న్యూఢిల్లీ: ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తిరిగి తీసుకోవాలని NCLAT ఇచ్చిన ఆదేశాలను టాటా సన్స్ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. NCLAT ఉత్తర్వులను కొట్టివేయాలని కోరింది. అలాగే, ఎన్ చంద్రశేఖరన్ నియామకం చట్టవిరుద్ధమనే ఆదేశాలను కూడా తిరస్కరించాలని అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. సైరస్ మిస్త్రీని గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా తిరిగి నియమిస్తూ డిసెంబర్ 18న NCLAT ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో టాటా సన్స్ ఏం చెప్పిందంటే....

కార్పోరేట్ చట్ట, నియమాలకు విరుద్ధం
NCLAT ఆదేశాలు కార్పోరేట్ ప్రజాస్వామ్యాన్ని, బోర్డు డైరెక్టర్ల హక్కులను కాలరాసినట్లు టాటా సన్స్ పేర్కొంది. ఈ తీర్పు కార్పోరేట్ చట్ట నియమాలకు విరుద్ధమని తెలిపింది. NCLAT తీర్పును కానీ, అది కొనుగొన్న విషయాలను కానీ, కారణాలను కానీ చర్చించకుండా ప్రేరేపిత తీర్పుతో తమపై ఫిర్యాదు చేసిన వారికి పలు ఊరటలను అందించిందని తెలిపింది. ఇది ప్రమాదకర న్యాయ ప్రమాణాలను సూచిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. టాటా సన్స్, సభ్యుల ప్రయోజనాలకు తీవ్ర భంగకర అంశమని పేర్కొంది.

2017లోనే పదవీ కాలం ముగిసింది
మార్చి 2017న మిస్త్రీ పదవీకాలం ముగిసిందని, అలాంటప్పుడు మిస్త్రీని తన మిగిలిన పదవీ కాలానికి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమించాలని ఆదేశాలు ఇవ్వడం చట్ట వ్యతిరేకమని, ఎన్ చంద్రశేఖరన్ నియామకాన్ని బోర్డు, షేర్ హోల్డర్లు అంగీకరించిన తర్వాతనే చట్టానికి లోబడి చేపట్టినప్పటికీ ఇది చట్ట వ్యతిరేకమని చెప్పడం సరికాదని పేర్కొంది. మిస్త్రీ పునర్నియామకం చెల్లదేని స్పష్టం చేసింది. కాగా, సుప్రీం కోర్టు ఈ విచారణను 6న చేపట్టవచ్చు.

ROC విజ్ఞప్తిపై విచారణ
మరోవైపు, సైరస్ మిస్త్రీని తిరిగి టాటా సన్స్ చైర్మన్‌గా నియమిస్తూ NCLAT ఇచ్చిన ఆదేశాల్లో సవరణలు చేయాలని కోరుతూ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ROC) దాఖలు చేసిన విజ్ఞప్తిపై విచారణను NCLAT శుక్రవారం (జనవరి 3) వాయిదా వేసింది. సైరస్ మిస్త్రీని తిరిగి చైర్మన్‌గా నియమిస్తూ NCLAT డిసెంబర్ 18న తీర్పు చెప్పింది. సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు టాటా సన్స్‌కు నాలుగు వారాల గడువు ఇచ్చింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications