STT పన్ను అంటే ఏమిటి.. పెంపు ప్రకటన రాగానే మార్కెట్ ఒక్కసారిగా ఎందుకు కుప్పకూలింది..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించిన సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను (STT) పన్ను ప్రభావంతో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. Securities Transaction Tax పెంచుతున్నట్లు ప్రకటించడంతో మార్కెట్లు తీవ్ర నష్టాలతో ముగిసాయి. నిర్మలమ్మ సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను 0.02 శాతం నుండి 0.05 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించడంతో మూలధన మార్కెట్లలో లావాదేవీలను సూచించే నిఫ్టీ క్యాపిటల్ మార్కెట్స్ ఇండెక్స్ ఆదివారం మధ్యాహ్నం 6 శాతానికి పైగా పడిపోయి 4,365 వద్ద ముగిసింది. ప్రారంభ నష్టాలు తర్వాత కొంత తగ్గి 1 శాతం నష్టంతో ట్రేడ్ అయ్యాయి. అయినప్పటికీ మార్కెట్‌లో అనిశ్చితి స్పష్టంగా కనిపించింది.

అసలు STT అంటే ఏమిటి అని చాలామంది గూగుల్ లో వెతుకుతున్నారు. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (STT) పై చేసిన చిన్న మార్పు భారత స్టాక్ మార్కెట్లను ఎలా కుదిపేసిందనే చర్చలు మొదలు పెట్టారు. సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను (Securities Transaction Tax - STT) పన్ను వెనుక ఉన్న మతలబు ఏంటనే ఆర్థిక నిపుణులు కూడా విశ్లేషణ చేస్తున్నారు. దీని గురించి ఈ కథనంలో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

STT Tax Securities Transaction Tax STT hike 2026 STT increase effect stock market impact investor panic Nifty 50 drop Sensex fall F amp amp O trading derivatives market brokerage cost market bloodbath Indian stock market news STT explained STT increase news market crash stock trading tax capital markets India stock market volatility market sentiment STT effect on investors STT STT 2026 STT 50 F amp amp O STT STT STT
Photo Credit:

సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను అంటే ఏమిటి: సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను (Securities Transaction Tax - STT) అనేది భారతదేశంలో స్టాక్ మార్కెట్‌లో జరిగే షేర్లు, డెరివేటివ్స్, ETFs, ఇతర లిక్విడ్ సెక్యూరిటీల లావాదేవీలపై వసూలు చేసే ప్రత్యేక పన్ను. స్టాక్ ఎక్స్ఛేంజ్‌‑లో దిగుమతి/ఎగుమతి చేసే ప్రతి లావాదేవీపై ప్రభుత్వం వసూలు చేసే ఈ పన్నును 2004లో ప్రవేశపెట్టారు. ప్రధానంగా మార్కెట్ లావాదేవీలను పారదర్శకంగా, నియంత్రితంగా నిర్వహించడానికి, అలాగే ప్రభుత్వానికి రెవెన్యూ సృష్టించడానికి దీన్ని ప్రవేశపెట్టారు. ఈ పన్ను స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లావాదేవీ జరిగే సమయమే ఆటోమేటిక్‌గా వసూలు అవుతుంది. అందుకే ట్రేడర్లు లేదా ఇన్వెస్టర్లు మాన్యువల్‌గా చెల్లించాల్సిన అవసరం లేదు.

ఏయే ఇన్వెస్ట్మెంట్ లావాదేవీలకు వర్తిస్తుంది: STT ప్రధానంగా ఇక్విటీస్ షేర్లు, ఫ్యూచర్స్, ఆప్షన్స్, ETFs, స్టాక్ ఎక్స్ఛేంజ్ ద్వారా ట్రేడయ్యే అన్ని ఇన్వెస్ట్మెంట్ లావాదేవీలపై వర్తిస్తుంది. వ్యక్తులు, కంపెనీలు, FIIs, NRIలు ఈ పన్నును చెల్లించాల్సి ఉంటుంది. షేర్ల కొనుగోలు లేదా అమ్మకాల సమయంలో STT రేట్లు పరిస్థితుల ఆధారంగా 0.1 నుంచి 0.125 శాతం వరకు ఉండవచ్చు. ఫ్యూచర్స్ పై 0.01 నుంచి ఆప్షన్స్‌పై 0.05 శాతం రేట్లు వర్తిస్తాయి.

