SWP: మీరు రిటైర్మెంట్ లేదా 60 ఏళ్ళు దాటాక, వృద్ధాప్య సమయంలో ఫైనాన్షియల్ అంటే ఆర్ధికంగా ఇబ్బందులు లేకుండా ఉండాలనుకుంటున్నారా.. అయితే మ్యూచువల్ ఫండ్ల కింద సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (SWP) ఒక బెస్ట్ అప్షన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ పథకం ద్వారా మీరు మీ పెట్టుబడిపై ప్రతి నెలా కనీసం లక్ష రూపాయలు సంపాదించవచ్చు. అయితే ఈ SWPని ప్రారంభించడానికి ముందు మీ దగ్గర కావాల్సినంత మొత్తం ఉండటం అవసరం. ఈ SWP ఫండ్ పొందటానికి మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు, ఎందుకంటే ఈ స్కిం లాంగ్ టర్మ్ పై మంచి రాబడిని ఇస్తాయని నమ్ముతారు. ఈ విధంగా చూస్తే ముందస్తుగా సరైన ఇన్వెస్ట్మెంట్లో పెట్టుబడి పెట్టాలి. అప్పుడు SWP ద్వారా నెల నెల ఆదాయాన్ని సంపాదించవచ్చు, ఇలా క్రమంగా భవిష్యత్తులో మీరు ఆర్థికంగా నిలబడడానికి మీకు సహాయపడుతుంది.

ఈ విధంగా చేస్తే 1 లక్ష సంపాదిస్తారు: లాంగ్ టర్మ్'లో ప్రతి సంవత్సరం 12% నుండి 15% లాభాలు ఇచ్చిన చాల మ్యూచువల్ ఫండ్ పథకాలు ఉన్నాయి. ఒక వ్యక్తి 21 సంవత్సరాల పాటు రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టి, ప్రతి సంవత్సరం 12% రాబడి పొందితే, ఈ మొత్తం దాదాపు రూ. 1 కోటి 8 లక్షలకు పెరుగుతుంది. ఈ విధంగా ఒకేసారి రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు రిటైర్మెంట్ లేదా వృద్ధాప్యం తర్వాత ఇంట్లో కూర్చొని ప్రతి నెలా రూ. లక్ష వరకు సంపాదించవచ్చు.
సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ అంటే ఏమిటి: సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ అనేది మీ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టిన డబ్బును క్రమంగా విత్ డ్రా చేసుకునే పద్ధతి. దీనిలో మీరు మీ మ్యూచువల్ ఫండ్‌కు ప్రతి నెలా మీ బ్యాంక్ అకౌంటుకు ఎంత మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేయాలో ఇంకా ఏ తేదీన చేయాలో తెలియజేయాలి. తరువాత మీ ఫండ్ నుండి ఒక ఫిక్స్డ్ మొత్తం విత్ డ్రా అవుతూ ఉంటుంది, కానీ మిగిలిన డబ్బు అక్కడే పెట్టుబడి వడ్డీని లేదా రాబడి సంపాదిస్తూనే ఉంటుంది. దీనితో మీరు కాంపౌండింగ్ బెనిఫిట్ పొందడం కొనసాగిస్తారు. ఈ పద్ధతి రిటైర్మెంట్ చేసిన వారికి లేదా ఉద్యోగం నుండి విరామం తీసుకుంటున్న వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
లంప్సమ్ కాలిక్యులేటర్ ప్రకారం చూస్తే :
*1 సారి పెట్టుబడి: రూ. 10 లక్షలు
*పెట్టుబడి కాలం: 21 సంవత్సరాలు
*21 సంవత్సరాల మొత్తంపై అంచనా వేసిన రాబడి: సంవత్సరానికి 12%.
*21 సంవత్సరాల తర్వాత పెట్టుబడి విలువ: రూ. 1,08,00,000
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

Financial planning: మెడికల్ బిల్లుల భయం పోవాలంటే.. మీ పేరెంట్స్ కోసం ఇప్పుడే ఈ పనులు చేయండి!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications