సెన్సెక్స్ మహా పతనం: స్టాక్ మార్కెట్ కుప్పకూలడానికి కారణాలు ఇవే..
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అన్ని రంగాలు కూడా తీవ్రమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ కుప్పకూలింది. అమెరికా బాండ్ యీల్డ్స్ 13 నెలల గరిష్టానికి చేరుకున్నాయి. అదే సమయంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. క్రితం వారం అమెరికా సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఈ ప్రభావం మన మార్కెట్ల పైన పడింది. ఇవి ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. దీంతో దలాల్ స్ట్రీట్ నష్టాల్లో ఉంది. సెన్సెక్స్ మధ్యాహ్నం గం.11.30 సమయానికి 800 పాయింట్ల మేర నష్టపోయి 49,994 పాయింట్ల వద్ద ఉంది. 50వేల పాయింట్ల దిగువకు చేరుకుంది. ఆ తర్వాత స్వల్పంగా కోలుకొని, 50వేల పాయింట్ల పైకి చేరుకుంది.
ఫిబ్రవరిలో ఆహార ధరలు పెరగడంతో రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్ఠానికి చేరుకుంది. డిసెంబర్ నెలలో సానుకూలంగా నమోదైన పారిశ్రామికోత్పత్తి జనవరిలో మళ్లీ ప్రతికూలత నమోదు చేసింది. ఆహార వస్తువుల ధరలు పెరగడంతో రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో మూడు నెలల గరిష్టం 5.03 శాతానికి చేరుకుంది. పారిశ్రామికోత్పత్తి సూచీ క్షీణించింది.

గనులు, తయారీ వంటి వివిధ రంగాల్లో ఉత్పత్తి తగ్గి జనవరిలో ఈ సూచీ 1.6 శాతం మేర క్షీణించింది. అమెరికా సూచీలు కూడా గతవారం ప్రతికూలంగా క్లోజ్ అయ్యాయి. వీటికి దేశీయ గణాంకాలు తోడవడం మార్కెట్ నష్టాలకు కారణాలు. ఆసియా మార్కెట్లు కాస్త సానుకూలంగా ఉన్నప్పుడు భారత మార్కెట్లు నష్టపోయాయి. ఇందుకు ప్రధానంగా దేశీయ గణాంకాలు కారణం.
భారత్‌లో కరోనా కేసులు గత 24 గంటల్లో 25,320 పెరిగాయి. గత మూడు నెలల కాలంలో ఓ రోజులో అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. దీంతో కరోనా కేసులు మన దేశంలో 1.13 కోట్లకు చేరుకున్నాయి. అమెరికాలో గతవారం జాబ్-లెస్ క్లెయిమింగ్స్ నాలుగు నెలల కనిష్టానికి పడిపోయింది. అయితే ఆ తర్వాత కాస్త పెరిగింది. ఇది కూడా మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీసింది.


Click it and Unblock the Notifications