అనుకూలతలు ఏమిటి ? : STT వలన స్టాక్ మార్కెట్ లావాదేవీలు సులభంగా ట్రాక్ చేయబడతాయి. పారదర్శకత పెరుగుతుంది. ఇది పెట్టుబడిదారులందరికి లావాదేవీల ఖర్చును ముందే చూపిస్తుంది. ప్రభుత్వానికి స్థిరమైన ఆదాయం ఏర్పడుతుంది. STT చెల్లించడం ద్వారా కొన్ని సందర్భాల్లో కేపిటల్ గేన్ పన్ను (Capital Gains Tax) లో రాయితీలు పొందవచ్చు. ఉదాహరణకు, లాంగ్-టర్మ్ షేర్లపై పన్ను తగ్గింపులు STT చెల్లింపును ఆధారంగా ఇస్తాయి.

STT చెల్లింపుతో స్టాక్ మార్కెట్ వ్యూహాలు సులభంగా లెక్కించబడతాయి. ఇన్వెస్టర్లు STT చెల్లించటం వలన లావాదేవీ నియంత్రణలో స్థిరత, సరళతను పొందుతారు. ఇది పెట్టుబడిదారులకు ఒక నిర్ధిష్టమైన భరోసాను కలిగిస్తుంది. మధ్యవర్తులపై ఆధారపడకుండా మార్కెట్లో ప్రత్యక్షంగా పాల్గొనడానికి వీలు కల్పిస్తుంది. ఇన్వెస్టర్ లాభం చేసినా లేదా నష్టం చేసుకున్నా సరే ఇది వసూలు అవుతుంది.

STT ప్రతికూలతలు ఏమిటి: STT రేట్లు పెరిగితే షార్ట్-టర్మ్ ట్రేడర్లు కొంత భారాన్ని అనుభవించవచ్చు. మార్కెట్ లిక్విడిటీ కొంత తగ్గుతుంది. అయినప్పటికీ, దీని లాభం దేశ ఆర్థిక వ్యవస్థకు ఎక్కువగా ఉంటుంది. STT కేవలం స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో జరిగే లావాదేవీలకు వర్తిస్తుంది, ప్రైవేట్ ట్రేడింగ్ లేదా OTC మార్కెట్ లావాదేవీలపై వర్తించదు. క్లుప్తంగా చెప్పాలంటే STT స్టాక్ మార్కెట్ లావాదేవీల పన్ను అని చెప్పవచ్చు, ఇది పెట్టుబడిదారులకు, ప్రభుత్వానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు మానిఫెస్ట్ లాభాలను కలిగించే ముఖ్యమైన పన్ను.

మార్కెట్ షేర్లు ఎందుకు కుప్పకూలాయి: బడ్జెట్ 2026లో ఫ్యూచర్స్‌పై STTని 0.02 శాతం నుండి 0.05 శాతానికి పెంచగా.. ఆప్షన్స్‌ ప్రీమియం, ఎక్సర్సైస్‌పై STTని 0.1 శాతం నుంచి 0.15 శాతానికి పెంచారు. ఈ 0.03 శాతం చిన్న పెంపు అనిపించినప్పటికీ.. డెరివేటివ్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడి చేసిన వారందరిపైనా దీని ప్రభావం గణనీయంగా పడింది. ప్రభుత్వ నిధులకు అదనపు ఆదాయం కోసం ఈ STT పెంపు చేపట్టడం Course Correctionగా కూడా చెప్పబడింది, అయితే ప్రధాన ఉద్దేశం F&Oలో అధిక అంచనాల/speculationని కొంత నెమ్మదింపుచేయడమేనని ప్రభుత్వం చెప్పింది.

ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆందోళనకు కారణం: ఈ మార్పులు ప్రకటించిన వెంటనే, ట్రేడర్లు, ఇన్వెస్టర్లు తీవ్రంగా ఆందోళన చెందారు. STT పెరిగిన కారణంగా లావాదేవీల వ్యయం పెరిగిపోయింది. ఫ్యూచర్స్ లేదా ఆప్షన్స్‌లో ఒక్కో ట్రేడింగ్‌కి ఎక్కువ ఖర్చు రావడంతో, ట్రేడింగ్ వ్యూహాలు మారాయి. STT పెంపు కారణంగా హై‑ఫ్రీక్వెన్సీ ట్రేడర్లు, రిటైల్ డెరివేటివ్ పెట్టుబడిదారులు, అర్బిట్రాజ్ ఆపరేటర్లు తమ లాభాలను రక్షించుకోవడానికి జాగ్రత్తగా ట్రేడింగ్ చేసారు. ఇది మార్కెట్‌లో లిక్విడిటీ తగ్గించడానికి దారి తీసింది.

