స్పందిస్తాయన్నది పెట్టుబడిదారుల్లో ఆసక్తి, అనిశ్చితిని పెంచుతోంది. ట్రంప్ విధించిన సుంకాల ద్వారా అమెరికా ప్రభుత్వం దాదాపు 175 బిలియన్ డాలర్ల వరకు వసూలు చేసినట్టు అంచనాలు ఉన్నాయి.
అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ సుంకాలను రద్దు చేయడంతో, ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలా లేదా అన్న అంశంపై స్పష్టత లేకపోవడం మార్కెట్లలో ఆందోళనను పెంచుతోంది. ఈ అనిశ్చితి ప్రభావం అమెరికా మార్కెట్లకే కాకుండా బంగారం, వెండి వంటి సురక్షిత పెట్టుబడుల ధరలపై కూడా పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మార్కెట్ నిపుణుల ప్రకారం.. సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టు తీర్పు భారత ఎగుమతిదారులకు ఉపశమనం కలిగించే అంశంగా మారనుంది. అమెరికా మార్కెట్‌కు భారత ఉత్పత్తుల ప్రవేశం సులభమయ్యే అవకాశం ఉండటంతో పాటు, పెట్టుబడిదారుల్లో సానుకూల భావన ఏర్పడిందని వారు చెబుతున్నారు.
ఈ సానుకూల సెంటిమెంట్ ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ సోమవారం గ్యాప్-అప్ ఓపెనింగ్‌తో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. గిఫ్ట్ నిఫ్టీ నిఫ్టీ 50 ముగింపుతో పోలిస్తే దాదాపు 200 పాయింట్లు ఎగబాకడం, అమెరికా సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత దలాల్ స్ట్రీట్‌లో పాజిటివ్ సెంటిమెంట్‌ను ప్రతిబింబిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
SMC గ్లోబల్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ సీమా శ్రీవాస్తవ మాట్లాడుతూ.. సోమవారం దలాల్ స్ట్రీట్‌లో వాణిజ్య కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైనప్పుడు మార్కెట్ గ్యాప్-అప్‌తో తెరుచుకోవచ్చని తెలిపారు. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) కింద విధించిన టారిఫ్‌లను రద్దు చేయాలన్న సుప్రీంకోర్టు నిర్ణయం భారత ఎగుమతిదారులకు పెద్ద విజయమని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ టారిఫ్‌లు 50 బిలియన్ డాలర్లకు పైగా విలువైన భారత ఎగుమతులను ప్రభావితం చేశాయని, ముఖ్యంగా వస్త్రాలు, రత్నాలు వంటి కార్మికాధారిత రంగాలు తీవ్ర సవాళ్లను ఎదుర్కొన్నాయని ఆమె పేర్కొన్నారు.ఈ తీర్పుతో భారత్-అమెరికా వాణిజ్య చట్రంలో అంగీకరించిన 18 శాతం పరస్పర సుంకం ప్రభావం గణనీయంగా తగ్గుతుందని.. భారత ఎగుమతుల్లో సుమారు 55 శాతం ఇప్పుడు కేవలం 10 శాతం సుంకానికే లోబడి ఉంటాయని ఆమె వివరించారు.
అయితే SS వెల్త్‌స్ట్రీట్ వ్యవస్థాపకురాలు సుగంధ సచ్‌దేవా మాట్లాడుతూ.. ఈ తీర్పు రంగాలవారీగా ప్రత్యేక చట్టాల కింద విధించిన సుంకాలపై ప్రభావం చూపదని స్పష్టం చేశారు. ఉక్కు, అల్యూమినియం, ఆటోమొబైల్స్, సెమీకండక్టర్లు వంటి వ్యూహాత్మక రంగాలపై ఉన్న సుంకాలు యథాతథంగా కొనసాగుతాయని ఆమె తెలిపారు.
ఇక బంగారం, వెండి ధరలపై ఈ పరిణామాల ప్రభావం కూడా కీలకంగా మారింది. ట్రంప్ సుప్రీంకోర్టు తీర్పును బహిరంగంగా విమర్శిస్తూ మరోసారి 10 శాతం ప్రపంచ సుంకాన్ని ప్రకటించడం వాణిజ్య విధానంలో అనిశ్చితిని పెంచిందని సుగంధ సచ్‌దేవా అన్నారు.
పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న అమెరికా సైనిక కదలికలు, దౌత్యపరమైన గడువులు వంటి అంశాలు బంగారం, వెండి వంటి సురక్షిత పెట్టుబడులకు మద్దతుగా మారుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. Gold, Silver ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
క్లుప్తంగా చెప్పాలంటే అమెరికా సుప్రీంకోర్టు తీర్పు.. ట్రంప్ తాజా సుంకాల నిర్ణయాలు, గ్లోబల్ వాణిజ్య అనిశ్చితి అన్నీ కలసి భారత స్టాక్ మార్కెట్‌లో తక్షణ సానుకూల స్పందనకు, అలాగే బంగారం, వెండి ధరల్లో బలమైన కదలికలకు దారితీసే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

బంగారం ధరలు కాస్త శాంతించాయి.. లక్షా యాభై వేల రూపాయల దిగువకు.. మార్చి 21, శనివారం ధరలు ఇవే..

కుప్పకూలిన బంగారం ధర.. 10 గ్రాములు ఏకంగా రూ. 5 వేలకు పైగా ఢమాల్.. కొనుగోలుపై నిపుణులు కీలక సూచన

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. మార్చి 23, సోమవారం ధరలు ఇవే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు, కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు, కారణం ఏంటంటే..

యుద్దంపై ఇరాన్ కీలక ప్రకటన.. భారీ సైనిక దాడులు చేస్తామంటున్న ట్రంప్.. అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications