భారతదేశంలో డిజిటల్ భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు నుంచి దేశంలో అమ్ముడవుతున్న లేదా విదేశాల నుండి దిగుమతి అవుతున్న ప్రతి కొత్త మొబైల్ ఫోన్‌లో సంచార్ సాథీ యాప్ ముందుగానే ఇన్‌స్టాల్ చేయడం తప్పనిసరి. టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) సోమవారం దీనిపై అధికారిక ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా, ఈ యాప్‌ను మొబైల్ వినియోగదారులు ఎలాంటి పరిస్థితుల్లోనూ తొలగించలేరు. Apple, Samsung, Xiaomi, Vivo, Oppo వంటి అన్ని ప్రధాన కంపెనీల స్మార్ట్‌ఫోన్లకు కూడా ఈ నియమం వర్తించనుంది.
కొత్త మొబైల్ ఫోన్‌ను సెటప్ చేసే సమయంలోనే 'సంచార్ సాథీ' యాప్ స్పష్టంగా కనిపించేలా, సులభంగా తెరవగలిగేలా కంపెనీలు చూసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. యాప్‌లోని ఏ సేవనైనా నిలిపివేయడం లేదా పరిమితం చేయడం కంపెనీలకు అనుమతి లేదు. వినియోగదారులు సంపూర్ణంగా యాప్ ఫీచర్లు ఉపయోగించేలా ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి అన్ని కంపెనీలకు 90 రోజుల గడువు ఇచ్చారు. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న ఫోన్లలో కూడా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా 'సంచార్ సాథీ' అందుబాటులోకి తీసుకురావాలని DoT సూచించింది.

భారతదేశంలో మొబైల్ ఫ్రాడ్‌లు, నకిలీ ఫోన్ల విక్రయాలు, ఫోన్ దొంగతనం, స్పామ్ కాల్స్, బ్యాంకింగ్ మోసాలు రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, డిజిటల్ రక్షణను మరింత కట్టుదిట్టం చేయడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. ఫోన్ దొంగిలించబడితే లేదా పోగొట్టుకుంటే చాలా మంది మానసికంగా, ఆర్థికంగా నష్టపోతున్నారు. అలాగే, నకిలీ ఫోన్‌లు టెలికాం నెట్‌వర్క్‌లను దెబ్బతీస్తున్నాయి. ఈ సమస్యలన్నింటికీ కేంద్ర బిందువుగా సంచార్ సాథీ కీలక పాత్ర పోషిస్తుంది.
వివాదంపై కేంద్రం స్పందన: అయితే ఈ యాప్ వివాదానికి దారి తీయడంతో కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దీనిపై స్పష్టత ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. సంచార్ సాథి యాప్‌ను తమ డివైజ్ లలో ఉంచుకోవడం లేదా తొలగించడం పూర్తిగా యూజర్ల ఇష్టమని పేర్కొన్నారు. మీకు సంచార్ సాథి యాప్ వద్దనుకుంటే మీరు దానిని డిలీట్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్. ఈ యాప్ ను ప్రతి ఒక్కరికీ పరిచయం చేయడం మా బాధ్యత. వారి డివైజ్‌లలో దానిని ఉంచుకోవడం లేదా తొలగించడం అనేది వాళ్ల ఇష్టమని మంత్రి సింధియా స్పష్టం చేశారు.
సంచార్ సాథీ యాప్ అంటే ఏమిటి : 2023లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ యాప్ వినియోగదారులకు అనేక రకాల భద్రతా సేవలను అందిస్తుంది. ముఖ్యంగా, పోయిన లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్‌ను వెంటనే బ్లాక్ చేయించవచ్చు. ఆ ఫోన్ ఎక్కడ ఉపయోగించబడుతున్నదో కనుగొని తిరిగి ట్రేస్ చేయించుకోవచ్చు. మీ పేరుతో ఎన్ని మొబైల్ నంబర్లు రిజిస్టర్ అయ్యాయి అని చెక్ చేసుకోవచ్చు. అనుమానాస్పద వెబ్ లింకులు, స్పామ్ కాల్స్, ఫిషింగ్ ప్రయత్నాలు అన్నింటినీ అరికట్టే విధంగా ఈ యాప్ పనిచేస్తుంది. ఇక ఈ సేవలను పొందడానికి OTP ధృవీకరణ కూడా అవసరం లేదు.
ఈ యాప్ ఎందుకు ప్రజాదరణ పొందింది? ఇప్పటి వరకు ఈ యాప్ ద్వారా 4.214 మిలియన్ కంటే ఎక్కువ మొబైల్ ఫోన్‌లు బ్లాక్ చేయబడ్డాయి.2.611 మిలియన్ల ఫోన్లు తిరిగి కనుగొనబడ్డాయి. మీ పేరుతో ఉన్న నంబర్లను తనిఖీ చేయడానికి 28.8 మిలియన్ అభ్యర్థనలు అందగా..వాటిలో చాలా సమస్యలు పరిష్కరించబడ్డాయి. గూగుల్ ప్లే స్టోర్‌లో 10 మిలియన్లకుపైగా డౌన్‌లోడ్‌లు, ఆపిల్ స్టోర్‌లో 9.5 లక్షలకుపైగా డౌన్‌లోడ్‌లు నమోదయ్యాయి. ఇప్పటివరకు 11.4 మిలియన్లకు పైగా యూజర్లు నమోదు చేసుకున్నారు.
ప్రతి మొబైల్‌లో ఈ Sanchar Saathi app తప్పనిసరిగా ఉంటే, నకిలీ ఫోన్లను కొనకుండా నివారించవచ్చు, ఫోన్ దొంగతనాలను తగ్గించవచ్చు, ఆన్‌లైన్ మోసాలను అడ్డుకోవచ్చు, ప్రజల భద్రత మరింత పెరుగుతుంది. డిజిటల్ ఇండియా లక్ష్యాలకు ఇది ఒక మరొక పెద్ద అడుగు అని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications