ఇన్వెస్ట్మెంట్ చేయడం గురించి సలహా ఇచ్చేవారు చాలా మంది ఉంటారు. కానీ కొన్ని సలహాలు ఉపయోగపడతాయి, మరికొన్ని అనవసరమైనవి. సాధారణంగా కొందరు ఈక్విటీలో పెట్టుబడి పెట్టమని చెబుతుంటారు, మరికొందరు మ్యూచువల్ ఫండ్స్ నమ్మకమైది కాబట్టి ఎస్ఐపి ద్వారా పెట్టుబడి పెట్టమని సలహా ఇస్తారు. పెట్టుబడిలో మీ అనుభవం, ఆలోచన మాత్రమే మీకు ఏది సరైనదో ఏది తప్పో నిర్ణయిస్తాయి. కానీ మీరు ఇన్వెస్ట్మెంట్స్ రంగంలో కొత్త వారైతే ఏదైన కొత్త పద్ధతులను అలవాటు చేసుకోవాలంటే SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) చాలా మంచి అప్షన్ కావచ్చు.
ఎస్ఐపి అంటే ఏంటి: సాధారణంగా ఉద్యోగం చేస్తూ జీతం పొందేవారు ఒకేసారి పెద్ద మొత్తం డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉండదు. అందుకే కొంచెం కొంచెం చిన్న మొత్తంతో పెట్టుబడి స్టార్ట్ చేయాలనీ ఆలోచిస్తుంటారు. మీరు SIP ద్వారా మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇందులో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా తక్కువ రిస్క్ ఉంటుంది అలాగే ఎక్కువ కాలంలో మంచి రాబడి అందిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా SIP ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. దీనికి పెద్దగా డబ్బు అవసరం లేదు. మీ దగ్గర రూ.500 లేదా రూ.1,000 ఉన్న ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయవచ్చు.

ఎస్ఐపి ప్రయోజనాలు: SIP ద్వారా మీరు ఏదైనా ఒక స్టాక్ లేదా రంగంపై ఆధారపడాల్సిన పని లేదు. కానీ క్రమం తప్పకుండ పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం. మీరు ప్రతి నెలా ఒక ఫిక్స్డ్ మొత్తాన్ని పెట్టుబడి పెట్టినప్పుడు మీ కార్పస్ క్రమంగా పెరుగుతుంది ఇంకా లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్ ఇస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా SIPలో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య పెరిగింది. చాలా మంది పెట్టుబడిదారులు సంవత్సరాలుగా SIP ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఇంకా ఎంతో ప్రయోజనం పొందుతున్నారు. మీరు ఇల్లు కొనాలన్నా, పిల్లల చదువు లేదా రిటైర్మెంట్ తరువాత రిలాక్స్ అవ్వాలనుకుంటే SIP ఒక అద్భుతమైన అప్షన్ కావచ్చు.
SIP ఎలా స్టార్ట్ చేయాలి: మొదట ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా KYC ప్రాసెస్ పూర్తి చేయండి. మీ కాంటాక్ట్ వివరాలు సరిగ్గా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోండి అంటే ఈక్విటీ ఫండ్, డెట్ ఫండ్ లేదా మల్టీ-అసెట్ ఫండ్.
మీరు మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు SIP ఫ్రీక్వెన్సీని నిర్ణయించుకోవాలి అంటే ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతినెల లేదా ఏడాది. మీ ఆదాయం ఇంకా ఖర్చుల ప్రకారం ఈ నిర్ణయం తీసుకోండి. ఆలోచించకుండా ఇతరులను అనుసరించవద్దు. మీ ఆదాయం, సేవింగ్స్ ఇంకా మీ ఆర్థిక లక్ష్యాల ఆధారంగా మీ SIPని ప్లాన్ చేసుకోండి. అందరూ ఏదో ఒక రోజు ఉద్యోగం నుండి రిటైర్మెంట్ తీసుకుంటారు. రిటైర్మెంట్ తర్వాత కూడా ఖర్చులు తగ్గవు కాబట్టి మీరు ఖర్చులు ఆదా చేయడానికి ప్రయత్నించండి. ఇలా SIP కాలక్రమేణా పెద్ద మొత్తంలో ఫండ్స్ సమకూర్చుకోవడంలో మీకు సహాయపడుతుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications