అమెరికాలో మొత్తం జనాభాలో కేవలం 1.5% మంది భారతీయులు ఉన్నప్పటికీ, సంఖ్యలో తక్కువగా ఉన్నా, వారి ప్రభావం మాత్రం చాలా ఎక్కువగా ఉంది. చదువు, ఉద్యోగాలు, వ్యాపారం, టెక్నాలజీ, వైద్యశాఖల్లో భారతీయులు అనూహ్యమైన స్థాయిలో విజయాలు సాధించారు. చిన్న సంఖ్యలో ఉన్నప్పటికీ, వారి ప్రతిభ, కష్టపడి పనిచేసే వైఖరి, కుటుంబ మద్దతు మరియు కమ్యూనిటీ నెట్‌వర్క్‌ల వల్ల అమెరికా సమాజంలో వారి ప్రాముఖ్యత మరింత పెరిగింది. అమెరికాలో అక్కడే పుట్టిన అమెరికన్లు, ఇతర ఇమ్మిగ్రెంట్ గ్రూప్స్‌ను కూడా అధిగమిస్తూ భారతీయులు ఎలా ముందుంటున్నారో ఎందుకు అంత ప్రభావం చూపుతున్నారో చూద్దాం.

భారతీయ అమెరికన్లు చిన్న సంఖ్యలో ఉన్నప్పటికీ 25 ఏళ్లు పైబడిన భారతీయ అమెరికన్లలో 76% మంది కనీసం బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి ఉన్నారు. ఇదే అమెరికా సగటు 38% కి మాత్రమే ఉన్నారు, అంటే విద్యా స్థాయిలో మన వాళ్ళు రెండింతలు ముందున్నారు. గృహ ఆదాయంలో కూడా సుమారు $152,341, అంటే అమెరికా వాళ్ళ సగటు $69,000 కంటే రెండింతలు ఎక్కువ. వైద్య రంగంలో భారతీయులు US లోని వైద్యులలో సుమారు 9% ని కవర్ చేస్తున్నారు. సంఖ్యలో కేవలం 1.5% మాత్రమే ఉన్నప్పటికీ. సిలికాన్ వ్యాలీ స్టార్టప్‌లలో 15.5% భారతీయులు వ్యవస్థాపకులే అకాడెమియాలో 22,000కి పైగా భారతీయ వంశస్థులు US యూనివర్సిటీలలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు, టాప్ 50 యూనివర్సిటీలలో 70% భారతీయులు లీడర్‌షిప్‌లో ఉన్నారు. కార్పొరేట్ రంగంలో గూగుల్ (సుందర్ పిచాయ్), మైక్రోసాఫ్ట్ (సత్య నాదెళ్ల), IBM (అరవింద్ కృష్ణ), అడోబ్ (శాంతను నారాయణ్) వంటి కంపెనీల CEOs భారతీయులే.
బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ మీకోసం.. అధిక వడ్డీ రేటుతో..
ఇది ఎలా సాధ్యమైంది?
1. 1965 తర్వాత అమెరికాకు వచ్చిన భారతీయ వలసదారులు ఎక్కువగా STEM(సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) రంగాల్లో డిగ్రీలతో వచ్చారు. 1965 ఇమ్మిగ్రేషన్ చట్టం వల్ల రేస్-బేస్ వర్గాలు తొలగించబడ్డాయి, మరియు విద్యార్హతలున్న వలసదారులకు ప్రాధాన్యం ఇచ్చింది.
2. భారతీయ సంస్కృతిలో చదువు చాలా గౌరవనీయంగా భావిస్తారు. ఫ్యామిలీలు STEM ఫీల్డ్స్‌ను ప్రాధాన్యం ఇస్తూ, మంచి జీతాలు, ఉద్యోగ అవకాశాలు ఉన్న రంగాల్లో పిల్లలను నడిపిస్తారు. ఇది అమెరికన్ డ్రీమ్ ను చేరుకునే మార్గం.
3. భారతీయ అమెరికన్ కమ్యూనిటీలు నెట్‌వర్క్స్, ఆల్యూమ్నీ అసోసియేషన్లు, మెంటారింగ్, జాబ్ రిఫరల్స్, స్టార్టప్ ఫండింగ్ ఇలా ఇవన్నీ సక్సెస్ సైకిల్ ను సృష్టిస్తున్నాయి.
4. భారతీయులు ఇంగ్లీష్‌లో నైపుణ్యం కలిగి ఉండటం వల్ల టెక్, మేనేజ్‌మెంట్, లా వంటి ఫీల్డ్స్‌లో ప్రత్యేక స్థానాన్ని పొందుతున్నారు.
5. భారతీయులు ఎక్కువగా IT, మెడిసిన్, ఫైనాన్స్, అకాడెమియా లో ఉంటారు. ఇవి అక్కడ ఎక్కువ జీతాలు, లీడర్‌షిప్ అవకాశాలు, గుర్తింపును ఇస్తున్నాయి.
ఉదాహరణకి అమెరికాలో 50,000కి పైగా భారతీయ డాక్టర్లు పనిచేస్తున్నారు. అలాగే, MIT, హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ వంటి ప్రముఖ యూనివర్సిటీలలో డిపార్ట్మెంట్స్ మరియు రీసెర్చ్ సెంటర్స్‌ను భారతీయులే నడుపుతున్నారు. టెక్నాలజీ రంగంలో, న్యూటానిక్స్, యాప్‌డైనమిక్స్, జెడ్‌స్కేలర్ 6+-వంటి భారతీయ-స్థాపిత స్టార్టప్‌లు బిలియన్ల డాలర్ వ్యాల్యువేషన్‌తో పబ్లిక్ అయ్యాయి, ఇది వారి వ్యాపార నైపుణ్యాన్ని మరియు నాయకత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
భారతీయుల విజయం కేవలం వ్యక్తిగత ప్రయత్నం మాత్రమే కాదు. ప్రతిభ మరియు సరైన అవకాశాలు కలిసినప్పుడు, భౌగోళిక పరిమితులు కూడా అంత ప్రభావం చూపవు. అమెరికా స్కిల్డ్ ఇమ్మిగ్రెంట్లను ఆదరిస్తుంది, భారత్ ప్రపంచ స్థాయి ప్రతిభను ఉత్పత్తి చేస్తుంది. భారతదేశం వేగంగా ఎదుగుతూ మరిన్ని ప్రతిభావంతులు తిరిగి రావడం ద్వారా దేశ అభివృద్ధి మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంది. అమెరికాలో భారతీయుల విజయం ఒక ఉదాహరణ. మంచి అవకాశాలు ఉన్నప్పుడు ప్రతిభ ఎలాంటి ఫలితాలు సాధించగలదో చూపిస్తుంది.
More From GoodReturns

చైనాతో రహస్యంగా జతకట్టిన ఇరాన్.. అమెరికాకు బిగ్ షాక్..హార్ముజ్ జలసంధి వేదికగా డాలర్ ఆధిపత్యానికి చెక్..

హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసేసిన ఇరాన్.. ఇజ్రాయెల్ దాడులతో సంక్షోభంలోకి కాల్పుల విరమణ ఒప్పందం..

ఇరాన్ ప్రతిపాదనను చెత్త బుట్టలో పడేసిన ట్రంప్.. టెహ్రాన్ కోరికల జాబితాను ఆమోదించే ప్రసక్తే లేదన్న వైట్ హౌస్..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..



Click it and Unblock the Notifications