చాలసార్లు ఎటిఎం నుండి డబ్బు విత్ డ్రా చేసేటప్పుడు మీకు స్క్రిన్ పైన మీ అకౌంట్ సేవింగ్స్ లేదా కరెంటు అని అడుగుతుంది. ఎప్పుడైనా సేవింగ్స్ అకౌంట్ అంటే ఏంటి కరెంటు అకౌంట్ అంటే ఏంటి వీటి మధ్య తేడా ఏంటి అని ఆలోచించారా... అసలు సేవింగ్స్ అకౌంట్ ఎవరు వాడుతారు కరెంటు అకౌంట్ ఎవరికీ ఇస్తారు తెలుసా..
మీరు ఏదైనా స్కిం లబ్ది పొందాలనుకుంటే లేదా ఆన్‌లైన్ ట్రాన్సక్షన్స్ చేయాలనుకుంటే మీకు బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి. జీతాలు పొందే ఉద్యోగులకి ప్రతినెల నెల మీ బ్యాంకు అకౌంట్లో జీతం పడుతుంది. ఏదైనా బ్యాంకులో ఆకౌంట్ ఓపెన్ చేసేటపుడు సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్ అనే రెండు రకాల అకౌంట్స్ ఉంటాయి. ఈ రెండు రకాల అకౌంట్స్ డిపాజిట్లు ఇంకా ట్రాన్సక్షన్స్ చేయడానికి ఉపయోగిస్తారు. కానీ ఈ అకౌంట్స్ మధ్య చాల తేడా ఉంటుంది. అయితే సేవింగ్స్ అండ్ కరెంట్ అకౌంట్ మధ్య తేడా ఏంటంటే.. .

రెంటికి మధ్య తేడా
డబ్బు దాచుకునేందుకు లేదా సేవింగ్స్ చేయాలనే ఆలోచనతో ప్రజలు సేవింగ్స్ అకౌంట్స్ ఓపెన్ చేస్తుంటారు. అయితే సేవింగ్స్ అకౌంట్, సాలరీ అకౌంట్, జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఇంకా సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక రకమైన అకౌంట్ ఇలాంటివి అన్ని సేవింగ్స్ అకౌంట్స్ ఉంటారు. వీటి పై రెండున్నర నుంచి నాలుగు శాతం వడ్డీ లభిస్తుంది. అలాగే కరెంట్ అకౌంట్ అనేది ప్రతిరోజు తప్పకుండా పెద్ద మొత్తంలో డబ్బు ట్రాన్సక్షన్స్ చేసే కస్టమర్ల కోసం. దీనిని ఎక్కువగా డబ్బు ట్రాన్సక్షన్స్ చేసే వారి కోసం ప్రత్యేకంగా తిసుకొచ్చారు. అయితే కరెంట్ అకౌంట్ పై వడ్డీ ఉండదు.
కనీస బ్యాలెన్స్
జీరో బ్యాలెన్స్ అకౌంట్స్, సాలరీ అకౌంట్స్ కాకుండా మిగతా సేవింగ్స్ అకౌంట్స్ అన్నిటికి కనీస బ్యాలెన్స్ ఉండడం అవసరం. మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే చార్జెస్ విధిస్తారు. కానీ కరెంట్ అకౌంట్‌లో అలా జరగదు. ఇంకా పెద్ద మొత్తంలో డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు.
ట్రాన్సక్షన్స్ లిమిట్ ఎంత?
సేవింగ్స్ అకౌంటుపై ఒక నెలలో ఎన్ని ట్రాన్సక్షన్స్ చేయవచ్చు అనే దానిపై లిమిట్ ఉంటుంది, కానీ కరెంటు అకౌంటులో అలాంటి పరిమితి లేదు. అంతేకాకుండా, సేవింగ్స్ అకౌంట్లో ఉండే మీ మొత్తంపై కూడా లిమిట్ ఉంటుంది, అయితే కరెంట్ అకౌంట్లో అలాంటి లిమిట్ లేదు.
పన్ను నియమాలు
సేవింగ్స్ అకౌంట్ వడ్డీ ఉంటుంది, వడ్డీ రూపంలో కస్టమర్కి వచ్చే మొత్తం ఆదాయపు పన్ను శాఖ పరిధిలోకి వస్తుంది, అయితే కరెంట్ అకౌంట్ పై వడ్డీ ఉండదు, ఇంకా పన్ను పరిధిలోకి రాదు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications