RBI New Governor: కొన్ని వారాల కిందట ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తిరిగి మూడో టర్మ్ పొందుతారని వార్తలు వచ్చాయి. అయితే ద్రవ్యోల్బణాన్ని హ్యాండిల్ చేయటంలో దాస్ విఫలం కావటంతో ఈసారి ఛాన్స్ మిస్ అయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలో నేటితో దాస్ టర్మ్ పూర్తి కాబోతోంది.
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందగమంలో పడిన వేళ భారత ప్రభుత్వం కొత్త రిజర్వు బ్యాంక్ గవర్నర్ గా సంజయ్ మల్హోత్రాకు ఆ బాధ్యతలు అప్పగించింది. మల్హోత్రా కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని అమలు చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. దీనికి తోడు ప్రస్తుతం మల్హోత్రా ముందు ఉన్న మరో పెద్ద సమస్య అధిక ద్రవ్యోల్బణం. ఈ రెంటినీ ట్యాకిల్ చేయటంలో ఆయన తన చెతురతను చూపాల్సి ఉంటుంది. అధికారికంగా రేపటి నుంచి ఆర్బీఐ నూతన గవర్నర్ బాధ్యతలను ఆయన ప్రారంభించనున్నారు.

సంజయ్ మల్హోత్రా ఐఐటీ కాన్పూర్ నుంచి కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అలాగే ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రిత్వ శాఖలో రెవెన్యూ కార్యదర్శిగా కీలక బాధ్యతలు చేపడుతున్నారు. పైగా ఆయనకు పవర్, ఫైనాన్స్ అండ్ టాక్సేషన్ వంటి రంగాల్లో నైపుణ్యం కలిగిన పబ్లిక్ పాలసీలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవాన్ని కలిగి ఉన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ దారుణమైన స్థితిలోకి చేరుకోవటం ప్రారంభించిన వేళ దానిని తిరిగి గాడిన పెట్టడానికి రిజర్వు బ్యాంక్ 26వ గవర్నర్ గా మల్హోత్రా అడుగుపెడుతున్నారు. దీనికి ముందు గతంలోని భారతీయ రిజర్వు బ్యాంక్ గవర్నర్లు సైతం అకస్మాత్తుగా రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే.
వాస్తవానికి అమెరికా సెంట్రల్ బ్యాంక్ తన కీలక వడ్డీ రేట్లను తగ్గించుకుంటూ వెళుతుండగా.. ఇదే తరహాలో ఇండియాలోనూ ఆర్బీఐ రెపో రేటు తగ్గించాలనే ఒత్తిళ్లు, డిమాండ్ అనేక పక్షాల ప్రజల నుంచి భారీగా వినిపిస్తోంది. దాదాపు రెండేళ్లుగా ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయాలంటూ దాస్ రేట్లను యాథాతథంగా ఉంచినప్పటికీ అనుకున్న స్థాయిలో ఫలితాలు కనిపించకపోవటంతో ఆయన తన స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. పైగా దాస్ నేపథ్యంలో ఇటీవల విడుదలైన జీడీపీ గణాంకాలను పరిశీలిస్తే.. జూలై-సెప్టెంబర్‌లో 5.4 శాతానికి 7 త్రైమాసికాల్లో కనిష్ట స్థాయికి దిగజారటం ఆందోళనలను పెంచేసింది.
మల్హోత్రానే ఎందుకు..?
వాస్తవానికి మల్హోత్రాకు కేంద్ర ఆర్థిక మంత్రితో మంతి సంబంధాలు ఉన్నాయి. అందువల్ల ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా ద్రవ్య విధానాన్ని అమలు చేయటంలో మంచి టీమ్ వర్క్ చేసేందుకు ఇది సహాయపడుతుందని అందరూ భావిస్తున్నారు. దీనికి తోడు 2022లో సంజయ్ మల్హోత్రాను రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్‌గా కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. మల్హోత్రాకు ఈ పనిలో సుదీర్ఘ అనుభవం ఉంది. కేంద్ర బడ్జెట్‌ను రూపొందించడంలో సంజయ్ మల్హోత్రా కీలక పాత్రధారిగా ఉండటం గమనార్హం. ఏదైనా సమస్యపై పని చేసే ముందు దాని గురించి విస్తృతంగా పరిశోధించటం మల్హోత్రాకి ఉన్న ప్రధాన బలంగా చెప్పుకోవచ్చు.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications