Gold: ఒక వ్యక్తి వద్ద గరిష్టంగా ఎంత బంగారం ఉండాలి..!

చాలా మందికి బంగారం అంటే ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు కచ్చితంగా బంగారం కావాల్సిందే. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అయితే పసిడి ఉండాల్సిందే. ఎంత పడితే అంతా బంగారం కొనుగోలు చేయవచ్చు. ఒక మనిషి వద్ద ఎంత బంగారం ఉండవచ్చు. పరిమితికి మించి బంగారం ఉంటే ఆదాయపు పన్ను శాఖ సీజ్ చేస్తుందా అనే సందేహాలు చాలా మందికి ఉన్నాయి. సాధారణంగా పెళ్లయిన స్త్రీకి 500 గ్రాములు, పెళ్లికాని మహిళకు 250 గ్రాములు, పురుషుడికి 100 గ్రాములు మాత్రమే ఉండాలనేది చాలా మంది చెబుతుంటారు. అయితే పరిమిత దాటినా పసిడి ఏమి అక్రమం కాదని నిపుణులు చెబుతున్నారు.

అధికారులు సీజ్ చేసే అవకాశం ఉండదని వివరిస్తున్నారు. అయితే కొనుగోలు చేసిన బంగారానికి సంబంధించి రశీదులు ఉండాలని చెబుతున్నారు. ఆదాయపు పన్ను చట్టంలో ఒక వ్యక్తి ఎంత బంగారం కలిగి ఉండాలనే దానికి ఎలాంటి నిబంధనలు లేవు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఐటీ సోదాలు జరిగినప్పుడు అధికారులు ఎలాంటి ఆధారాలు అడగకుండా, జప్తు చేయకుండా వదిలేసే కనీస పరిమితులు మాత్రమే ఇవని నిపుణులు చెబుతున్నారు. భారీగా బంగారం ఉన్నప్పుడు వాటికి సంబంధించి రశీదులు కచ్చితంగా ఉండాలని లేకుంటే పసిడిని సీజ్ చేసే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

Gold

నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువ బంగారం మీ ఇంట్లో లేదా బ్యాంకు లాకర్‌లో ఉన్నా ఎలాంటి సమస్య రాదని... అయితే ఆ బంగారం ఎలా వచ్చిందో సరైన ఆధారాలతో నిరూపించాలని సూచిస్తున్నారు కొనుగోలు చేసిన బిల్లులు, బ్యాంకు స్టేట్‌మెంట్లు, బంధువులు ఇచ్చిన బహుమతుల వివరాలు లేదా వారసత్వంగా వచ్చినట్లు రుజువు చూపాలని చెబుతున్నారు. అవి ఉంటే కిలోల కొద్దీ బంగారం ఉన్నా సరే ఎవరూ అభ్యంతరం చెప్పలేరని పేర్కొంటున్నారు. చాలా మంది బంగారం లాకర్‌లో పెడితే భద్రంగా ఉంటుందని అనుకుంటారు. కానీ ఆభరణాలను బట్టి కాకుండా మీ ఆదాయ వనరులకు, మీరు కొన్న లేదా దాచిన బంగారానికి లెక్కలు సరిగా లేకపోతే ట్యాక్స్ పడడం లేదా ఆ బంగారాన్ని సీజ్ చేయడం చేస్తారని హెచ్చరిస్తున్నారు.

అందుకే బిల్లులు లేకండా బంగారం కొనుగోలు చేయకూడదని హెచ్చరిస్తున్నారు. కొంత మంది వ్యాపారులు రశీదు లేకుంటే అసలు ధర కంటే కాస్త తక్కువ ధరకే పసిడి అమ్ముతామని చెబుతున్నారు. వారి వద్ద కొనుగోలుచేస్తే స్వచ్ఛపై నమ్మకం ఉండదు. కాబట్టి బిల్ తో పసిడి కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+