ఫిబ్రవరి 1, 2026న, ప్రత్యేక ఆదివారం ట్రేడింగ్ సమయంలో స్టాక్ మార్కెట్లు భారీ పతనం రికార్డు నమోదు చేశాయి. BSE సెన్సెక్స్ 2,000కి పైగా పాయింట్లతో కుదిపి, Nifty 50 25,000 కంటే దిగువకు చేరింది. మొత్తం మార్కెట్‌లో మూలధన సూచీలు నష్టాలతో ముగిసాయి. BSE Ltd, Angel One, Groww వంటి షేర్లు 13.5 శాతం వరకు తగ్గాయి, MCX కూడా పెద్ద పతనాన్ని చూపింది. ఈ పతనం కారణంగా రూ.60 లక్షలకు కోట్లకు పైగా సంపద ఆవిరైపోయింది.

డెరివేటివ్ మార్కెట్, అంటే ఫ్యూచర్స్, ఆప్షన్స్ లావాదేవీలు, భారత ఇక్విటీస్ వ్యవస్థలో చాలా ముఖ్యమైనవి. STT పెరిగి ట్రేడింగ్ ఖర్చులు ఎక్కువ కావడంతో, ట్రేడర్లు ట్రేడింగ్‌లో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. దాంతో, ట్రేడింగ్ వాల్యూమ్ తగ్గడం, బ్రోకరేజ్ కంపెనీల లాభాలపై ప్రభావం వచ్చే అవకాశం ఉంది.

ఈ పరిస్థితిని చూసి పెద్ద సంస్థలు, FIIs కూడా మార్కెట్‌లో కాస్త దూరమయ్యారు. నిపుణులు చెబుతున్నట్టు, ఈ STT పెంపు తాత్కాలికంగా మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. కానీ దీర్ఘకాలికంగా అంత పెద్ద సమస్య కాకపోవచ్చు. ప్రభుత్వం ఇతర పన్నులు, కస్టమ్స్, కార్పొరేట్ పన్నులు సరిచేసిన తర్వాత, STT పెంపు మార్కెట్‌ను గణనీయంగా మార్చకపోవచ్చని సూచిస్తున్నారు.

ఏయే స్టాక్స్ నష్టాలు పాలయ్యాయి: BSE Ltd షేర్లు 10%, ఏంజెల్ వన్ 10%, 360 One 10%, Groww 8.7%, Nuvama 8.1% వరకూ పడిపోయాయి. NIFTY50 ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో 1 లాట్ కోసం STT రూ. 325 నుంచి రూ. 817కి పెరిగింది. అంటే రూ. 1 లక్ష టర్నోవర్‌పై STT రూ. 20 నుంచి రూ. 50కి పెరిగింది. ఈ పెరుగుదల ప్రతి ట్రేడర్‌కు బ్రేక్-ఈవెన్ ఖర్చును గణనీయంగా పెంచుతుంది. ఉదాహరణకు, ఫ్యూచర్స్ ట్రేడ్ 5 పాయింట్లకు (రూ.325/65) బ్రేక్‑ఈవెన్‌లో ఉండేది. అయితే STT పెంపు తర్వాత ఇది 12 పాయింట్లకు (రూ. 812/65) చేరుతుంది.

అదేవిధంగా ఆప్షన్స్ ప్రీమియంపై STT 0.10 శాతం నుంచి 0.15 శాతానికి పెరిగింది. ఉదాహరణకు రూ. 100 ప్రీమియం NIFTY కాల్ ఆప్షన్‌కు మునుపు రూ. 6.5 STT వర్తించేది, ఇప్పుడు రూ. 9.75 అవుతుంది. ఈ మార్పులు ట్రేడర్ల ఖర్చులను పెంచడంతో F&O విభాగంలో లావాదేవీల వాల్యూమ్ తగ్గే అవకాశం ఉంది. ప్రభావం కేవలం ట్రేడర్లకే పరిమితం కాదు.

AMC కంపెనీలు HDFC AMC, ICICI Pru AMC, 360 One వాటిలో హెడ్జింగ్ కోసం ఉపయోగించే ఫండ్స్‌పై STT పెరుగుదల ప్రభావం చూపుతుంది. వాల్యూమ్ తగ్గితే ఆ కంపెనీల నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి. ఈ పరిణామం కమోడిటీ ఫ్యూచర్స్చ ఆప్షన్స్ మార్కెట్ పై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చని నిపుణులు చెబుతున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+